Suchendra Prasad : రోజుకో మలుపు తిరుగుతున్న నాలుగు స్థంబాలాట.. అదే నరేష్, రమ్య, పవిత్ర లోకేష్, సుచేంద్ర ప్రసాద్ ల గోల ఇంకా అయిపోలేదు. యూట్యూబ్ చూసినా మరే ఇతర సోషల్ మీడియాల్లో చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. నిన్నంతా రమ్య, తన భర్త నరేష్ పవిత్ర లోకేష్ లను మైసూర్ లో ఒకే గదిలో ఉన్నట్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇక ఈ వీడియో వైరల్ అయిన కాసేపటికే రమ్య రాకేష్ శెట్టి అనే వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ నరేష్ గోల చేయడం అన్నీ చక చకా జరిగిపోయాయి. ఇక పవిత్ర లోకేష్, నరేష్ లు మాకు సపోర్ట్ చేయండి తప్పంతా నరేష్ మూడో భార్య రమ్యదే అంటూ వీడియో విడుదల చేసారు.
పవిత్ర నా భార్య… నరేష్ ఎవరో నాకు తెలియదు…
ఇక మళ్ళీ సీన్ లోకి పవిత్ర మాజీ భర్త కూడా వచ్చేసాడు. పవిత్ర మొన్నా మధ్య ఇంటర్వ్యూల్లో సుచేంద్ర ప్రసాద్ నా భర్త కాదు మేము సహజీవనం చేసాము అంటూ మాట్లాడింది. కానీ సుచేంద్ర ప్రసాద్ మాత్రం అందుకు పూర్తి భిన్న కథనం చెబుతున్నారు. పవిత్ర నేను పెళ్లి చేసుకున్నాం మాకు ఇద్దరు పిల్లలు, మేము సహజీవనం చేయలేదు భార్యాభర్తల లాగా కలిసి ఉన్నాం అంటూ చెప్పారు.
16 ఏళ్లుగా మేము కలిసుంటున్నామని, తన పాసుపోర్టు లో భర్తగా నాపేరు ఉంటుంది నా పాసుపోర్టు లో భార్యగా తన పేరు ఉందని మేమింకా విడాకులు తీసుకోలేదని చెప్పారు. పవిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్తోందని తెలుసు కానీ నరేష్ తో తనకున్న రిలేషన్ తెలియదని, అసలు నరేష్ ఎవరో తనకు తెలియదని మాట్లాడారు. వాళ్లిద్దరి రిలేషన్ గురించి తెలియదని స్నేహితులు చెప్పినప్పుడే తెలిసింది అంటూ సుచేంద్ర ప్రసాద్ కామెంట్స్ చేసారు. మొత్తానికి ఇటు నరేష్ రమ్యలకు గాని అటు పవిత్ర సుచేంద్ర లకు గాని విడాకులు రాలేదన్నమాట… అయితే ఇందులో ఏవి నిజమో ఏవి అపద్దమో తెలియాల్సిఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…