Anasuya: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు రావడంతో తనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.
ఈ కార్యక్రమం నుంచి ఈమె దూరమైన అనంతరం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే కెమెరా ముందు నిలబడి కాపాడండి అని అరవడం లేదా సిగ్గుపడుతూ నవ్వాలి. హీరోయిన్లకు ఇంతకుమించి మరేం పని లేదంటూ ఈమె కామెంట్ చేశారు.
ఇక ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏమాత్రం ప్రాధాన్యత లేదంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే పోకిరి సినిమాలో గిల్లితే గిల్లిచ్చుకోవాలి అనే డైలాగ్ ఉంది కదా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్స్ పరిస్థితి అలాగే ఉంటుందని ఈమె తెలిపారు.ఇక హీరోయిన్స్ హక్కుల గురించి మాట్లాడితే వారిపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని వారికి ఎలాంటి అవకాశాలు ఉండవని ఈమె తెలిపారు.
ఇండస్ట్రీలో హీరోయిన్స్ కేవలం ఒక దేవదాసీలా మాత్రమే పనిచేయాలని కోరుకుంటారు. ఇలా అనుకోవడం పూర్తిగా తప్పు అంటూ ఈ సందర్భంగా అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి వారికి ఏ విధమైనటువంటి విలువ లేదంటూ ఈ సందర్భంగా ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మొత్తానికి అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్ల గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…