జబర్దస్త్ కామెడీ షో లో ఎక్కువగా పాపులారిటీ సాధించిన కమెడియన్ ఎవరంటే.. టక్కున గర్తుకు వచ్చే పేరు సుడిగాలి సుధీర్. అతడు ఈ రోజు ఇన్ని షోలు.. చేస్తూ ఈ స్థాయిలో ఉన్నాడంటే కారణం ఆ జబర్దస్త్ కారణంగానే. అంటే మల్లెమాలకు అతడు ఎన్నో సార్లు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఎనిమిదేళ్లుగా జబర్దస్త్ కార్యక్రమంతో ఆయన అనుబంధం ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతుంది.
ఈ కామెడీ షోకి ఎంతో మంది వచ్చారు.. వెళ్లిపోయాడు.. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం షోని వదిలి వెళ్లలేదు. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ను వదిలే ప్రసక్తే లేదు అంటూ ఎన్నోసార్లు చెప్పాడు సుధీర్. కానీ తాజాగా ఓ విషయం వార్తల్లో వస్తుంది. త్వరలో సుధీర్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేస్తాడు అని ప్రచారం జరుగుతోంది. మల్లెమాల ప్రొడక్షన్స్ ప్రతి ఏడాది జబర్దస్త్ కమెడియన్స్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ఈ అగ్రిమెంట్ బ్రేక్ చేసిన వాళ్లు మల్లెమాల ప్రొడక్షన్‌కు రూ.10 లక్షలు ఫైన్ కూడా కట్టాలి. ఇలా ఈ అగ్రిమెట్ ను బ్రేక్ చేసి బిగ్ బాస్ లోకి వెళ్లిన ముక్కు అవినాష్ రూ.10 లక్షలు కట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి సుధీర్ ఈ సంవత్సరం కొనసాగాలా.. వద్దా.. అనే సందిగ్ధంలో ఉన్నారట. జబర్దస్త్ లో అతడు కొనసాగేందుకు ఆసక్తి చూపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
ఇటు సినిమాలు.. అటు షోలు బ్యాలెన్స్ చేయలేక అతడు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. అందుకే ఈ ఏడాది తన అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకుంటున్నాడు అని తెలుస్తోంది. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి మళ్లీ జబర్దస్త్‌లోకి రావాలని ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…