Tag Archives: andhra pradesh

Ap Politics: అధికారం పోతుందన్న భయంతోనే వైసిపి గొడ్డలి ఎత్తుతున్నారు.. లోకేష్ కామెంట్స్ వైరల్!

Ap Politics: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చాలా వేడి మీద కొనసాగుతూ ఉన్నాయి. ఆంధ్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తికరంగా ఉంటాయని సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల హడావిడి కావడంతో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతూ ఉన్నాయి.

ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు వైసిపి నుంచి టీడీపీకి టిడిపి నుంచి వైసీపీకి వలసలు వెళ్తున్నారు. అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇరువురి పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే ఈ గొడవలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సొంత బాయ్ బాయ్ మీదే గొడ్డలి వేటు వేసి దక్కించుకున్నటువంటి అధికారం ఈసారి పోతుందన్న భయంతోనే వైకాపా నేతలు గొడ్డలి ఎత్తుతూ దాడులకు పాల్పడుతున్నారని ఈయన కామెంట్లు చేశారు. జగన్ ఆయన సైకో సైన్యానికి ఇవే ఆఖరి రోజులని లోకేష్ తెలిపారు.

ఇవే ఆఖరి రోజులు..
ఇటీవల గిద్దలూరు మండలం గడికోటకు చెందిన మునయ్య వైకాపా నుంచి టిడిపిలోకి రావడంతో వైకాపా నేతలు తనని బెదిరించి గొడ్డలితో దారుణంగా నరికి చంపడంతో లోకేష్ ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారు. తప్పకుండా తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సురక్షితంగా ఉంటారని రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అంటూ ఇటీవల ప్రచార కార్యక్రమాలలో లోకేష్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ramgopal Varma: పిఠాపురం ఎన్నికల బరిలో వర్మ… పవన్ కి పోటీగా నిలబడుతున్నారా?

Ramgopal Varma: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి జరుగుతుంది. మరికొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు ప్రజలలోకి వస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయబోతున్నారు అనే జాబితాలను కూడా విడుదల చేస్తున్నారు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్న నేపథ్యంలో ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా పవన్ కళ్యాణ్ తాను ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని ప్రకటించిన వెంటనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

తాను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే అనుకోకుండా తాను పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నానని ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తాను కూడా పిఠాపురం నియోజకవర్గంలో నిలబడుతున్నానంటూ ఈయన కామెంట్ చేయడంతో వర్మ ట్వీట్ వెనుక ఉన్న అర్థమేంటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

వర్మ సెటైరికల్ ట్వీట్…
ఈయన నిజంగానే పిఠాపురం ఎన్నికల బరిలో దిగబోతున్నారా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేయగా మరి కొందరు పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ఇలాంటి ట్వీట్ చేశారు అంటూ వర్మ చేస్తున్న ట్వీట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఎలాంటి ఉద్దేశంతో వర్మ ఈ విధమైనటువంటి పోస్ట్ చేశారనే విషయం తెలియాలి అంటే ఆయనే స్పందించాల్సి ఉంటుంది.

Ap Politics: దేవినేని ఉమాకు షాక్.. పెనుమలూరులో టికెట్ కోసం అబ్బాయ్ బాబాయ్ పోటాపోటి!

Ap Politics: త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఎన్నికల హడావిడి జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి మరో పార్టీకి రాజకీయ నాయకులు చేరడంతో రాష్ట్ర రాజకీయlaaలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున టిడిపిలోకి వలసలు వెళుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఇక ఈయన తెలుగుదేశం పార్టీలోకి రావడంతో మైలవరం ఇన్చార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమా పరిస్థితి అయోమయంగా మారిపోయింది. వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో మైలవరం ఇన్చార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమాను పెనమలూరు ఇన్చార్జిగా వ్యవహరిస్తారని అక్కడ ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది.

ఇక పెనమలూరులో దేవినేని ఉమకు టికెట్ కన్ఫామ్ అనుకున్నటువంటి తరుణంలో దేవినేని కుటుంబం నుంచి మరో అభ్యర్థి పోటీకి సై అన్నారు. దేవినేనికి కుమారుడు వరస అవుతున్నటువంటి దేవినేని చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది. దేవినేని చంద్రశేఖర్ పాదయాత్రలో లోకేష్ కి చాలా సన్నిహితం అయ్యారు. ఇక లోకేష్ కు ఈయనకు మంచి సఖ్యత ఉన్నటువంటి తరుణంలో పెనమలూరు టికెట్ చంద్రశేఖర్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

బాబాయ్ కి పోటీగా అబ్బాయి..
ఈ విధంగా పెనమలూరు టికెట్ చంద్రశేఖర్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తరుణంలో దేవినేని ఉమా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న అంశంపై ఆందోళన నెలకొంది ఏది ఏమైనా పెనమలూరు టికెట్ విషయంలో బాబాయ్ కి అబ్బాయి గట్టి షాక్ ఇచ్చారని తెలుస్తుంది. మరి దేవినేని ఉమా విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది.

