Featured

Suhani Kalita : గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్… నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్ వరుడు ఎవరంటే..!

Suhani Kalita : ‘మనసంతా నువ్వే’ సినిమాలో ‘తూనీగా తూనీగ’ పాట గుర్తుందా… అప్పట్లో ఆ సాంగ్ చాలా ఫేమస్, స్కూల్ ఫంక్షన్స్ లో బాగా డాన్స్ చేసేవాళ్ళు ఆ పాటకు. ఆ పాటలో నటించిన చిన్నప్పటి రీమా సేన్ పాప గుర్తుందా తానే సుహాని కలిత. ‘బాల రామాయణం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయిన సుహాని ప్రేమంటే ఇదేరా, గణేష్‌, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఇక మళ్ళీ పెద్దయ్యాక హీరోయిన్ గా కూడా సుహాని అదృష్టాన్ని పరీక్షించుకుంది.

గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సుహాని…

2008లో వచ్చిన ‘సవాల్’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా కలిసిరాలేదు. ఇక చివరగా ‘స్నేహగీతం’ సినిమాతో హీరోయిన్ గా నటించిన సుహాని ఆ సినిమాకు మంచి పేరు వచ్చినా అమ్మడికి ఆవకాశాలు మాత్రం రాలేదు. ఇక పలు వాణిజ్య ప్రకటనలలో కనిపించిన సుహాని ఇతర భాషలలో కూడా నటించినా పెద్దగా కలిసిరాలేదు. దీంతో సినిమాల్లో కనిపించలేదు చాలా రోజుల నుండి. ఇక ఇప్పుడు ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది.

సుహాని కలిత, విభర్ హసీజ ను వివాహం చేసుకుంది. ఇతను ప్రముఖ సంగీత కారుడు, పైగా మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇక వీరి ఎంగేజ్మెంట్ పెద్దలు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఇక పెళ్లి కూడా బంధువుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లి ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago