Star Heroin: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు రావాలన్న లేదా హీరోయిన్లుగా కొనసాగాలన్న తప్పని సరిగా గ్లామర్ షో చేయడం అవసరం. ఇలా ఇండస్ట్రీలో గ్లామర్ షో చేస్తేనే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇలా గ్లామర్ షో చేయడానికి కుదరదు అంటూ కొన్ని నియమాలను కనుక పెట్టుకుంటే అలాంటి వారికి ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనగడ ఉండదని చెప్పాలి.
ఈ క్రమంలోనే మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కృతి సనన్. ఈమె ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టాలన్న ఆలోచనలు ఉన్న సమయంలో తన తల్లి మాత్రం తనకి గ్లామర్ షో విషయంలో భారీ కండిషన్ లు పెట్టినట్టు తెలుస్తుంది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి గ్లామర్ షో చేయకుండా, బోల్డ్ సన్నివేశాలలో నటించకుండా ఉండాలని ఇలాంటివన్నీ తన కుటుంబంలో నచ్చవంటూ ఈమె తనకు వార్నింగ్ ఇచ్చారట.
ఇలా ఇండస్ట్రీలోకి రాకముందు తన తల్లి తనకు అన్ని కండిషన్ లు పెట్టిందంటూ తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.అయితే తన తల్లి పెట్టిన కండిషన్లను ఏమాత్రం లెక్కచేయకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.ఈమె తెలుగులో నటించినది రెండు సినిమాలే అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్నమైన కథాచిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా…లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక తాజాగా ఈమె ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో రామాయణం కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు. ఈ సినిమాలో ఈమె సీత పాత్రలో నటిస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…