బుల్లితెరపై ఎప్పటికీ ఓ అంతుచిక్కని ప్రశ్నలా వెంటాడుతూ ఉండే టాపిక్ ఒకటి సుధీర్, రష్మీ పెళ్లి. ఆ ఇష్యూపై వారి అభిమానులు ఎప్పుడూ ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు. తెరపై ప్రేక్షకులను ఎంటర్టయిన్ చేసేందుకు మాత్రమే తాము అలా నటిస్తామని, అంతకు మించి మా మధ్యన ఎలాంటి రిలేషన్ లేదని ఎన్నో సార్లు రష్మీ, సుధీర్ క్లారిటీగా చెప్పానా ఫ్యాన్స్ మాత్రం వారి జోడీ ఎప్పటికైనా జంట కావాలని ఎదురు చూస్తూనే ఉన్నారు.
ఆన్ స్క్రీన్ మీద వారి కెమిస్ట్రీ అలా ఉంటుందని, ఆఫ్ స్క్రీన్‌లో అసలు మాట్లాడుకోమని, అంత క్లోజ్‌గా ఉండమని తమ బంధం గురించి ఎన్నో సార్లు చెప్పారు. అయినా కూడా వారి గురించి ప్రసారమైన ప్రతీసారి అభిమానులు మాత్రం కళ్లార్పకుండా చూస్తూనే ఉన్నారు.
ఇకపోతే సుధీర్, రష్మీ మధ్య ఉన్న బంధం కేవలం ఆన్ స్క్రీన్‌కే సొంతమా ? లేదంటే వారి క్లోజ్‌నెక్ ఆఫ్ స్ర్కీన్ కూడా కంటిన్యూ అవుతుందా అన్న సందేహంపై జబర్దస్త్ మరియు శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలకు మేకప్ ఛీప్‌గా వ్యవహరిస్తోన్న బాలకృష్ణ చెప్పిన సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.
తనకు తెలిసినంత వరకు సుధీర్, రష్మీ మధ్య ఎలాంటి బంధమూ లేదని బాలకృష్ణ తెలిపారు. తనని ఇప్పటివరకు చాలా మంది ఈ ప్రశ్న అడిగారని కూడా ఆయన వివరించారు. కేవలం షోలో హైప్ తీసుకురావడానికే తప్ప వారిద్దరూ మధ్య అందరూ అనుకునేంత ఏంలేదని ఆయన చెప్పుకొచ్చారు.
అలా చేస్తే జనాలు కొంచెం ఆసక్తి తిలకిస్తారన్న ఉద్దేశంతోనే వారిద్దరూ అలా స్క్రీన్‌పై అలా నటిస్తారని ఆయన అన్నారు. తనక్కూడా ఒకప్పుడు అలానే అనిపించేదన్న ఆయన, ఆ తర్వాత అది నిజం కాదని తనకు అర్థమైనట్టు ఆయన స్పష్టం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…