Categories: FeaturedMovie News

Chittibabu : ఇండస్ట్రీ లో చిరంజీవి ఒక్కడే గొప్పోడా… ఆయన లేకుంటే ఇక్కడేమి జరగదా.? డబ్బు కోసం దిగజారే మనస్తత్వం అతనిది : త్రిపురనేని చిట్టిబాబు

Chittibabu : చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆ సినిమా ప్రచారం చేయడానికి ఒక దిగ్గజం వస్తే ఆ సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ఇది ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీ ఫాలో అవుతున్న వ్యూహమే. ఇక సక్సెస్ మీట్లకు కూడా వచ్చి హీరోని, సినిమాను, డైరెక్టర్ ను పొగిడి మరింత వసూళ్లను పెంచే కార్యక్రమం చేస్తున్నాం. ఇక ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరు తన సినిమాల జోరు పెంచాడు. అలాగే ఇతర హీరోల సినిమాలకు ప్రమోషన్స్ నిర్వహించడం చూస్తున్నాం. నిజానికి ఒక చిన్న సినిమా అయినా చిరంజీవిని సదరు ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ లేదా హీరో అడిగి మా సినిమా గురించి చెప్పండి అని అడిగితే చాలా వరకు కాదు అని చెప్పరు. అయన చాలా చిన్న సినిమాలకు అలా ప్రమోషన్స్ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక హిందీ సినిమాకు ప్రచార బాధ్యతలన్ని నెత్తిన వేసుకుని మరీ చేసారు చిరు. కానీ దీనివల్ల అనేక విమర్శలను ఎదుర్కొన్నారు.

లాల్ సింగ్ చద్దా.. కార్తికేయ 2.. చిరు పై ట్రోల్ల్స్…

అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను చిరంజీవి గారు సౌత్ లో ప్రమోట్ చేసారు. నిజానికి డిస్ట్రిబ్యూషన్ కి ఎవరూ ముందుకు రాకపోతే గీత ఆర్ట్స్ 13 కోట్లకు తీసుకుంది. అదంతా కూడా నష్టమే అయితే దీనికన్నా అతి పెద్ద డామేజ్ చిరు కి వచ్చింది. అదే అమీర్ ఖాన్ సినిమాను ఇండియాకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసాడని అతని సినిమాలను బ్యాన్ చేయాలి అని ట్రెండ్ నడుస్తున్న సమయంలో అతన్ని సపోర్ట్ చేస్తూ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం చాలా మందికి నచ్చలేదు. దీంతో చిరు మీద కూడా బాగా ట్రోల్స్ వచ్చాయి. ఇక ఈ అంశం గురించి నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ కార్తికేయ 2 వంటి సినిమా సక్సెస్ మీట్లో చిరు మాట్లాడి ఆ డైరెక్టర్ కి హీరోకి బూస్ట్ అప్ ఇచ్చాడు, ఇది మంచి పరిణామం. అయితే చిరునే కాదు ఇలా ఇండస్ట్రీ లో జరగడం మామూలే. అయితే చిరంజీవి అమీర్ ఖాన్ సినిమాకు ప్రమోషన్స్ ఇవ్వడం తప్పు.

అతను ఈ దేశంలో పుట్టి పెరిగి, పేరు సంపాదించి ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడి అంతర్జాతీయ సమాజం ముందు ఇండియా పరువు తీసాడు. అలాంటి వ్యక్తి సినిమాకు ఈయన ప్రమోషన్స్ ఇవ్వడం ఏంటి. ఇక అమీర్ ఖాన్ గొప్ప నటుడు అంటూ పొగడటం బాగోలేదు. వయసు పెరగగానే పెద్దరికం రాదు విచక్షనతో అలోచించి ఒక మాట మాట్లాడితే వస్తుంది. చిరు ఒక మాట మాట్లాడితే చాలా మంది ప్రభావితం అవుతారు అలాంటి వ్యక్తి ఇలాంటి వారిని సపోర్ట్ చేసి దేశద్రోహులతో చేయి కలిపినట్లవుతుంది అది చూసుకోవాలి కదా అని చిట్టిబాబు ఫైర్ అయ్యారు. అమీర్ ఖాన్ కి దేశం తో పనిలేదు, వాడొక వెధవ డబ్బు మాత్రమే కావాలి అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే రకపు వెధవ అంటూ మండిపడ్డాడు చిట్టిబాబు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago