Sumanth: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు హీరో సుమంత్.చూడటానికి ఆరడుగుల పొడవు అందం అద్భుతమైన నటన టాలెంట్ ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.
ఇలా సుమంత్ పలు సినిమాలలో హీరోగా నటించినప్పటికీ ఈయన చేసిన సినిమాలలో హిట్టు కన్నా ఫ్లాప్ సినిమాలే అధికంగా ఉండడంతో హీరోగా సక్సెస్ కాలేకపోయారు. ఇలా హీరోగా సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం పాటు సుమంత్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన మళ్ళీ రావా అనే సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఇక తాజాగా ఒక అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా ద్వారా మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో ఈయన కథను మొత్తం కీలక మలుపు తిప్పే బ్రిగేడర్.. విష్ణు శర్మ పాత్రలో నటించారు.
ఈ సినిమాలో ఈయన పాత్రకు గాను మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన సార్ సినిమాలో కూడా సుమంత్ ఏఎస్ మూర్తి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈయన ఎక్కడ కనిపించకపోవడంతో సినిమా చూసేటటువంటి ప్రేక్షకులకు ఈయన పాత్ర సర్ప్రైజ్ లా ఉంటుంది.ఇక ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకోవడంతో సుమంత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు కనబడుతూ ఫుల్ జోష్ లో ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…