Sukumar: ఆర్య సినిమా తో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన సుకుమార్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించారు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా సినిమాలు అనగానే రాజమౌళి పేరు మాత్రమే ఇండస్ట్రీ లో వినిపించేది. అటువంటివి సుకుమార్ ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను తీసి పాన్ ఇండియా హిట్ ను సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించింది అంటే సినిమా విడుదలై చాలా రోజులు అయినప్పటికీ కూడా పుష్ప మేనరిజమ్స్ ఇమిటేట్ చేస్తూనే ఉంటారు. అంతలా పుష్ప రాజ్ క్యారెక్టర్ ను జనాల్లోకి ఎక్కించేసాడు. ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.
అభిమానులకు పుష్ప2 తో డబల్ ట్రీట్….
గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్ప2 అంతకుమించి తీసేలా ప్లాన్ వచ్చిందట సుకుమార్కి. ఇప్పటికే ఫిబ్రవరి లేక మార్చ్ లో మొదలు కావాల్సిన పుష్ప2 షూటింగ్ ఇప్పటికి ఇంకా మొదలు పెట్టలేదు. దీనికి కారణం పుష్ప ను మించి పుష్ప 2 ఉండేలా డబుల్ ట్రీట్ తో సుకుమార్ రెడీ చేస్తున్నారని వార్తలు. అందులోను ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీయఫ్ 2’ లాంటి సినిమాలు వచ్చి వెళ్లడం తో అందులో ఉన్న ఎలివేషన్లకు మించి ఇందులో ఉండాలి అని అభిమానులు కోరుకుంటారు ఇందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుంటున్నారట సుకుమార్ టీమ్.
పైగా ఇప్పటికే పుష్ప1 లో శ్రీవల్లి తో పుష్ప పెళ్లి అయిపోవడంతో.. రొమాంటిక్ ట్రాక్ పెట్టడానికి అవకాశం లేదు. అందుకే ఒక కుర్ర హీరోయిన్‌ను తీసుకొని ‘పుష్ప’రాజ్‌తో కొత్త రొమాంటిక్ ట్రాక్ సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఇక పుష్ప లో సమంత ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది, అయితే పుష్ప 2 లో కూడా ఐటమ్ సాంగ్ ఐతే పక్కా కాకపోతే సమంత రిపీట్ అవుతుందో లేదో చూడాలి. మొత్తానికి సుకుమార్ కొత్త పాత్రలతో పుష్ప 2 లో అభిమానులకి డబల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు.
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…
హనుమంతుడిని భక్తితో ఆరాధిస్తే కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని హిందూ సంప్రదాయంలో విశ్వాసం ఉంది. అందుకే ప్రతి మంగళవారం, శనివారం…
తెలుగు సినీ పరిశ్రమలో హీరో-హీరోయిన్ల మధ్య వయస్సు తేడా గురించి చర్చలు కొత్తవి కావు. అయితే కొందరు నటులు మాత్రం…
రోజువారీ పనుల్లో చురుకుదనం కోసం సరైన ఆహారం ఎంత ముఖ్యమో ఆరోగ్య నిపుణులు తరచూ గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా శరీరానికి…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కుమారుడు తన సొంత తల్లిని అమానుషంగా…
హ్యాపీ డేస్ సినిమాతో యువత హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన “టైసన్” పాత్ర ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది.…