Cricketers & Heroines : ఇండియాలో బాగా ఫ్యాన్ బేస్ తో ఉండే సెలబ్రిటీలు అంటే సినిమా తారలే. వీరికున్న ఫాలోయింగ్ ఒక సినిమా హిట్ అయిందంటే మామూలుగా ఉండదు. ఇక ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత క్రేజ్ మరే క్రీడకూ లేదు. ఇక క్రికెటర్స్ ని కూడా అంతే ఆరాధిస్తారు ఇండియన్స్. అలాంటి క్రికెటర్స్ కి సినిమా వాళ్లలకు విడదీయారాని బంధం ఉంది. ఎన్నో ఏళ్ల నుండే క్రికెటర్స్ అప్పటి క్రేజీ హీరోయిన్స్ ను క్లీన్ బౌల్డ్ చేసి ప్రేమలో దించేసారు. అలా క్రికెటర్స్ తో డేటింగ్ చేసిన హీరోయిన్స్ ఎవరో తెలుసా… అప్పటి నగ్మా నుండి, ఇప్పటి నిధి అగర్వాల్ వరకు లిస్ట్ పెద్దగానే ఉంది.

హీరోయిన్స్ ప్రేమలో పడిపోయిన క్రికెటర్స్…
క్రికెటర్ హీరోయిన్ లవ్ అనగానే ముందుగా గుర్తొచ్చే జంట సౌరవ్ గంగూలీ, నగ్మా. వీళ్లిద్దరూ అప్పట్లో బాగా డేటింగ్ చేసి మీడియా కంట కూడా పడ్డారు. లండన్ లో డేటింగ్ చేస్తూ కనిపించిన ఈ జంట 2002 లో కాళహస్తి లో కాలసర్ప దోష నివారణకు పూజలు చేసి మీడియాకు కనిపించారు. ఇక సౌరవ్ గంగూలీ భార్య డోనా ప్రమేయం వల్ల ఈ జంట విడిపోయారు. ఇక ఆ తరువాత చెప్పుకోవాల్సిన జంట కపిల్ దేవ్, సారిక… మాజీ ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ అప్పట్లో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సారిక తో డేటింగ్ చేసాడు. అయితే కపిల్ దేవ్ కి ఇంట్లో వాళ్ళు వేరే ఆమెని చూడటం తో సారిక దూరమైందని అప్పట్లో వార్తలు వినిపించాయి. సారిక ఆ తరువాత కమల్ హాసన్ నుప్రేమించి పెళ్లి చేసుకుంది. శృతి, అక్షర హాసన్ లు వీరి పిల్లలు. ఆ తరువాత వీళ్లిదరూ విడిపోయారు. ఇక యువరాజ్ సింగ్, కిమ్ శర్మ.. భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ తో డేట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక వీళ్ళిద్దరూ విడిపోయాక యువరాజ్ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే తో డేట్ చేసాడు. ఆ తరువాత హాజల్ అనే మరో నటిని పెళ్లి చేసుకున్నాడు. కెప్టెన్ అంటే ఈ తరానికి గుర్తొచ్చే మహేంద్ర సింగ్ ధోని కూడా హీరోయిన్స్ తో డేట్ చేసాడు.

దీపిక పదుకునే తో డేట్ చేసిన ధోని ఆ తరువాత రాయ్ లక్ష్మి తో కూడా డేట్ చేసాడు. తర్వాత కపిల్ ప్రోగ్రాం ఫార్మర్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రీతి సిమోస్, హీరోయిన్ ఆసిన్‌తో కూడా డేటింగ్ చేశాడన్న రూమర్లు వచ్చాయి. ఇక చివరికి స్నేహితురాలు సాక్షిని ధోని వివాహం చేసుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ ప్రేమాయణం గురించి చెబితే అనుష్కశర్మ అనుకుంటాం కానీ అంతకు ముందు మనోడు నటి ఇసాబెల్లే తో డేట్ చేసాడనే రూమర్స్ వచ్చాయి. ఇక కే ఎల్ రాహుల్ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు వినిపించినా మేము మంచి స్నేహితులం అని చెబుతున్నారు. ఇక జహిర్ ఖాన్ ఇషా శర్వాణి.. ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహిర్ ఖాన్ నటి ఇషా షార్వాణి తో పీకల్లోతూ ప్రేమలో ఉన్నాడు, ఈ జంట సహజీవనం కూడా చేసారు కానీ 2013 లో వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇక ఇండియా తాజా డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇషా నేగి తో డేటింగ్ లో ఉన్నాడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

































