Hansika Motwani: దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి హన్సిక.ఇలా దేశముదురు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోయిన్ గా కొనసాగారు.ఇకపోతే హన్సిక డిసెంబర్ నెలలో వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈమె తన స్నేహితుడు బిజినెస్ పార్టనర్ సోహెల్ కతురియా అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతోంది అంటూ వెల్లడించారు.ఈ క్రమంలోనే తనకు ప్రపోజ్ చేసినటువంటి ఫోటోలను హన్సిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే తాజాగా హన్సిక చేసుకోబోయే వ్యక్తి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హన్సిక పెళ్లి చేసుకోబోయే సోహెల్ కు ఇదివరకే పెళ్లి జరిగిందని,అతనికి హన్సికతో రెండవ పెళ్లి అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇక ఇందులో మరొక విశేషం ఏమిటంటే హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్ రింకీ అనే యువతితో 2016వ సంవత్సరంలోనే సోహైల్ కి వివాహం జరిగిందని తెలుస్తోంది. ఈ విధంగా 2016 వ సంవత్సరంలో రింకీను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ఈయన కొన్ని మనస్పర్ధలు కారణంగా తనకు విడాకులు ఇచ్చారు.
ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్ళికి హన్సిక కూడా హాజరు కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ పెళ్లికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విధంగా తన ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పుకున్న అనంతరం సోహైల్ హన్సికకు దగ్గరయ్యారని ఇలా వీరిద్దరూ తిరిగి పెళ్లి చేసుకోబోతున్నారని వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…