Suriya: చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య… ఏం చేశారో తెలుసా?

Suriya: తమిళ నటుడు సూర్యకు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతే స్థాయిలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఇక్కడ కూడా సూర్యకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే జూలై 23వ తేదీ సూర్య తన 48వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా తెలుగు తమిళనాట అభిమానులు భారీ స్థాయిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఊహించని ఘటన అపశృతి చోటుచేసుకుంది సూర్య ఫ్లెక్సీలు కట్టబోతుండగా ఇద్దరు అభిమానులు మరణించారు.

నరసారావుపేట మండలం మోపువారిపాలెంకి చెందిన ఇద్దరు డిగ్రీ విద్యార్థులు నక్క వెంకటేష్, పోలూరు సాయి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మరణించారు. ఈ పెను విషాదం సూర్య అభిమానులని కలచి వేసింది. ఇక ఈ విషయం తెలిసినటువంటి సూర్య అభిమానుల కుటుంబాలను పరామర్శించారు వీడియో కాల్ ద్వారా ఈయన చనిపోయిన అభిమానుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు అనంతరం ఆ రెండు కుటుంబాలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Suriya: అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య..


ఓ అభిమాని కుటుంబం మాత్రంతమ బిడ్డను కోల్పోవడంతో మగదిక్కు లేకుండా పోయిందని కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే తన సోదరీ డిగ్రీ పూర్తి చేసిన విషయం తెలుసుకున్నటువంటి సూర్య తనకు ఉద్యోగం ఇప్పించే బాధ్యతను తీసుకున్నారు. పోయిన ప్రాణాలను తాను తీసుకురాలేను కానీ మీ కుటుంబానికి ఏ అవసరం వచ్చిన తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఇలా అభిమానుల కుటుంబాలకు సూర్య అండగా నిలవడంతో మరోసారి ఈయన మంచి మనసు పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Bullet Bhaskar: వైసిపి పై పంచ్ డైలాగ్స్ వేసిన బుల్లెట్ భాస్కర్…. కట్ చేస్తే అభిమానులకు క్షమాపణలు!

Bullet Bhaskar: బుల్లితెర కామెడీ షోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకులను సందడి చేస్తుంది. అయితే తాజాగా ఈ వరప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా బుల్లెట్ భాస్కర్ టీం లో నరేష్ తో పాటు బుల్లెట్ భాస్కర్ తల్లిదండ్రులు కూడా చేశారు. ఓ నటి ‘బావగారూ సినిమాకు తీసుకెళతారా’ అని భాస్కర్ తండ్రిని అడగ్గా.. సెకండ్ షోకు వెళ్లకమ్మా. ఆయనకు రే చీకటి అంటూ తల్లి కౌంటరిచ్చింది. ఆయనకు నెల ఇన్ కమ్ ఎంత వస్తుందమ్మా అని అడగ్గానే 2750 రూపాయలు వస్తుందని చెప్పారు.అదేంటి మరి పెరగదా అనడంతో పెరగదు వేరే గవర్నమెంట్ వస్తేనే పెరుగుతుంది అంటూ వైసీపీ పై పంచ్ డైలాగ్స్ వేశారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పెన్షన్ 2750 రూపాయలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి డైలాగ్స్ రాసారని తెలిసి వైసీపీ అభిమానులు బుల్లెట్ భాస్కర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.గత ప్రభుత్వం ఎంత పెన్షన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని తెలిపారు.

Bullet Bhaskar: క్షమాపణలు చెప్పిన భాస్కర్…


ఒకవేళ మీరు ఇలాంటి రాజకీయ విమర్శలు కనుక చేయాల్సి వస్తే రాజకీయ వేదికల పైకి వచ్చి విమర్శలు చేయాలి కానీ కళామతల్లి వేదికపై ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు అంటూ తీవ్ర స్థాయిలో బుల్లెట్ భాస్కర్ టార్గెట్ చేయడంతో దెబ్బకు ఈయన వైసిపి అభిమానులకు క్షమాపణలు చెప్పడమే కాకుండా స్కిట్ లో డైలాగ్స్ అన్నింటిని కూడా తొలగించారు.

