Tag Archives: anasuya

Anasuya: నేను మాట్లాడింది అలా కాదు.. నేనేం మాట్లాడిన కాంట్రవర్సీ చేస్తారు: అనసూయ

Anasuya: యాంకర్ అనసూయ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈమె మంచి లీడర్ కి సపోర్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ కనుక పిలిస్తే జనసేన పార్టీకి తాను సపోర్ట్ చేస్తాను అంటూ వెల్లడించారు. ఇక నాగబాబు పవన్ కళ్యాణ్ పిలిస్తే అదే పార్టీకి మద్దతు తెలుపుతానని ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఇలా జనసేనకు ప్రచారం చేస్తానని ఈమె చెప్పడంతో జనసేన నాయకులు ఈ వార్తలను మరింత వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా మరి కొంతమంది అనసూయ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనసూయ అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ మీడియా సమావేశంలో భాగంగా అనసూయను రిపోర్టర్స్ ప్రశ్నిస్తూ జనసేనకు ప్రచారం చేస్తున్నారట ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ ఈ మధ్యకాలంలో నేను దగ్గినా తుమ్మినా కూడా నన్ను ట్రోల్ చేస్తున్నారని ఈమె తెలిపారు. నేను జనసేనకు ప్రచారం చేస్తానని ఎక్కడా కూడా చెప్పలేదు మంచి లీడర్స్ అడిగితే సపోర్ట్ చేస్తానే కానీ నా అంతట నేను వెళ్లి సపోర్ట్ చేస్తానని ఎక్కడ చెప్పలేదు.

జనసేన ప్రచారం చేస్తానని చెప్పలేదు..

పవన్ కళ్యాణ్ అని మాత్రమే కాదు ప్రతి పార్టీలో కూడా చాలామంది మంచి అజెండాలతో కలిగినటువంటి వారు ఉన్నారు. అలాంటి లీడర్స్ అడిగితే కనుక నేను పార్టీలను చూడకుండా వ్యక్తులను చూసి సపోర్ట్ చేస్తానని చెప్పానే తప్ప ఎక్కడ కూడా జనసేనకు ప్రచారం చేస్తానని చెప్పలేదు అంటూ ఈ సందర్భంగా అనసూయ తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anasuya: అరేయ్ చిట్టిబాబు అంటూ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అనసూయ?

Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక అనసూయకు సినిమా ఇండస్ట్రీలో ఇంత మంచి సక్సెస్ రావడానికి కారణం రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అని చెప్పాలి.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబు పాత్రలో నటించగా అనసూయ రంగమ్మత్త పాత్రలో నటించారు. ఇకపోతే తాజాగా అనసూయ రజాకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి ప్రస్తావనకు వచ్చింది.

ఈ సినిమాలో అనసూయ వేషధారణ మాట తీరు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రామ్ చరణ్ గారికి కూతురు పుట్టింది కదా తనకు రంగమ్మత్త స్టైల్ లోనే శుభాకాంక్షలు ఎలా చెబుతారు అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ అరే చిట్టిబాబు పాప పుట్టిందంటగా చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు. జాగ్రత్తగా ఉండండే అంటూ అనసూయ రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

చూడముచ్చటగా ఉన్నారు..
ఈ విధంగా అనసూయ మరోసారి చిట్టిబాబు అంటూ పిలవడంతో మరోసారి అభిమానులందరికీ కూడా రంగస్థలం సినిమా గుర్తుకు వస్తుందని చెప్పాలి ప్రస్తుతం అనసూయ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాతో పాటు అనసూయ పుష్ప 2 సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Anasuya: అనసూయ పట్ల అలిగిన అభిమాని.. అభిమాని అలక తీర్చిన అనసూయ?

Anasuya: బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకొని కెరియర్ పరంగా బిజీ అయినటువంటి వారిలో అనసూయ భరద్వాజ ఒకరు. ఈమె బుల్లితెరపై తన ప్రయాణం మొదలుపెట్టారు. బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ మరోవైపు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా వెళ్తూ సందడి చేస్తున్నారు. అయితే షాపింగ్ మాల్స్ కార్యక్రమంలో భాగంగా ఈమె అభిమానులను నిరాశ పరిచారు అంటూ అభిమాని ఏకంగా అనసూయ పై ఆలిగారు.

ఈ సందర్భంగా అనసూయను ఉద్దేశించి ఆ నేటిజన్ కామెంట్ చేస్తూ షాపింగ్ మాల్స్ కి వచ్చినప్పుడు సెల్ఫీలు ఇస్తామంటారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కనీసం మా వైపు చూడటానికి కూడా ఇష్టపడరు అంటూ తన మనసులో ఉన్నటువంటి ఆవేదన బయటపెట్టారు. ఇకపై అయిన కాస్త మమ్మల్ని పట్టించుకోండి అంటూ నేటిజన్ చేసిన కామెంట్ కు అనసూయ రిప్లై ఇచ్చారు.

తెలిసి అలా జరగదు.

ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ ఎంత మాట అన్నారు.తెలియకుండా అలా జరిగిపోయిందేమో కానీ తెలిసి అయితే అసలు అలా జరగదని, త్వరలోనే మనం కలిసి సెల్ఫీ దిగుదాం అంటూ తన అభిమానికి ఇచ్చినటువంటి ఈ రిప్లై వైరల్ గా మారింది. ఇలా అనసూయ పట్ల అలిగిన అభిమాని కోరికను తీర్చుతాను అంటూ ఈమె తనని బుజ్జగిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Kirak RP: అనసూయ రష్మీ ఇద్దరు అలాంటి వాళ్లే.. వారి బండారం బయటపెట్టిన ఆర్పీ?

Kirak Rp: కిరాక్ ఆర్పి పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగినటువంటి ఈయన కొన్ని కారణాలు వల్ల జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆర్పీ ప్రస్తుతం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈయన జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడానికి ఎన్నో కారణాలను చెప్పారు మల్లెమాల వారితో తనకు విభేదాలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి వారికి సరైన ఫుడ్ ఇవ్వరని పేమెంట్ కూడా సరిగా ఇవ్వరు అంటూ ఎన్నో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన జబర్దస్త్ యాంకర్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి అనసూయ రష్మి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనసూయ జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు ప్రస్తుతం ఈమె సినిమాల పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇక రష్మీ ఇప్పటికి ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా వీరిద్దరి గురించి ఆర్పీ మాట్లాడుతూ..

యాంకర్లుగా సక్సెస్ అయ్యారు..
రష్మీ అప్పటి వరకు ఉన్న యాంకర్స్ స్థాయికి మించిన యాంకర్. ఆమెకు తెలుగు సరిగా రాదు. భాష రాకుండా, తనకొచ్చిన స్లాంగ్ తో సక్సెస్ అయ్యింది. ఆమె తెలుగును కాస్త తెగులు అన్న అందరూ నవ్వుకుంటారని తెలిపారు. ఇక అనసూయ గురించి మాట్లాడుతూ.. యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా ప్రత్యేకమైన క్యారెక్టర్స్ తో తన స్థాయిని పెంచుకుంది. ఆమెకు సినిమాలకు కూడా బాగా సెట్ అయ్యింది అంటూ ఆర్పీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anasuya: అతనితో కలిసి లేచిపోదామనుకున్న అనసూయ.. ఇంటి నుంచి బయటకు గెట్టిన తండ్రి?

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె వృత్తిపరమైన విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే అనసూయ సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈమె ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఎన్సిసి క్యాంపులో సుశాంక్ పరిచయం ఏర్పడటంతో అప్పటినుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ రహస్యగా ప్రేమ ప్రయాణం కొనసాగించారు అయితే అనసూయ తండ్రి తనకోసం ఒక పైలెట్ సంబంధం తీసుకువచ్చారట మంచి ఉద్యోగం మంచి ఆస్తిపరుడు తనకు పెళ్లి చేయాలని భావించారు. అయితే అనసూయ మాత్రం తన ప్రేమ విషయాన్ని తన తల్లి ద్వారా తన తండ్రికి చేరవేయడంతో తన తండ్రి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా తాను తెచ్చిన సంబంధం చేసుకుంటే సరేనని లేదంటే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అంటూ తన లగేజ్ మొత్తం బయటకు విసిరేసారట. దీంతో తన లగేజ్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి అనసూయ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు తన తండ్రి అంగీకారం కోసం ఎదురు చూశారట. తన తండ్రి తమ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో సుశాంక్ తో మనం లేచిపోయి పెళ్లి చేసుకుందామంటూ ఈమె మాట్లాడారట కానీ శశాంక్ మాత్రం అలా వెళ్లి పెళ్లి చేసుకుంటే మనకు ఎలాంటి గౌరవం ఉండదు ఆయన మనసు తప్పకుండా మారుతుందని ఎదురు చూశారట.

9 ఏళ్ల నిరీక్షణ..

ఇలా అనసూయ ఎంతకీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చివరికి తన తండ్రి ఒక అడుగు వెనక్కి వేసి తన ప్రియుడుతోనే తనకు పెళ్లి చేశారని అయితే ఇష్టంగా మాత్రం చేయలేదని కానీ అనసూయకు పిల్లలు పుట్టిన తర్వాత తనని మనస్పూర్తిగా అంగీకరించారని తెలుస్తుంది. ఇలా తన పెళ్లిలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని తన ప్రేమ గెలిపించుకోవడం కోసం ఈమె ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాను అంటూ గతంలో కూడా తెలిపిన సంగతి తెలిసిందే.

Anasuya: రాజుల కాలం అయితే ఇంకో తాజ్ మహల్ ఉండేదేమో.. అనసూయ కామెంట్స్ వైరల్!

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెర సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వెండితెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె బుల్లితెరకు దూరమైన సంగతి మనకు తెలిసిందే. అయితే వెండితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అనసూయ తనుకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా తన విషయాలను మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు ఈమె గ్లామరస్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు తాజాగా ట్రెండీ వేర్ లో అనసూయ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె రాజుల కాలం కాదు రథం గుర్రం లేదు. ఒకవేళ రాజుల కాలం అయితే ఏ రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు.. ఇంకో తాజ్ మహల్ కూడా ఉండేదేమో అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఏ రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు..

