Suresh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ మొఘల్ గా పేరు తెచ్చుకున్న రామానాయుడు గారు ఎన్నో చిత్రాలను నిర్మించి రామానాయుడు స్టూడియోస్ పెట్టి సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసారు. ఇక ఆయన తనయలుగా ఇండస్ట్రీకి వచ్చిన సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేసుకున్నారు. వెంకటేష్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చి అగ్ర హీరోల్లో ఒకరిగా వెలిగాడు. ఇప్పటికీ జోరుగా సినిమాలను చేస్తూ హిట్లు కొడుతున్నాడు. ఇక సురేష్ బాబు సినిమా నిర్మాణ రంగంలో ఉండి సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన కొడుకు రానా సినిమాల్లో నటిస్తూ మంచి చిత్రాలను చేస్తూ కమర్షియల్ పోకడలకు పోకుండా మంచి కథలను ఎంచుకుంటున్నారు.
హీరోయిన్ మాటలకు బాధపడిన సురేష్ బాబు…
తమ్ముడు వెంకటేష్ తో సొంత బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన సురేష్ బాబు మిత భాషి. సాధారణంగా ఎక్కువగా మాట్లాడరు. మీడియా ముందు కూడా పెద్దగా కనిపించరు. అలాంటి ఆయనను బాధపెట్టేలా ఒక హీరోయిన్ కామెంట్స్ చేసిందట. వేంకటేష్ హీరోగా చేసిన ఒక సినిమాలో హీరోయిన్ గా చేసిన ఒక అగ్ర తార వెంకటేష్ కంటే నువ్వు కొంచెం పెద్దవాడివే అయినా ముసలోడివి అయిపోయావ్ చూడు అంటూ ఆయన ఆహార్యాన్ని కామెంట్స్ చేసిందట.
ఆల్రెడీ ఈ హీరోయిన్ కి నోటి దూల అని ఇండస్ట్రీలో అప్పటికే టాక్ ఉంది. అగ్ర హీరోయిన్ అయినా బ్రెయిన్ లేకుండా వాగుతుంటుందని పేరున్న ఆ హీరోయిన్ మాటలకు సురేష్ బాబు బాధపడ్డారట. ఇక పక్కనే ఉన్న వెంకటేష్ వెంటనే ఆ హీరోయిన్ మాటలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. “అందం ముఖ్యం కాదు ఎంత వయసు వచ్చినా మా అన్న పనులు తానే చేసుకుంటారు, నాకన్నా ఓల్డ్ లుక్స్ లో కనిపించినా, ఆయన స్టామినా, సత్తా నాకు రాదు. ఈ విషయం పైన మాత్రమే చూసే కళ్లకు కనపడదులే” అంటూ ఆ హీరోయిన్ కి పరోక్షకంగా బుద్ధి చెప్పాడట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…