సినిమాలో మొదటి నుంచి ఓ ఆనవాతీ వస్తోంది. ఇప్పటి జనరేషన్ వాళ్లే కాకుండా.. మొదటి జనరేషన్ వాళ్లు కూడా ఓ జంట సినిమాలో విజయవంతం అయ్యారంటే.. ఆ జంట గురించి గుసగుసలు, పుకార్లు చక్కెర్లు కొడుతుంటాయి. ఆ జంట నటించిన సినిమా సక్సెస్ అయ్యిందంటే వారికి హిట్ పెయిర్ అని పేరుపెట్టి, అదే జంటతో వరుసగా చిత్రాలు నిర్మించడం పరిపాటిగా వచ్చేది.
ఇక ఆ జంటతోనే సినిమాలను తీసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి కూడా కనబరుస్తారు. వీళ్లు ఇలా ఆలోచించడానికి కూడా ఓ కారణం ఉంది. ప్రేక్షకులు కూడా ఆ జంటనే మరోసారి చూడాలని అనుకుంటారు. దీంతో అలా పలు సినిమాలలో నటించి హిట్ సినిమా కొట్టిన జంటల గురించి పెద్ద ఎత్తున గుసగుసలు వినిపించేవి. ఈ విధంగా పలు సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్న జంటలలో సురేశ్, నదియా జంట ఒకటి. వారిద్దరు కలిసి నటించిన ఒక తమిళ చిత్రం సక్సెస్ కావడంతో.. వరుసగా వారి కాంబినేషన్‌లో పలు చిత్రాలు వచ్చాయి. వాళ్లిద్దరూ కలిసి ప్రతి సినిమాలో కనిపిస్తుండటం చూసి.. వాళ్లిద్దరి మధ్య లేని సంబంధాన్ని సృష్టించి.. సురేశ్-నదియా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారంలోకి వచ్చింది.
అయితే వీటికి ఆజ్యం పోస్తూ అప్పట్లో తమిళ పత్రికలు కూడా వార్తలను ప్రచురించేవి. ఇలా వారిమధ్య ప్రేమ ఉందంటూ పుకార్లు షికార్లు అయ్యాయి. ఈ విషయంపై సురేశ్ ను అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. మీమిద్దం స్నేహితులం మాత్రమే.. మాకు అలాంటి ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి సురేశ్ తన పంథాను మార్చాడు. ఒకే హీరోయిన్ తో కాకుండా ఒక్కో సినిమాలో విభిన్న హీరోయిన్ లతో నటించడం మొదలు పెట్టాడు.
తర్వాత నదియా కాంబినేషన్ లో చేయడానికి అవకాశం వచ్చినా అతడు చేయలేదంట. ఇలా వదంతులు వస్తున్న క్రమంలోనే 1988లో శిరీష్ గాడ్‌బోలే అనే బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకున్న నదియా.. తర్వాత అమెరికాకు వెళ్లిపోవడంతో వదంతులకు చెక్ పడింది. ఇప్పుడు ఆమె పలు సినిమాల్లో తల్లి క్యారెక్టర్ తో పాటు మరికొన్ని సినిమాల్లో మెయిన్ రోల్ ఉండే పాత్రల్లోనటిస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…