Featured

Surrogacy : అద్దె గర్భంతో పిల్లల్ని కన్న సినీ సెలబ్రిటీలు ఎవరో తెలుసా..!

Surrogacy : మాతృత్వం ఒక వరం, అలాంటి మాతృత్వం కోసం పరితపించే వారు ఎందరో. అలాంటి వారు ఇప్పుడున్న అడ్వాన్స్‌డ్ వైద్యంతో పిల్లలిని కంటున్నారు. కానీ అలా కూడా కనలేని వారికోసం వచ్చిందే అద్దెగర్భం లేదా సరోగసీ. వయసు ఎక్కువవడం, ఆరోగ్య కారణాలు, తదితర కారణాల రీత్యా చాలా మంది సరోగసీ ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఇక ఆరోగ్య సమస్యలు పక్కన పెడితే చాలా మంది సెలబ్రిటీలు వాళ్ల కెరీర్ రీత్యా, ఇతర కారణాల చేత సరోగసీ వైపు మొగ్గుచూపుతున్నారు ఇలాంటి వారిలో బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలా మంది.

ఇక బాలీవుడ్ బడా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సింగిల్ ఫాదర్ గా 2017లో సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. రూహి జోహార్, యష్ జోహార్ ల ఆలనపాలన కరణ్ జోహార్ తల్లి చూసుకుంటున్నారు. ఇక ప్రీతీజింటా కూడా తన అమెరికన్ బాయ్ ఫ్రెండ్ని వివాహం చేసుకుని సరోగసీ ద్వారా జై, గియా అనే ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. ఇక శిల్ప శెట్టి కూడా తన రెండవ బిడ్డ సమీష కు సరోగసీ ద్వారా జన్మనిచ్చింది. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన మూడో సంతానం కోసం సరోగసీ ఆశ్రయించారు. గౌరి ఖాన్ కు 40 ఏళ్ళు పై బడటంతో ఆరోగ్య రీత్యా గర్భందాల్చడం మంచిది కాదని సరోగసీ ద్వారా అబ్రహం ఖాన్ కు జన్మనిచ్చారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా తన రెండవ భార్య కిరణ్ రావు కు గర్భాశయములో సమస్యల వల్ల సరోగసీ ద్వారా మగబిడ్డ అజాద్ కు జన్మనిచ్చారు.

బాలీవుడ్ బడా సీరియల్ ప్రొడ్యూసర్ ఎక్తా కపూర్ తన IUI, IVF వంటి సంతానానికి సంబంధించిన ట్రీట్‌మెంట్స్ విఫలమయ్యాక సరోగసీ ద్వారా మగబిడ్డకు తల్లయింది. ఇక శృంగార తార సన్నీ లియోన్ కూడా తన కవల పిల్లలను సరోగసీ ద్వారా జన్మనిచ్చారు.

ఇక హాలీవుడ్ లో సత్తా చాటుతున్న ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లు తమ బిడ్డను సరోగసీ ద్వారా కన్నారు. ఈ విషయాన్ని ఇటీవలే ప్రియాంక ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పింది. ఇక టాలీవుడ్ లోనూ మంచు లక్ష్మి సరోగసీ ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది. గుజరాత్ కు చెందిన మహిళలు ద్వారా అద్దె గర్భంలో తన బిడ్డకు తల్లయింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago