Supritha: వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న సురేఖవాణి కూతురు సుప్రీత.. మూవీ పోస్టర్ రిలీజ్?
Supritha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి గురించి అందరికీ సుపరిచితమే.ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియా వేదికగా తన కూతురిని పరిచయం చేశారు.
ఈ క్రమంలోనే సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సుప్రీత వెండితెర ఎంట్రీ ఎప్పుడు అంటూ ఇది వరకు ఎంతోమంది అభిమానులు ఆమెను ప్రశ్నించారు. అయితే ఇప్పటివరకు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఉన్నటువంటి సుప్రీత తాజాగా వెండితెర ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
సుప్రీత ఏ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయానికి వస్తే… మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేచింది మహిళా లోకం అనే ఈ సినిమా ద్వారా సుప్రీత వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమాకు కార్తీక్ అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.ఈ క్రమంలోని మంచు లక్ష్మి ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చారు.
ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోందని మంచులక్ష్మి వెల్లడించారు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సురేఖవాణి కూతురు సుప్రీత సందడి చేయనుంది. సుప్రీతతోపాటు ఈ సినిమాలో హరితేజ, హేమ, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇలా ఎన్నో రోజులుగా సుప్రీత వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. మరి వెండితెరపై సుప్రీత ఎలా ప్రేక్షకులను సందడి చేయనుందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…