Actress Poorna: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పలు భాషలలో హీరోయిన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ గత కొన్ని నెలల క్రితం ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈమె తనతో నిశ్చితార్థం జరుపుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు కానీ పెళ్లి విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచారు.
తాజాగా ఈమె తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. పూర్ణ పెళ్లి తన కుటుంబ సభ్యుల సమక్షంలో దుబాయిలో ఎంతో ఘనంగా జరిగినట్టు తెలుస్తోంది. వీసా సమస్యల కారణంగా తన పెళ్లికి ఎవరిని ఆహ్వానించలేదని ఈమె వెల్లడించారు. ఇకపోతే పూర్ణ పెళ్లిలో ఆమె భర్త తనకు ఇచ్చినటువంటి కానుకల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఏకంగా వందల గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఖరీదైన అపార్ట్మెంట్ కూడా తనకు కానుకగా ఇచ్చారని వార్తలు వచ్చాయి. తాజాగా పూర్ణ పెళ్లికి తన భర్త ఇచ్చిన కానుకల గురించి వాటి విలువ గురించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లికి ముందే ఆసిఫ్ పూర్ణకు ఏకంగా 2700 గ్రాముల బంగారాన్ని కానుకగా ఇచ్చారట.
ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు 1. 30 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. అదేవిధంగా ఖరీదైన భవనాన్ని కూడా కానుకగా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీని విలువ సుమారు 25 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇలా పూర్ణకు తన భర్త ఖరీదైన కానుకలు గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. మరి పూర్ణ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…