Sudigaali Sudheer : బుల్లితెర పవర్ స్టార్ ఈ మాట అనగానే గుర్తొచ్చే పేరు సుడిగాలి సుధీర్. బుల్లితెర మీద మరే సెలబ్రిటీకి లేనంత పాపులారిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ సుధీర్ సొంతం. జబర్దస్త్ నుండి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ కేవలం తన ప్రతిభ తోనే కాదు తన వ్యక్తిత్వం తోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్, ఢీ షో లతో పాటు ఈటీవీ ప్లస్ లో ఒకప్పుడు వచ్చిన పోవే పోరా షో లో సుధీర్ పనిచేసాడు. ఇక శ్రీ దేవి డ్రామా కంపెనీ షో కి హోస్ట్ గా వ్యవహరించిన సుధీర్ సడన్ గా ఈటీవీ వదిలి వెళ్ళిపోయాడు. అటు మా టీవీ, జీ తెలుగు అంటూ అన్ని ఛానెల్స్ లోనూ పని చేసాడు. అయితే మళ్ళీ సుధీర్ ఈటీవీ లో కనిపిస్తే బాగుండు అంటూ చాలా మంది అభిమసనులు ఎదురుచూస్తున్నారు.
రష్మీ తో బంధం…
సుధీర్ అనగానే జబర్దస్త్ లో మరో పేరు గట్టిగా వినిపిస్తుంది, అదే రష్మీ. మొదట్లో రేటింగ్స్ కోసం రష్మీ సుధీర్ ల మధ్య ఏదో ఉంది అన్నట్లు క్రియేట చేసిన మల్లెమల టీం అందులో సక్సెస్ అయ్యారు. షో చూసే జనాలు నిజంగానే రష్మీ సుధీర్ మధ్య ఏదో ఉంది అనుకునేలా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉండేది. అంత బాగా నిజమైన ప్రేమికుల లాగా వాళ్ళ కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద వర్క్ ఔర్ అవుట్ అయింది. అయితే బయట చాలా మంది ఫ్యాన్స్ వీళ్లిద్దరూ పెళ్లి చెసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఇక వీటిమీద ఫస్ట్ టైం సుధీర్ క్లారిటీ ఇచ్చాడు. రష్మీ తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కానీ లవ్, పెళ్లి లాంటివి లేవు అంటూ క్లియర్ గా చెప్పారు. కేవలం టీవీ షో కోసం షో రేటింగ్స్ కోసం మాత్రమే అదంతా చేశామని, కానీ కెమిస్ట్రీ ఇంత బాగా వర్క్అవుట్ అవుతుందని అస్సలు ఊహించలేదని చెప్పాడు.
ఇక జీవితములో పెళ్లి చేసుకోవాలనే ఆశ లేదంటూ చెప్పాడు. పెళ్లి గురించిన ఆలోచన లేదని చెప్పిన సుధీర్ ఈటీవీ నుండి బయటికి వచ్చిన కారణాలను చెప్పారు. బ్రేక్ తీసుకోవాలని ఒక ఆరు నెలలు బయటికి రావాలని అనుకోని మల్లెమల, ఈటీవీ వారిని అడిగే బయటికి వచ్చానని చెప్పారు. అంతే కాకుండా కొంచెం ఆర్ధిక ఇబ్బందుల వల్ల బయటికి రావాల్సి వచ్చిందని చెప్పారు. పెంచమని అడిగినపుడు వారికీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం వల్ల బయటికి వచ్చాను అంటూ చెప్పారు. ఇక అందరూ ఈ మధ్య సుధీర్ ను అడుగుతున్న ఏకైక ప్రశ్న ఎప్పుడు మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తారు అని. ఇక దీనికి సుధీర్ క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ త్వరలో ఈటీవీ లోకి వెళ్ళబోతున్నానని ఆల్రెడీ మాట్లాడానని, టైం వస్తే మళ్ళీ వెళ్లి నా షోస్ నేను చేసుకుంటానని సుధీర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…