Sudigaali Sudheer : తెలుగు బుల్లితెర అభిమానులను జబర్దస్త్ ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో అభిమానులను ఆకట్టుకోవడమే కాదు చాలా మంది నటీ నటులకు జీవితాలను ఇచ్చింది. ఈ షో ద్వారా స్టార్ డమ్ తెచ్చుకున్న వాళ్ళు ఎందరో. అయితే కారణాలు తెలియవు కానీ దీని నుంచి నాగబాబు, చంద్ర, ఆర్పీ మొదట వెళ్లిపోయారు. ఇటీవల సుధీర్, శీను, అనసూయ వెళ్ళిపోగా ఇపుడు శీను తిరిగి జబర్దస్త్ కు వచ్చేసారు. ఇపుడు సుధీర్, చంద్ర మళ్ళీ మల్లె మాలలో కనిపించబోతున్నారు.
భలే మంచి రోజు అని రాబోతున్న సుధీర్, చంద్ర…
ఎవరి ఆలోచన తెలియదు కానీ సుధీర్, చంద్రలు మళ్ళీ మల్లె మాలలో కనిపించునున్నారు. అయితే ఇపుడు రావడానికి కారణం కూడా ఈటీవీ మీదున్న ప్రేమ అని తెలుస్తోంది. తాజాగా ఈటీవీ ఛానల్ 27వ వార్షికోత్సవం అంటూ ఓ స్పెషల్ ఈవెంట్‌ను మల్లెమాల ప్లాన్ చేశారు. భలే మంచి రోజు అనే ఈ ఈవెంట్‌లో సుధీర్, చంద్రలు కనిపించారు. ఈ ఈవెంట్‌కు యాంకర్‌గా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడు. ప్రమోలో సుధీర్, చంద్ర ఎంట్రీ కనిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే సుధీర్, చంద్ర ఇకపై ఎప్పటికీ కూడా మల్లెమాల ఈవెంట్లలో పాల్గొనరని అంతా అనుకున్నారు కానీ ఈ ప్రమోతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సుధీర్ ఎందుకు వెళ్లిపోయాడో తెలియదు కానీ చాలా కారణాలు వినిపించాయి. రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తున్నారని కొందరు, మరికొందరు మల్లెమాలలో గుర్తింపు లేకపోవడం అని అభిప్రాయపడ్డారు. మొత్తానికి సుధీర్ మళ్ళీ ఈటీవీలో కనిపించబోతున్నాడు. అయితే ఇది కేవలం ఈ ఒక్కసారి, ఈ ఈవెంట్‌కు మాత్రమే అన్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…