Categories: FeaturedMovie News

Cricketers & Heroines : క్రికెటర్లకు క్లీన్ బౌల్డ్ ఐన సినిమా హీరోయిన్లు ఎవరో తెలుసా…!

Cricketers & Heroines : ఇండియాలో బాగా ఫ్యాన్ బేస్ తో ఉండే సెలబ్రిటీలు అంటే సినిమా తారలే. వీరికున్న ఫాలోయింగ్ ఒక సినిమా హిట్ అయిందంటే మామూలుగా ఉండదు. ఇక ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మరే క్రీడకూ లేదు. ఇక క్రికెటర్స్ ని కూడా అంతే ఆరాధిస్తారు ఇండియన్స్. అలాంటి క్రికెటర్స్ కి సినిమా వాళ్లలకు విడదీయారాని బంధం ఉంది. ఎన్నో ఏళ్ల నుండే క్రికెటర్స్ అప్పటి క్రేజీ హీరోయిన్స్ ను క్లీన్ బౌల్డ్ చేసి ప్రేమలో దించేసారు. అలా క్రికెటర్స్ తో డేటింగ్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా… అప్పటి నగ్మా నుండి, ఇప్పటి నిధి అగర్వాల్ వరకు లిస్ట్ పెద్దగానే ఉంది.

హీరోయిన్స్ ప్రేమలో పడిపోయిన క్రికెటర్స్…

క్రికెటర్ హీరోయిన్ లవ్ అనగానే ముందుగా గుర్తొచ్చే జంట సౌరవ్ గంగూలీ, నగ్మా. వీళ్లిద్దరూ అప్పట్లో బాగా డేటింగ్ చేసి మీడియా కంట కూడా పడ్డారు. లండన్ లో డేటింగ్ చేస్తూ కనిపించిన ఈ జంట 2002 లో కాళహస్తి లో కాలసర్ప దోష నివారణకు పూజలు చేసి మీడియాకు కనిపించారు. ఇక సౌరవ్ గంగూలీ భార్య డోనా ప్రమేయం వల్ల ఈ జంట విడిపోయారు. ఇక ఆ తరువాత చెప్పుకోవాల్సిన జంట కపిల్ దేవ్, సారిక… మాజీ ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ అప్పట్లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సారిక తో డేటింగ్ చేసాడు. అయితే కపిల్ దేవ్ కి ఇంట్లో వాళ్ళు వేరే ఆమెని చూడటం తో సారిక దూరమైందని అప్పట్లో వార్తలు వినిపించాయి. సారిక ఆ తరువాత కమల్ హాసన్ నుప్రేమించి పెళ్లి చేసుకుంది. శృతి, అక్షర హాసన్ లు వీరి పిల్లలు. ఆ తరువాత వీళ్లిదరూ విడిపోయారు. ఇక యువరాజ్ సింగ్, కిమ్ శర్మ.. భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ తో డేట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక వీళ్ళిద్దరూ విడిపోయాక యువరాజ్ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే తో డేట్ చేసాడు. ఆ తరువాత హాజల్ అనే మరో నటిని పెళ్లి చేసుకున్నాడు. కెప్టెన్ అంటే ఈ తరానికి గుర్తొచ్చే మహేంద్ర సింగ్ ధోని కూడా హీరోయిన్స్ తో డేట్ చేసాడు.

దీపిక పదుకునే తో డేట్ చేసిన ధోని ఆ తరువాత రాయ్ లక్ష్మి తో కూడా డేట్ చేసాడు. త‌ర్వాత కపిల్ ప్రోగ్రాం ఫార్మర్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రీతి సిమోస్‌, హీరోయిన్ ఆసిన్‌తో కూడా డేటింగ్ చేశాడ‌న్న రూమ‌ర్లు వ‌చ్చాయి. ఇక చివరికి స్నేహితురాలు సాక్షిని ధోని వివాహం చేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ ప్రేమాయణం గురించి చెబితే అనుష్కశర్మ అనుకుంటాం కానీ అంతకు ముందు మనోడు నటి ఇసాబెల్లే తో డేట్ చేసాడనే రూమర్స్ వచ్చాయి. ఇక కే ఎల్ రాహుల్ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వినిపించినా మేము మంచి స్నేహితులం అని చెబుతున్నారు. ఇక జహిర్ ఖాన్ ఇషా శర్వాణి.. ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహిర్ ఖాన్ నటి ఇషా షార్వాణి తో పీకల్లోతూ ప్రేమలో ఉన్నాడు, ఈ జంట సహజీవనం కూడా చేసారు కానీ 2013 లో వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇక ఇండియా తాజా డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇషా నేగి తో డేటింగ్ లో ఉన్నాడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago