Taapsee: ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి నటి తాప్సీ పలు తెలుగు సినిమాలలో నటించి పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉండటమే కాకుండా, నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు.
ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి తాప్సి ఈ మధ్యకాలంలో వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.ఈమె నటించిన గత రెండు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఫోటోగ్రాఫర్లపై తీవ్రస్థాయిలో మండిపడుతూ వివాదాలలో చిక్కుకున్నారు.అయితే తాజాగా ఈమె మరో వివాదంలో చిక్కుకున్నారు ఈసారి ఏకంగా ఈమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
మార్చి 12వ తేదీ ముంబైలో జరిగిన లాక్ మి ఫ్యాషన్ వీక్ 2023 షోలో తాప్సీ ర్యాంప్ వాక్ చేసింది. ఆ షోలో తాప్సీ తన మెడలో హిందువుల ఆరాధించే లక్ష్మీదేవి లాకెట్ ధరించారు అయితే ఇదే విషయమే పెద్ద ఎత్తున వివాదంగా మారింది. అయితే ఈ ఫ్యాషన్ షోలో పాల్గొన్నటువంటి తాప్సి వేసుకున్న డ్రెస్ కారణంగా పెద్ద ఎత్తున ట్రోలింగుకు గురయ్యారు.
ఈమె లో దుస్తులు ధరించకుండా ఏద అందాలను ఆరబోస్తూ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశారు. ఇలా ఈమె అభ్యంతర కరమైన దుస్తులను ధరించి లక్ష్మీ లాకెట్ ఉన్నటువంటి దండ వేసుకోవడంతో పలువురు హిందువులు తమ మనోభావాలను దెబ్బతీసేలా తమని కించపరిచే విధంగా ఈమె ఈ హారం ధరించారు అంటూ మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఛత్రిపుర పోలీస్ స్టేషన్ లో తాప్సీపై కేసు నమోదు చేశారు. ఇలాంటి దుస్తులు ధరించి లక్ష్మి హారం వేసుకోవడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈమెపై ఇండోర్ లోని హింద్ రక్షక్ సంగతన్ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే మాలిని తనయుడు ఏకలవ్య గౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ విషయంపై తాప్సి ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…