Categories: FeaturedMovie News

Prakash Raj : 2 సంవత్సరాల నుండి చూస్తున్నా.. నువ్వు ఎవడ్రా కాదు… పనిచేసి చూపించు : ప్రకాష్ రాజ్

Prakash Raj : ప్రకాష్ రాజ్.. ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఈయన తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. రంగస్థల నటుడుగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఆరు భాషలలో దాదాపుగా 200లకు పైగా సినిమాలలో నటించాడు. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యూయెట్’ సినిమా ఆయనకు నటుడుగా గుర్తింపు తెచ్చింది. ఆరు భాషలలో దాదాపుగా అందరు స్టార్ హీరోలతో కలసి నటించి మెప్పించారు. నటుడుగానే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగా కూడా చేశారు.

ఎవరు నువ్వు అన్నది ముఖ్యంకాదు… పని చేసి చూపించు…

తెలుగులోకి ‘హాయ్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు ప్రకాష్ రాజ్. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలు అంటే ప్రకాష్ రాజ్ లేకుండా సినిమా ఉండేది కాదు. 2021 లో తెలుగు మూవీ అసోసియేషన్ కు సంబందించిన మా ఎన్నికలలో అధ్యక్ష పదవికి మంచు విష్ణుతో పోటీ పడ్డారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మా ఎన్నికలలో పోటీచేయడం గురించి, ఎన్నిక గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఎన్నికలలో అసలు ఎందుకు పోటీ చేయాలి అని అనుకున్నారు అని ప్రశ్నించగా.. 2,3 సంవత్సరాల నుండి గమనిస్తున్నాను, ఎదో లోటు కనిపిస్తోంది. ఉన్న వారు సరిగా చేయట్లేదని కాదు కానీ నిర్ణయాలు మారాలి అని అనిపించింది. అపుడు అందరితోనూ మాట్లాడితే మీరు చెప్పేది కరెక్టే కానీ మీరు రారు కదా అన్నారు. అందుకు నేను వస్తే మీరు గెలిపిస్తారా అని అడిగితే తప్పకుండా అనడంతో పోటీ చేసాను. కానీ అందరూ నువ్వు ఎవరు, హిందూ ద్వేషి, నాన్ లోకల్, ఇలాంటి వాదనలతో పొలిటికల్ కలర్ వచ్చేసింది ఎన్నికలలో. నేను ఒకటే చెప్పాను నువ్వు ఎవ్వరు కాదు ముఖ్యం, నువ్వు ఏమ్ చేస్తావ్ అన్నది చూడాలి అని చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago