Suman : ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎవరికి తోచిన సలహా వాళ్ళు ఇస్తున్నారు. అయితే చాలా మంది సీనియర్లు చెబుతున్న మాట మాత్రం ఒకటే.. హీరోల రెమ్యూనరేషన్ మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు అని చెబుతూన్నారు. ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఇలా జరగదని సూచిస్తున్నారు. ఇక ఇప్పుడున్న ఇష్యూ గురించి సీనియర్ హీరో సుమన్ కూడా మాట్లాడారు.
మీరు చేసే పనులకు హీరోలు ఎందుకు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి…
ప్రొడక్షన్ కాస్ట్ ని అదుపులో పెట్టుకోలేక హీరోలమీద పడితే ఎలా, సినిమా తీసేటప్పుడే హీరోకి నేను ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వగలను అని మాట్లాడుకుని, సినిమా షూటింగ్ సమయంలో ప్రతి పని వద్ద జాగ్రత్తగా చూసుకోవడం నిర్మాత బాధ్యత. ఇది నేను చెప్పేది కాదు రామానాయుడు గారు అలానే ఉండేవారు. నిర్మాత అంటే డబ్బు ఇచ్చేసి డైరెక్టర్, హీరో అంతా చేసేస్తారు అనుకోవడం తప్పు. నిర్మాత ప్రొడక్షన్ కాస్ట్ గురించి పట్టించుకుని డబ్బు వృధా కాకుండా చూసుకుంటే ఇదంతా జరగదు కదా అని సుమన్ అన్నారు.
ఇక ఓటీటీ ప్రస్తావన గురించి మాట్లాడుతూ సిగరెట్ తాగడం, మందు తాగడం అలవాటు పడ్డాక మానేయడం ఎంత కష్టమో అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో సినిమాను ఓటీటీలో చూడటానికి అలవాటు పడుతున్న జనాన్ని మళ్ళీ థియేటర్ కి రప్పించడం అంతే కష్టం. ఇంత టికెట్ రేట్స్ లో సినిమాలు చూడటానికి జనాలు ఆసక్తి చూపడం లేదు. ఒక థియేటర్ కి వెళ్ళడానికి ట్రాఫిక్, టికెట్ రేట్స్ అక్కడ ఫుడ్ రేట్స్ ఇవన్నీ లెక్కలేసుకుంటే దానికంటే ఇంట్లో ఓటీటీ లో సినిమా చూసుకోడం బెటర్ అని అనుకుంటున్నారు. అయితే సినిమా చూడాలని థియేటర్ కి వచ్చేలా సినిమాలను ఆసక్తికరంగా తీయాలి అంటూ హాట్ కామెంట్స్ చేసారు సుమన్. నిర్మాతే బయ్యర్ గా మారిపోతున్నాడు. నష్టాలోచ్చినపుడు మళ్ళీ సినిమా తీసే పరిస్థితి ఉండదు. ఇక బయ్యర్ బాగుపడటానికి మళ్ళీ కొత్త సిస్టం రావాలి. సినిమా అంటే హీరోనో, నిర్మాతో, డైరెక్టరో కాదు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగుపడాలి అని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…