Movie News

Sudheer: హీరో అయిన కమెడియన్ అని పిలుస్తున్నారు… సుధీర్ సంచలన వ్యాఖ్యలు?

Sudheer: బుల్లి తెర కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ ప్రస్తుతం హీరోగా వెండి తెర పై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గాలోడు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సుధీర్ తాజాగా కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా కాలింగ్ సహస్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి సుధీర్ ఈ సినిమా ద్వారా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇక ఈ సినిమా నిర్మాతలకు కూడా నష్టాలని మిగిల్చిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుధీర్ కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

సుధీర్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళకముందు జబర్దస్త్ కమెడియన్ గా ప్రేక్షకులను మెప్పించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన హీరో అయినప్పటికీ కూడా ఈయనని జబర్దస్త్ కమెడియన్ అనే ట్యాగ్ మాత్రం వదలడం లేదు. దీంతో ఈ విషయంపై సుధీర్ కి ప్రశ్న ఎదురయింది. మీరు వెండి తెర పై హీరోగా నటిస్తున్న జబర్దస్త్ కమెడియన్ అనే ట్యాగ్ మాత్రం వదలలేదు. అలా పిలవడం వల్ల ఫీల్ అవుతున్నారా అనే ప్రశ్న ఎదురయింది.

జబర్దస్త్ లేకపోతే నేనులేను…

ఈ ప్రశ్నకు సుధీర్ సమాధానం చెబుతూ నన్ను జబర్దస్త్ కమెడియన్ అంటే నేను ఎప్పుడు ఫీల్ అవ్వనని తెలిపారు. ఎందుకంటే నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే అందుకు కారణం జబర్దస్త్. ఈ కార్యక్రమం లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు అంటూ సుధీర్ తెలిపారు. నన్ను జబర్దస్త్ కమెడియన్ అంటే కనుక తాను అసలు ఫీల్ అవ్వను అంటూ సుధీర్ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago