బాలీవుడ్ ప్రేమపక్షులు కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ జంట గురించి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ వీరి పెళ్లి విషయం గురించి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి కానీ ఈపెళ్లి గురించి ఈ జంట చెప్పక పోవడం విశేషం.
ఇదిలా ఉండగా కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో చాలా ఘనంగా వీరి వివాహాన్ని జరుపుకున్నారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రత సిబ్బంది నేపథ్యంలో వీరి వివాహాన్ని జరుపుకున్నారు.ఇకపోతే కత్రిన వివాహ వేడుకలకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా మనకు సోషల్ మీడియాలో లభించలేదు. అందుకు గల కారణం ఈమె తన పెళ్లి వీడియోని మొత్తం ఒక ఓటీటీ సంస్థకు సుమారు వంద కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు వీడియోలు కానీ ఇంతవరకు బయటకు రాకపోయినా ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలలో కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి చూపులలో రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో ఎంతోమంది నెటిజనులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక వీరి పెళ్ళి వీడియోను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలను అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి పలువురు సిని ప్రముఖులు వ్యాపారవేత్తలు సమక్షంలో కత్రినా విక్కీ కౌశల్ ఒకటి కావడంతో వీరికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…