Sr Journalist Bhardwaja : ఇద్దరు సమకాలిన హీరోలు కలిసి మల్టీ స్టార్రర్ సినిమాలు చేయడం కామన్. అయితే అది పాతతరం నటుల్లో చూసాం కానీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రహీరోలు మల్టీ స్టార్రర్ చేయలేదు. దీనికి కథలు దొరకక కాదు కేవలం అభిమానులను సంతృప్తి పరచలేక ఇమేజ్ చట్రంలో మన హీరోలు ఇరుక్కోవడం వల్ల. ఒక హీరో క్యారెక్టర్ ఎక్కువ ఉండి మరో హీరో కి కొంచెం తక్కువ చేసినా ఫ్యాన్స్ నుండి ఆ డైరెక్టర్ నిర్మాత ఎదురకోవాల్సిన పరిస్థులు దారుణంగా ఉంటాయి అందుకే చాలా మటుకు తెలుగు హీరోలు మల్టీస్టారర్ లు చేయలేదు. అయితే ఇప్పటి హీరోలు మాత్రం ఒకడుగు ముందుకేసి కథ నచ్చితే మల్టీ స్టారర్ కి మొగ్గు చూపుతున్నారు.
ఇమేజ్, కెరీర్ గురించి ఆలోచించి మల్టీ స్టార్రర్ చేయని శోభన్ బాబు…
పాత తరం హీరోల్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఒకే ఇమేజ్ ఉన్న హీరోలు అయినా వాళ్లిద్దరూ కలిసి దాదాపు పదిహేను సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజు ఇలా వీరందరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే కృష్ణ, శోభన్ బాబు కలిసి చేసిన చివరి మల్టీ స్టార్రర్ ‘మహా సంగ్రామం’ ఆ సినిమా తరువాత శోభన్ బాబు గారు మళ్ళీ తన సమకాలిన హీరోలతో మల్టీస్టారర్ చేయలేదు. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఈ విషయాల గురించి మాట్లాడుతూ మహా సంగ్రామం సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు. మహా సంగ్రామం సినిమా మొదట ఎన్టీఆర్ తో తీయాలని అనుకున్నా ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లిపోవాలని అనుకోవడంతో రెండు పాత్రలను ఇద్దరు హీరోలతో చేయించాలని భావించిన దర్శక నిర్మాతలు కృష్ణ శోభన్ బాబు లతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసారు.
ఈ సినిమా ప్లాన్ చేసే సరికి ఖైదీ సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యాక సంయుక్త బ్యానర్ వాళ్ళు మహా సంగ్రామం సినిమాను తెరకెక్కించాలని భావించి కృష్ణ, శోభన్ బాబు లకు కథ వినిపించి ఓకే చేయించారు. సినిమా విడుదల అయ్యాక కృష్ణ పాత్ర కంటే, శోభన్ బాబు పాత్ర తక్కువ ఇంపార్టెన్స్ తో ఉండటం వల్ల అభిమానులు గొడవ చేసారు. ఈ సినిమా ప్రభావం వల్ల శోభన్ బాబు తనతో సమానం మైన నటులతో మల్టీ స్టారర్ చేసి తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయడం వల్ల ఆ హీరో కన్నా ఇమేజ్ తక్కువ ఉంది అనిపించుకోవడం కంటే చేయక పోవడం ఉత్తమమని భావించి బహిరంగంగానే ఇక మల్టీ స్టారర్ సినిమాలు చేయనని ప్రకటించారు. ఆయన ముఖ్య పాత్రలో కుర్ర హీరోలతో మల్టీ స్టార్రర్ సినిమాలను సర్పయాగం, బలరామ కృష్ణులు వంటివి చేశారు శోభన్ బాబు అంటూ భరద్వాజ గారు మహా సంగ్రామం సినిమా విషయాలను చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…