Tabu: జాగ్రత్తగా చేయండి అంటూ..బాలీవుడ్ యంగ్ హీరోకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన టబు..!
Tabu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్, హూజా హెగ్డే అందాలు ఈ ఫ్యామిలీ డ్రామాను హిట్ చేశాయి.
దీంతో పాటు తమన్ అందించిన మ్యూజిక్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఇంతే కాకుండా బన్నీ క్యారెక్టరైజేషన్, సముద్ర ఖని విలనిజం సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా తల్లి పాత్రలో టబు ఒదిగిపోయింది. చాలా కాలం తరువాత తెలుగులో స్ట్రేయిట్ మూవీ చేసింది.
అయితే ఇంతలా హిట్ అయిన ఈ సినిమా పై మొదటి నుంచి బాలీవుడ్ నజర్ పెట్టింది. తాజాగా ఈసినిమాను హిందీలో రిమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్, కృతి జంటగా నటిస్తున్నారు. ఈసినిమాను షెహ్ జాదాగా టైటిల్ ను కూడా నిర్ణయించారు. రోహిత్ ధావన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా చేస్తున్న కార్తిక్ ఆర్యన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది టబు. తన సినిమాను రీమేక్ చేస్తున్నారని.. జాగ్రత్తగా రీమేక్ చేయాలంటూ కార్తిక్ ఆర్యన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది టబు.
తాజాగా అల వైకుంఠపురం హిందీ రిమేక్ హెహ్ జాదా కూడా సక్సెస్ కావాలని టబు కోరుకుంది. అయితే తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఎలాంటి మార్పులు లేకుండా.. హిందీలోకి అనువదిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. హిందీలో ఎలాగైనా సూపర్ హిట్ సాధించాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…