Featured

Super Star Krishna : తెలంగాణ సాయుధ పోరాటం గురించి కృష్ణ నటించిన రక్తాక్షరాలు సినిమా ఎందుకు విడుదల కాలేదు..!

Super Star Krishna : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలోయింగ్ అవకుండా సెట్ చేసిన వాళ్లలో క్రొష్ణ ముందుంటారు. కొత్తనాన్ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబం కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇక కృష్ణ గారి వారాసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. కృష్ణ గారికి అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. అలాగని కమర్షియల్ పంథాలో సినిమాలను కృష్ణ చేయలేదు.

రక్తాక్షరాలు సినిమా ఎందుకు విడుదల కాలేదు…

సూపర్ స్టార్ కృష్ణ గారు 1997 లో ఆల్రడీ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. పద్మాలయ బ్యానర్ లో ‘ఎన్కౌంటర్’ అనే సినిమా సొంతంగా చేస్తూ నిర్మిస్తున్నారు. ఇక అదే సమయంలో ‘రక్తాక్షరాలు’ సినిమా కథ నచ్చి కీలక పాత్రలో నటించడానికి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ నటించిన ‘భామ విజయం’ సినిమాకు  నిర్మాత లలో సైలెంట్ భాగస్వామిగా వ్యవహరించిన రామ బ్రహ్మం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కన్నడ లో దాదాపు 12 సినిమాలను తీసిన శ్రీకర్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 1947 లో స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా తెలంగాణ లో ఇంకా నిజాం అధీనం లోనే ఉంది. ఇక సాయుధ పోరాటం జరిగి మళ్ళీ ఇండియాలోకి తెలంగాణ కలిసింది. ఇక ఈ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో మొదట కృష్ణ గారి పాత్ర నిడివి కొంచెం మాత్రమే అయితే రాను రాను సినిమాలో ఆయన పాత్రను పెంచి పూర్తి కథనాయకుడి పాత్రను తయారుచేసారు.

ఇక కృష్ణ గారికి జంటగా హీరోయిన్ గా రవళి ని తీసుకున్నారు. ఇక ఒక కీలక పాత్ర హకాలి లచ్చుమాంభ పాత్ర కోసం ఇంద్రజ ను ఆమెకు భర్త క్యారెక్టర్ లో ఆనంద్ గారు నటించారు. అయితే సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తయి మూడో షెడ్యూల్ ఉండగా నిర్మాత చేతులెత్తేసాడు. సినిమాను సెప్టెంబర్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా విడుదల చేయాలని అనుకున్నా ప్రొడ్యూసర్ ముందుకు రాకపోవడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక కృష్ణగారు సొంతంగా సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని అనుకున్నా అప్పటికే సొంత సినిమా ‘ఎన్కౌంటర్’ సినిమా కు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను పట్టించుకోలేక పోయారు. అలా ఒక పవర్ ఫుల్ సినిమా ఆగిపోయింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago