Madhavan: తమిళ స్టార్ హీరోగా మాధవన్ అందరికీ సుపరిచితమే.అయితే ఈయన కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
గత కొంత కాలం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మాధవన్ ప్రస్తుతం 75 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఫెస్టివల్లో భాగంగా ఈయన తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల తను ఎలాంటి సినిమాలు చేయలేదని, కరోనా ముందు కూడా తను రెండు సంవత్సరాలపాటు ఎలాంటి సినిమాలు చేయకుండా ఉండటం వల్ల తాను ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని వెల్లడించారు.
లాక్ డౌన్ సమయంలో తనని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడినది నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన ‘డీకపుల్డ్’ వెబ్ సిరీస్ మాత్రమే తనని ఆదుకుందని ఈ సందర్భంగా మాధవన్ వెల్లడించారు. ఇక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికపై తాను దర్శకత్వం వహించిన రాకెట్రీ గురించి ప్రమోషన్ చేశారు.ఈ సినిమా జూన్ 1వ తేదీ హిందీ ఇంగ్లీష్ తమిళ భాషల్లో విడుదల కానుందని తెలిపారు.
అనంతరం ఈ సినిమాని తెలుగు, మలయాళ భాషలలో డబ్ చేయనున్నట్లు మాధవన్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ నుంచి తనలో ఏదో తెలియని భయం ఉందని, ఈ సినిమా పైనే తను ఆశలు పెట్టుకున్నట్లు మాధవన్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సూర్య, షారుక్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారని మాధవన్ తెలియజేశారు. ఇక ఈ సినిమాని ప్రముఖ భారత శాస్త్రవేత్త నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…