Movie News

అఖండ సినిమాలో బాలయ్య కూతురు బ్యాక్ గ్రౌండ్ ఏంటి..ఆ చిన్నారి ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో తెలుసా?

బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇదివరకే తెరకెక్కిన ఈ సినిమాలో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకొని కాసుల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమా కూడా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అంటూ పలువురు భావిస్తున్నారు.

ఇక అఖండ సినిమాలో కీలక మలుపు తిరిగే సన్నివేశంలో ఒక చిన్నారి నటించింది. ఈ చిన్నారి వల్ల ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు ఈ సినిమాలో నటించిన ఆ చిన్నారి ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటి? తనకు ఎలా సినిమా అవకాశాలు వచ్చాయి? అనే విషయం గురించి పెద్ద ఎత్తున వెతకడం మొదలు పెట్టారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు ఈ బుడ్డ దాని గురించి తెలుసుకుంటారని చెప్పారు.ఆరోజు బోయపాటి శ్రీను చెప్పిన విధంగానే ఈ రోజు ప్రతి ఒక్కరు ఆ చిన్నారి ఎవరు అనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. ఇక ఈ చిన్నారి పాత్రలో నటించిన అమ్మాయి పేరు బేబీ దేష్ణ. ఈ చిన్నారి ఎంతో అద్భుతంగా నటిస్తూ మంచి ఆదరణ దక్కించుకుంది.

ఈ సందర్భంగా ఈమె తల్లిదండ్రులు మాట్లాడుతూ మా కూతురికి ఒకేసారి బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. షూటింగ్ సమయంలో ఆ చిత్ర బృందం మొత్తం తనని వారి కుటుంబ సభ్యులుగా భావించారని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.ఇక తనకి ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా వచ్చాయి అనే విషయానికి వస్తే తన ఫోటోలను తల్లిదండ్రులు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వల్ల ఆ ఫోటోలను చూసిన దర్శకనిర్మాతలు వారిని సంప్రదించి ఆ చిన్నారిని అఖండ సినిమాలో తీసుకున్నారని వెల్లడించారు. మొదటి సినిమానే ఇలా విజయవంతం కావడంతో ప్రస్తుతం తనకు మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago