Krishna: టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన దాదాపు గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు పలు సినిమాలలో తండ్రి పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం వయసు పైబడటంతో కృష్ణ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, మోహన్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత అశ్వినీదత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వీరు అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
చిన్నప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు గురించి ఎన్నో బుర్రకథలలో విన్నాను. ఈ సినిమాని ఎన్టీఆర్ గారు ఎప్పుడు చేస్తారా అని ఈ సినిమా కోసం ఎదురు చూశాను. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఎన్టీఆర్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే తన 100వ చిత్రంగా తానే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించి ఇందులో నటించాను. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేను నటించిన 365 చిత్రాలలో అల్లూరి సీతారామరాజు సినిమా బెస్ట్ చిత్రం అని ఈ కార్యక్రమంలో కృష్ణ తెలియజేశారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…