Festive news for railway passengers! Say goodbye to waiting list tension!
భారతీయ రైళ్లలో టికెట్ కన్ఫర్మ్ కాకపోవడం చాలామందికి పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవాళ్ల గుండె అయితే రైలు బయలుదేరే వరకు దడదడలాడుతూనే ఉంటుంది. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఈ కంగారుని తగ్గించడానికి రైల్వే శాఖ ఒక సూపర్ ప్లాన్ వేసింది. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందే ఫైనల్ లిస్ట్ రెడీ చేసే ఆలోచనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రీసెంట్‌గా బికనీర్ వెళ్లినప్పుడు ప్రయాణికుల కష్టాలను స్వయంగా చూశారట. అప్పుడు అక్కడి రైల్వే అధికారులు చివరి నిమిషంలో కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే టెన్షన్‌ను తగ్గించడానికి ముందుగానే ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇప్పటివరకు రైలు బయలుదేరే 2-4 గంటల ముందు మాత్రమే ఫైనల్ చార్ట్ రెడీ చేసేవాళ్లు. దీనివల్ల వెయిటింగ్‌లో ఉన్నవాళ్లు ఎప్పుడు ప్రయాణం చేయగలరో, వేరే ప్లాన్స్ ఏమైనా చేసుకోవచ్చో తెలియక చాలా ఇబ్బంది పడేవాళ్లు.
అందుకే జూన్ 6 నుంచి బికనీర్ డివిజన్‌లో ఒక ప్రయోగం మొదలుపెట్టారు. రైలు బయలుదేరే ముందు రోజే, అంటే 24 గంటల ముందు ఫైనల్ చార్ట్‌ను రెడీ చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ప్రయోగం మొదట నాలుగు రోజుల్లోనే మంచి ఫలితాలు ఇచ్చింది. టికెట్ కన్ఫర్మ్ కానివాళ్లు ప్రయాణానికి వేరే దారులు చూసుకోవడానికి, ఇతర రైళ్లు లేదా బస్సుల్లో వెళ్లడానికి ముందుగానే ప్లాన్ చేసుకునే అవకాశం దొరికింది.
ఈ ట్రయల్ సక్సెస్ కావడంతో రైల్వే శాఖ ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే రూట్లలో కూడా అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఇది అమలైతే రైలు ప్రయాణం మరింత సులువు అవుతుంది. ప్రయాణికులకు ముందుగానే సమాచారం తెలుస్తుంది, మంచిగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…