ఇలా రాజుల కాలం కాదు రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు అంటూ ఈమె కామెంట్స్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె పుష్ప 2 సినిమాతోపాటు రజకార్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Anasuya: మరోసారి తల్లి కాబోతున్న అనసూయ.. ఇదేం ట్విస్ట్ అంటూ షాక్ లో ఫ్యాన్స్?

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో అనసూయ ఒకరు. ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ సినిమా అవకాశాలను అందుకున్నారు. అవకాశాలతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.

ఇక అనసూయ ఇటీవల కాలంలో సినిమాల పరంగా పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి. ఈమె విభిన్న పాత్రలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల అనసూయ నటించిన విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఇలాంటి సాహస భరితమైన పాత్రలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

తాజాగా అనసూయ మరోసారి తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె తల్లి కాబోతుంది అంటే నిజ జీవితంలో తల్లి కాబోతుంది అనుకుంటే మనం పొరపాటు పడినట్టే స్టార్ హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.


స్టార్ హీరోకి తల్లిగా..

అనసూయ స్టార్ హీరో సినిమాలో నటించబోతున్నారని అయితే ఈ సినిమాలో స్టార్ హీరో చిన్నప్పటి పాత్రకు సంబంధించినటువంటి సన్నివేశాలలో తన తల్లిగా అనసూయ కనిపించబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఈమె మరోసారి తల్లి పాత్రలలో నటిస్తూ పెద్ద సాహసమే చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా తల్లి పాత్రలలో నటిస్తే అలాంటి పాత్రలలోనే అవకాశాలు వస్తాయని చాలామంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అనసూయ మాత్రం అలాంటి పాత్రలకు ఒప్పుకొని పెద్ద సాహసమే చేస్తున్నారని తెలుస్తుంది.

Anasuya: తన కొడుకుల వల్ల చాలా నష్టపోతున్నా.. అనసూయ బాధలు మామూలుగా లేవుగా?

Anasuya: యాంకర్ అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం యాంకరింగ్ గుడ్ బై చెబుతూ వెండి తెరపై నటిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి అనసూయ వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

ఇలా వెండితెర సినిమాలలో బిజీగా ఉండి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె తన కొడుకుల వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నాను అంటూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

అనసూయ కొడుకులు వల్ల ఎందుకంత ఇబ్బంది పడుతుందనే విషయానికి వస్తే తన కొడుకులు తమ జోబి కాలి చేయకుండా అలాగే బట్టలు వదిలేస్తారని తాను అలాగే వాషింగ్ మిషన్ లోకి వేయడం వల్ల వాషింగ్ మిషన్ తరచూ పాడవుతుందని రెండు నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఈమె తన కొడుకులు వల్ల జరిగే నష్టాన్ని తెలియజేశారు.

అలాంటి వాళ్లంటే గౌరవం..

మా ఇంట్లో మాత్రమే ఇలా ఉంటుందా మీకు కూడా ఇలాగే జరుగుతుందా అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే డస్ట్ బిన్ కనిపించే వరకు చెత్త కాగితాలను తమ జోబులో పెట్టుకుంటారో అలాంటివారు అంటే నాకు చాలా గౌరవం అంటూ కూడా అనసూయ ఈ సందర్భంగా తన కొడుకుల వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Anasuya: నాకు పిల్లల్ని కనాలని ఉంది… ఆ విషయంలో తృప్తిగా లేనట్టు షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ?

Anasuya: బుల్లితెర యాంకర్ గా వెండితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం వెండి తెరపై సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అనసూయ శశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కానీ పిల్లల విషయంలో అనసూయ తృప్తి పొందలేదని తెలుస్తుంది ఈమెకు ఇంకా పిల్లల్ని కనాలని ఉంది అంటూ తాజాగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు ఇద్దరు అబ్బాయిలే ఉన్నారని కాకపోతే తనకు కూతురు కావాలని కోరిక ఎప్పటినుంచో ఉంది కానీ వీలు కాలేదు అంటూ అనసూయ తెలిపారు. తనకు కూతురు కావాలని కోరిక ఉందని ఆ కోరిక తీరలేదని ఈమె తెలిపారు.

కూతురు లేని లోటు ఉంది..

ఇద్దరు కొడుకులు పుట్టినప్పటికీ కూతురు లేదు అన్న అసంతృప్తి తనలో అలాగే ఉంది అంటూ పిల్లల గురించి అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఈమె మరోసారి ప్రెగ్నెంట్ అయ్యే విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తాను మరొక బిడ్డకు కూడా జన్మనివ్వడానికి సిద్ధంగానే ఉన్నాను అంటూ థాంక్యూ బ్రదర్ సినిమా ప్రమోషన్ల టైం లో పిల్లల్ని కనడం గురించి కూడా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.