Big Boss Non Stop Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మరో రోజులో ముగియనుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి విజేత ఎవరు అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నప్పటికీ మరోవైపు బిగ్ బాస్ ట్రోఫీను ఆడపులిగా పేరు సంపాదించుకున్న బిందుమాధవి కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమం మొదటి నుంచి టైటిల్ రేసులో ఉన్నటువంటి బిందు మాధవి అఖిల్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో విజేతగా బిందు మాధవి నిలవగా రన్నర్ గా అఖిల్ నిలిచినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్త కనుక నిజమైతే బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ టైటిల్ అందుకున్న లేడీ కంటెస్టెంట్ గా బిందుమాధవి పేరు నిలిచిపోతుంది. ఇప్పటివరకు బుల్లి తెర పై ఈ కార్యక్రమం 5 సీజన్లను పూర్తి చేసుకుంది.
ఈ ఐదు సీజన్లలో కూడా అబ్బాయిలే విజేతగా నిలవడం గమనార్హం. మొదటి సీజన్లో శివబాలాజీ, రెండవ సీజన్ కౌశల్, మూడవ సీజన్ రాహుల్ , అభిజిత్, సన్నీ ఇలా వరుసగా అబ్బాయిలే బిగ్ బాస్ విన్నర్ గా నిలబడ్డారు. అయితే మొదటి సారి ఈ కార్యక్రమాన్ని తెలుగు ఓటీటీ లో ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిందుమాధవి అఖిల్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.
ఈ పోటీల్లో భాగంగా బిందు మాధవి విన్నర్ గా నిలబడగా, అఖిల్ రన్నర్ గా నిలబడ్డారు. మూడో స్థానంలో శివ, నాలుగో స్థానంలో బాబా భాస్కర్, ఐదవ స్థానంలో అరియానా ఉన్నట్టు సమాచారం.ఇక మరి కొన్ని గంటలలో ఈ ఉత్కంఠతకు తెరపడి అసలు విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…