Suma Kanakala : తెలుగులో బుల్లితెర మీద ఎంత మంది కొత్త యాంకర్లు ఉన్నా యాంకర్ సుమ వేరు. ఎంతమంది కుర్ర యాంకర్లు వచ్చినా ఇప్పటికీ సుమ నే టాప్ యాంకర్. తన మాటలతో, సమయస్ఫూర్తితో ఎదుటివారికి కౌంటర్లు వేస్తూ నవ్విస్తూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ బోర్ కొట్టని యాంకరింగ్ చేస్తోంది. చాలా ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో పాతుకుపోయిన సుమ ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు తన అభిమానులకు మరింత దగ్గరైంది. సుమక్క అనే ఛానెల్ ద్వారా తన ఇల్లు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
పెళ్లి చీర ధర చెప్పేసిన సుమక్క…
ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూ లు అంటూ బిజీగా ఉండే సుమ వరలక్ష్మి వ్రతం సందర్బంగా తన తల్లి పుట్టిన రోజు సందర్బంగా చీరల షాపింగ్ చేసారు. ఇక ఆ వీడియో ని యూట్యూబ్ సుమక్క ఛానెల్ కోసం చేసారు. సింఘానియా అనే షాపింగ్ మాల్ లో తన చీరల షాపింగ్ కోసం వెళ్లిన సుమ అక్కడ చీరల ధరలు దాదాపు పది లక్షల రేంజ్ వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇక ఒక పట్టు చీర చూపించి ఎంత అని అడుగగానే రెండు లక్షలని చెప్పడంతో నా పెళ్లి చీరలు కూడా ఎంత ధర కాదు నేను అప్పట్లో 11,000 పెట్టి కొన్నాను అంటూ పెళ్లి చీర ధర చెప్పేసారు.
1999 లో రాజీవ్ కనకాలను సుమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో 11,000 అంటే మరి అది ఖరీదైన చీరే కదా. అయితే సుమ అప్పట్లో అంటే మళ్ళీ ఎప్పుడో అనుకునేరు మా పెళ్లి జరిగింది ఈ మధ్యనే అంటూ జోక్ చేసారు. సుమ, రాజీవ్ కనకాల టీవీ ద్వారా నే ఇద్దరికీ పరిచయం, దూరదర్శన్ లో ఇద్దరూ పని చేసి ఆ పరిచయం ప్రేమ గా మారి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. సుమ , రాజీవ్ లు తమ కొడుకు రోషన్ ను హీరో చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…