Suhasini: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తెరకెక్కే ప్రతి ఒక్క సినిమా కూడా పాన్ ఇండియాస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదలవుతుందంటేనే ఆ సినిమాపై ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.ఈ క్రమంలోనే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్.ఈ సినిమా నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాకి ఫస్ట్ రివ్యూ ఉమైర్ సందు ఇచ్చారు.. దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే ఈ సినిమా గురించి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.సినిమాలో హైలెట్ పాయింట్స్ ఇవే అంటూ సినిమా గురించి ఈయన తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉందని,సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్, విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని చెప్పారు.
ఈ సినిమా ద్వారా ఐశ్వర్యారాయ్ తిరిగి ఫామ్ లోకి వచ్చిందని చాలా ట్విస్టుల నడుమ ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి చేత క్లాప్స్ కొట్టించేలా ఉందంటూ ఈ సినిమా గురించి ఈయన పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల కాకుండానే ఈయన రివ్యూ ఇవ్వడంతో మణిరత్నం భార్య నటి సుహాసిని అసలు నువ్వు ఎవరు? విడుదల కాని సినిమాని మీరు ఎలా చూశారు అంటూ ఈమె కౌంటర్ వేశారు.
ఈ విధంగా సుహాసిని ఉమైర్ సందు ట్వీట్ కి రిప్లై ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ అంటే ఈయన సినిమా చూడకుండానే ఫేక్ రివ్యూ ఇస్తున్నారా అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఆయన దుబాయ్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు ఆయన సినిమా చూసే అవకాశం ఉంటుంది అంటూ కామెంట్లు చేశారు. మొత్తానికి సుహాసిని ఈ సినిమాకి ఇచ్చిన రివ్యూ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…