Chittibabu : చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆ సినిమా ప్రచారం చేయడానికి ఒక దిగ్గజం వస్తే ఆ సినిమా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ఇది ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీ ఫాలో అవుతున్న వ్యూహమే. ఇక సక్సెస్ మీట్లకు కూడా వచ్చి హీరోని, సినిమాను, డైరెక్టర్ ను పొగిడి మరింత వసూళ్లను పెంచే కార్యక్రమం చేస్తున్నాం. ఇక ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరు తన సినిమాల జోరు పెంచాడు. అలాగే ఇతర హీరోల సినిమాలకు ప్రమోషన్స్ నిర్వహించడం చూస్తున్నాం. నిజానికి ఒక చిన్న సినిమా అయినా చిరంజీవిని సదరు ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ లేదా హీరో అడిగి మా సినిమా గురించి చెప్పండి అని అడిగితే చాలా వరకు కాదు అని చెప్పరు. అయన చాలా చిన్న సినిమాలకు అలా ప్రమోషన్స్ ఇచ్చారు. అయితే ఇటీవల ఒక హిందీ సినిమాకు ప్రచార బాధ్యతలన్ని నెత్తిన వేసుకుని మరీ చేసారు చిరు. కానీ దీనివల్ల అనేక విమర్శలను ఎదుర్కొన్నారు.

లాల్ సింగ్ చద్దా.. కార్తికేయ 2.. చిరు పై ట్రోల్ల్స్…
అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను చిరంజీవి గారు సౌత్ లో ప్రమోట్ చేసారు. నిజానికి డిస్ట్రిబ్యూషన్ కి ఎవరూ ముందుకు రాకపోతే గీత ఆర్ట్స్ 13 కోట్లకు తీసుకుంది. అదంతా కూడా నష్టమే అయితే దీనికన్నా అతి పెద్ద డామేజ్ చిరు కి వచ్చింది. అదే అమీర్ ఖాన్ సినిమాను ఇండియాకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసాడని అతని సినిమాలను బ్యాన్ చేయాలి అని ట్రెండ్ నడుస్తున్న సమయంలో అతన్ని సపోర్ట్ చేస్తూ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం చాలా మందికి నచ్చలేదు. దీంతో చిరు మీద కూడా బాగా ట్రోల్స్ వచ్చాయి. ఇక ఈ అంశం గురించి నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ కార్తికేయ 2 వంటి సినిమా సక్సెస్ మీట్లో చిరు మాట్లాడి ఆ డైరెక్టర్ కి హీరోకి బూస్ట్ అప్ ఇచ్చాడు, ఇది మంచి పరిణామం. అయితే చిరునే కాదు ఇలా ఇండస్ట్రీ లో జరగడం మామూలే. అయితే చిరంజీవి అమీర్ ఖాన్ సినిమాకు ప్రమోషన్స్ ఇవ్వడం తప్పు.

అతను ఈ దేశంలో పుట్టి పెరిగి, పేరు సంపాదించి ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడి అంతర్జాతీయ సమాజం ముందు ఇండియా పరువు తీసాడు. అలాంటి వ్యక్తి సినిమాకు ఈయన ప్రమోషన్స్ ఇవ్వడం ఏంటి. ఇక అమీర్ ఖాన్ గొప్ప నటుడు అంటూ పొగడటం బాగోలేదు. వయసు పెరగగానే పెద్దరికం రాదు విచక్షనతో అలోచించి ఒక మాట మాట్లాడితే వస్తుంది. చిరు ఒక మాట మాట్లాడితే చాలా మంది ప్రభావితం అవుతారు అలాంటి వ్యక్తి ఇలాంటి వారిని సపోర్ట్ చేసి దేశద్రోహులతో చేయి కలిపినట్లవుతుంది అది చూసుకోవాలి కదా అని చిట్టిబాబు ఫైర్ అయ్యారు. అమీర్ ఖాన్ కి దేశం తో పనిలేదు, వాడొక వెధవ డబ్బు మాత్రమే కావాలి అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే రకపు వెధవ అంటూ మండిపడ్డాడు చిట్టిబాబు.

