Mahesh Babu: మరోసారి మంచి మనసు చాటుకున్న మహేష్.. రెండేళ్ల చిన్నారికి పునర్జన్మ?

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు కేవలం తెరపై మాత్రమే కాకుండా హీరో అని అందరికీ తెలిసిందే. ఈయన సినిమా ఇండస్ట్రీలో సంపాదిస్తూ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మల ప్రసాదిస్తున్నారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులందరికీ కూడా ఈయన ఉచితంగా తన ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్లు చేయిస్తూ చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే కొన్ని వందల మందికి సర్జరీలు చేయించడం మహేష్ బాబు తాజాగా మరో రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోసారు.

ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన రెండేళ్ల కార్తికేయ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.అయితే తనకు హార్ట్ లో రంద్రం ఉందని సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో దిక్కు తెలియక మహేష్ బాబు ఫౌండేషన్ ను ఆశ్రయించారు. వెంటనే బాలుడిని తీసుకుని వెళ్లి ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో బాలుడికి హార్ట్ ఆపరేషన్ చేసి బాబు ప్రాణాలను నిలబెట్టారు..

Mahesh Babu: మంచి మనసు చాటుకున్న మహేష్…

ఇక వైద్యుల పర్యవేక్షణ అనంతరం తనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో బాబుని డిశ్చార్జ్ చేశారు. అయితే తమ కుమారుడి ప్రాణాలను నిలబెట్టినందుకు మహేష్ బాబు ఫౌండేషన్ కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ఇదే విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో మరోసారి మహేష్ మంచితనం పై అభిమానులు నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Ramcharan: ఎన్టీఆర్ గారిని చూడటం అదే మొదటిసారి… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

Ramcharan: దిగ్గజ నటుడు ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు ప్రస్తుతం హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ అన్ని తానై తండ్రి శతజయంతి వేడుకలను ఎంతో ఘనంగా జరిపిస్తున్నాడు. హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ఈ వేడుకలకు సీనియర్ నటినటులకు మాత్రమే కాకుండా ఈతరం కుర్ర హీరో హీరోయిన్లకు కూడా ఆహ్వానం అందింది.

ఇక ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా హాజరయ్యారు.
అలాగే మురళీమోహన్, జయప్రద, జయసుధ, కృష్ణవేణి లాంటి సీనియర్ నటీనటులతో పాటు.. నాగ చైతన్య, సుమంత్, అడివిశేష్, సిద్దు జొన్నలగడ్డ, రాంచరణ్ లాంటి ఈ తరం నటులు కూడా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ క్రమంలో రాంచరణ్ మాట్లాడుతూ..” తాను 5వ తరగతి చదువుతున్నప్పుడు పురందేశ్వరి గారి అబ్బాయితో కలసి స్కేటింగ్ క్లాసులకు వెళ్ళేవాడిని. ఆ సమయంలో తను ఒకరోజు మా తాతగారి ఇంటికి వెళదాం రా అని పిలిచి నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు అని చెప్పుకొచ్చాడు. అయితే అప్పుడు సెక్యూరిటీ గురించి నాకు తెలియదు. కానీ వెళ్లాను.అక్కడ ఆయన మార్కింగ్ వ్యాయామాలు పూర్తి చేసుకుని పెద్ద చికెన్ పెట్టుకుని బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారు.

Ramcharan చికెన్ వడ్డించారు…

మాకు కూడా చికెన్ వడ్డించారు నేను ఎన్టీఆర్ గారిని చూడడం అదే తొలిసారి అని రాంచరణ్ తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ గారిని తలచుకోకుండా ఉండరు. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ.. అప్పట్లోనే ఆయన సౌత్ ఇండియా సత్తాని దేశం మొత్తం చాటారు.. జై ఎన్టీఆర్ అంటూ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాలి.

Balakrishna: ఒక్కసారి మూడో కన్ను తెరిచానా అంతే…. ఆ ఎమ్మెల్యేకు బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన ఏ విషయాన్ని మనసులో దాచుకోరు. అది మంచైనా చెడైనా కోపం అయినా ప్రేమైనా మొహం మీద చెప్పేయడం బాలకృష్ణ నైజం.ఇలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం వల్ల ఈయన పలుమార్లు వివాదాలలో కూడా చికుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇలా ఏ విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడే బాలకృష్ణ తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే…ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలోఎన్టీఆర్ శతజయంతి దినోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మహానటి సావిత్రి కుమార్తె అలాగే నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ్ రెడ్డిని ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మహానటి సావిత్రి గురించి అలాగే నాగిరెడ్డి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తనదైన స్టైల్ లో వారిని ఇచ్చారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో భాగంగా వైయస్సార్సీపి కార్యకర్త భాస్కర్ రెడ్డి బాలకృష్ణ పాట పెట్టడంతో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి బాలయ్య పాట పెడతావా అంటూ తనని అవమానించారు దీంతో మనస్థాపానికి గురైన భాస్కర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే అతనికి అందరూ నచ్చజెప్పి పంపించారు.

Balakrishna: చిటికేస్తే చాలు… జాగ్రత్తగా ఉండు

నరసరావుపేటలో నా పాట వేసారని వైసీపీ ఎమ్మెల్యే ఆ అభ్యర్థిని చానా ఇబ్బందులకు గురి చేశాడు. రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్టద్దు.. సినిమాలను అన్ని పార్టీల వారు ఆదరిస్తున్నారు. అన్ని పార్టీల వాళ్ళు సినిమా చూస్తున్నారు అంటూ మాట్లాడటమే కాకుండా మధ్యలో ఒక్కసారి నేను మూడో కన్ను తెరిచానా…నా అభిమానులు ఒక్క చిటిక వేస్తే చాలు జాగ్రత్తగా ఉండు అంటూ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి పేరు ప్రస్తావించకుండా బాలయ్య తనదైన స్టైల్ లో తనకు వార్నింగ్ ఇచ్చారు.

Mokshagna: కుక్కలు అరుస్తుంటాయ్… కాలమే సమాధానం చెబుతుంది.. వైరల్ అవుతున్న మోక్షజ్ఞ ట్వీట్!

Mokshagna: విజయవాడలోనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో ఒక్కసారిగా వేడి వాతావరణం నెలకొంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఎంతోమంది ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా బాలకృష్ణ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైసిపి నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా తన తండ్రి గురించి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రంగంలోకి నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి పై విమర్శలు చేసిన వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా మోక్షజ్ఞ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బాలయ్య గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కుక్కలు మొరుగుతున్నాయి మీరు ఎంత అరిచిన కనీసం బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు. ఒకప్పుడు అవసరముండి ఆయన కాళ్ల వద్దకు వచ్చిన వారందరూ అవసరం తీరిపోయాక ఆయనపై కారు కూతలు కూస్తున్నారు. ఇలాంటి కారు కూతలు కూసే వారికి కాలమే సమాధానం చెబుతుంది అంటూ మోక్షజ్ఞ చేసిన ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Mokshagna: భగ్గుమన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు..

ఇలా ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఒకవైపు వైసీపీ నేతలు తెలుగుదేశం నేతలకు కౌంటర్ ఇవ్వగా తెలుగుదేశం నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున వైసిపి నేతలపై మండిపడుతున్నారు.మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Jr.NTR: నీ కన్నా షర్మిలానే బెటర్.. ఎన్టీఆర్ ట్వీట్ పై ఫైర్ అవుతున్న నందమూరి ఫ్యాన్స్?

Jr.NTR: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత బుధవారం అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరును మార్చాలంటూ నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చారు.

ఈ విధంగా ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడంతో తెలుగుదేశం అభిమానులు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఇద్దరు గొప్ప నాయకులే ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయన స్థాయి తగ్గదు. తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న జ్ఞాపకాలను చెరిపి వేయలేవు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైయస్సార్ ఎన్టీఆర్ ఇద్దరు గొప్ప నాయకులే అంటూ స్వీట్ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ను వైయస్సార్ తో పోల్చడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాయి ఏంటి వైయస్సార్ స్థాయి ఏంటి?ఇద్దరినీ గొప్పవాళ్ళను పోల్చడంపై నందమూరి అభిమానులు ఎన్టీఆర్ పై ఫైర్ అవుతున్నారు.

Jr.NTR: భారీ ట్రోలింగ్ కు గురైన ఎన్టీఆర్…

ఇలా తాత పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం విషయంపై ప్రశ్నించకుండా ఇద్దరు గొప్ప నాయకులే అంటూ ప్రశ్నించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలోనే మరి కొంతమంది నీకన్నా వైయస్ షర్మిలానే బెటర్ ఆమె ఎన్టీఆర్ పేరును తొలగించడం పూర్తిగా తప్పు అంటూ ఎంతో ధైర్యంగా తన అన్నయ్యను నిలదీసింది.మొత్తానికి ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ కారణంగా పెద్ద ఎత్తున నేటిజెన్లు అభిమానుల ట్రోలింగ్ కి గురయ్యారు.