Categories: FeaturedMovie News

భడా డైరెక్టర్ తో కలిసి, నోట్ల కట్టలు కుమ్మరించి మాస్టర్ ప్లాన్ వేసిన రియా చక్రవర్తి !!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసు ఇప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. సుశాంత్ కుటుంబ సభ్యులు పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడి మరణం వెనుక పెద్ద కుట్రయే దాగివుందని, అందులో రియా చక్రవర్తి హస్తం కూడా ఉందనే అనుమానాలున్నాయని.. ఆమె చేసిన మోసానికి బలై పోయిన సుశాంత్ ప్రాణాలు తీసుకున్నాడని, సుశాంత్ బలవాన్మరణానికి ముందే అంటే సరిగ్గా 6 రోజుల ముందు రియా తన ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లి పోయిందని.. తన కుమారుడికి సంబంధించిన డబ్బు, ఆభరణాలు, ల్యాప్ టాప్, క్రెడిట్ కార్డు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లన్నీ రియా దగ్గరే ఉన్నాయని FIR లో తెలియజేస్తూ.. కేకే సింగ్ రియాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురుపై కంప్లైంట్ చేసారు. దీంతో పోలీసులు IPC సెక్షన్ 306, 340, 342, 380, 406 420 ప్రకారం రియాతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

ఇక ఈ కేసు విచారణలో భాగంగా సుశాంత్ అకౌంట్ నుంచి రియాకు రూ. 15 కోట్లు ట్రాన్స్ ఫరైనట్టు గుర్తించారని తెలిసింది. ఈ కేసు దర్యాప్తు చేయడానికి CBI కూడా రంగంలోకి దిగడంతో పోలీసులు రియాను అరెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టుగా తాజా సమాచారం. అయితే ఇప్పటికే సుశాంత్ కేసులో FIR నమోదైన కారణంగా రియాను అరెస్ట్ నుంచి తప్పించేందుకు ఆమె లాయర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేయడం ద్వారా నేరుగా రియాను కోర్టులో హాజరుపరిచేలా లాయర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అప్పటివరకు ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకు తిరగాలని రియాకి సలహా ఇచ్చి ఉంటారనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. సుశాంత్ బలవన్మరణం చేసుకొని 2 నెలలు దాటినా ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మిస్టరీని ఛేధించే ప్రయత్నంలో ఇప్పటికే సుశాంత్‌తో సంబంధం ఉన్న 50 మందిని విచారించిన ముంబై పోలీసులు.. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తూ.. కొన్ని ముఖ్యమైన ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తనపై ఎలాంటి అపవాదు రాకుండా చూసుకోవాలని రియా జాగ్రత్త పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో రూమర్స్ చక్కెర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో ప్రేక్షకులకు తనపై ఓ తప్పుడు అభిప్రాయం ఉందని గ్రహించిన రియా.. బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ సహాయంతో ఓ సీనియర్ జర్నలిస్ట్ తో కుమ్మక్కై భారీ డీల్ కుదుర్చుకుందని, ప్రేక్షకులకు తనపై పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా చేయాలని ఆ జర్నలిస్టును కోరిన రియా ఆ పనికి ఓకె చెప్పిన సదరు జర్నలిస్ట్ కు నోట్ల కట్టలు కుమ్మరించిందని, వెనుక నుంచి రియా PR టీమ్ ఈ కథను నడిపిస్తున్నారని, ఈ స్కెచ్‌ లో భాగంగానే రీసెంట్‌గా రియా వాట్సాప్ ఛాట్ ను బయటపెట్టి ఆ స్టార్ డైరెక్టర్ కి, రియాకు మధ్య తండ్రీ కూతుళ్ళ రిలేషన్‌షిప్ ఉన్నట్లుగా చీత్రీకరించారని, రియానే స్వయంగా ఈ వాట్సప్ ఛాట్ ను సదరు జర్నలిస్టుకిచ్చి మీడియాలో ప్రసారమయ్యేలా ప్లాన్ చేసిందనే రూమర్స్ వినబడుతున్నాయి. దీంతో సుశాంత్ మరణం వెనక పెద్ద కుట్ర దాగి ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago