Tag Archives: AP people

Free Ration: ఏపీ ప్రజలకు శుభవార్త..! రేషన్ కార్డుదారులకు ముఖ్య సూచన..!

Free Ration: కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులకు గురైన ప్రజలను ఆహార భద్రత విషయంలో ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాన్ యోజన అనే పథకం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాంగంగానే రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ వస్తోంది.

Free Ration: ఏపీ ప్రజలకు శుభవార్త..! రేషన్ కార్డుదారులకు ముఖ్య సూచన..!

ఈ పథకం గత సంవత్సరం నవంబర్ లోనే ముగించాల్సి ఉండగా.. దానిని మరో ఐదు నెలలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే ఈ సంవత్సరం మార్చి 31 వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు.

Free Ration: ఏపీ ప్రజలకు శుభవార్త..! రేషన్ కార్డుదారులకు ముఖ్య సూచన..!

దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా మరో శుభవార్తను అందించింది. జనవరి 18 నుంచి ప్రజలందరికీ ఉచిత బియ్యం పంపిణీ చేయనునట్లు పేర్కొంది.


ఐదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ

సాధారణంగా జవనరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉచిత రేషన్ బియ్యం సరఫరా జరగాలి. కానీ బియ్యం నిల్వలు లేనందును డిసెంబర్ నెలలో పంపిణీ చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు తాజాగా ఈ ప్రకటన చేసింది. డిసెంబర్, జనవరి నెలలకు సరిపడా.. ఒకొక్కరికీ 10 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత బియ్యం పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని గిరాజా శంకర్‌ సూచనలు చేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ ఒకొక్కరికీ 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు.

ఏపీ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నిమ్మగడ్డ ఆదేశాలతో ప్రభుత్వ పథకాలకు బ్రేక్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ నేడు అమ్మఒడి పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా ఈ పథకంతో పాటు ప్రభుత్వ పథకాల అమలుకు బ్రేక్ పడింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి వీలు లేదంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు అందాయి. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వల్ల నేడు ఖాతాల్లో జమ కావాల్సిన అమ్మఒడి నగదు ఆలస్యంగా జమ కానుంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా నిలిచిపోనుంది. జగన్ సర్కార్ గత నెల 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతోంది.

ఎన్నికల సంఘం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతూ పథకాల అమలుకు బ్రేక్ వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టులో జగన్ సర్కార్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ గురించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చినెల చివరి వారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు. అన్ని పార్టీల నుంచి అభిప్రాయం కోరి ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 28వ తేదీన ఎన్నికల కమిషనర్ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించన్నారు.

విజయవాడ నగరంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీలతో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వంతో పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత ఎన్నికల విషయంలో అడుగులు ముందుకు పడనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే నిధులు విడుదల అయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ గతంలో ఎన్నికలను వాయిదా వేయడంతో జగన్ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించింది.

ఆ తరువాత నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డారు. ఈ నెల 28వ తేదీన జరగబోయే మీటింగ్ తరువాత ఎన్నికల నిర్వహణ తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి సహకారం అందేలా ఆదేశాలు జారీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ పిటిషన్ విచారణ సమయంలో ప్రభుత్వ తరపు లాయర్ ఎన్నికల కమిషన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కోరలేదని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది నిమ్మగడ్డ రమేష్ కు హైదరాబాద్ లో సైతం అధికార నివాసం ఉన్నట్టు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్‌లో అధికార నివాసం, విజయవాడలో మరో నివాసం ప్రభుత్వ ధనం వృథా అవుతుందని వ్యాఖ్యానించింది.

ఏపీలో కేజీ మటన్ 200 రూపాయలు.. క్యూ లైన్లలో జనం.. చివరకు..?

ఈ మధ్య కాలంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో పలువురు వ్యాపారులు వినియోగదారులకు కళ్లు చెదిరే ఆఫర్లను ఇస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోని జి.కొండూరులో ఒక మాంసం దుకాణం కేజీ వేట మాంసం 200 రూపాయలు మాత్రమేనని బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆధార్ కార్డుతో జనం మాంసం కొనుగోలు చేయాలని సూచించింది. బహిరంగ మార్కెట్ ధరతో పోలిస్తే చాలా తక్కువ ధరకే అందిస్తూ ఉండటంతో దుకాణం ముందు జనం క్యూ కట్టారు.

వందల సంఖ్యలో ప్రజలు మాంసం కొనుగోలు చేశారు. అయితే 200 రూపాయలకు కిలో అమ్మిన వ్యాపారి మరుసటి రోజే ప్రజలకు భారీ షాక్ ఇచ్చాడు. ఒక్కరోజులోనే అమాంతం రేటు పెంచేశాడు. ఇతర వ్యాపారులు ఏ రేటుకు మటన్ ను విక్రయిస్తున్నారో అదే రేటుకు విక్రయించే ప్రయత్నం చేశాడు. దీంతో మాంసం వ్యాపారికి, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న 200 రూపాయలకు మాంసం విక్రయించగా నేడు ఎందుకు సాధ్యం కాలేదని గ్రామస్తులు వ్యాపారిని ప్రశ్నించారు.

అయితే వ్యాపారి చచ్చిన గొర్రెలు కాబట్టే ముందురోజు 200 రూపాయలకే మాంసం అమ్మాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కరోజులోనే మాంసం వ్యాపారి ఏకంగా 400 రూపాయలు ధర పెంచడంతో అధికారులు మాంసం దుకాణాలపై దృష్టి పెట్టి మాంసం నాణ్యతను పరిశీలించాలని.. 200 రూపాయలకు అమ్మిన మటన్ విషయంలో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని వెల్లడిస్తున్నారు.

వ్యాపారులు లాభాపేక్షతో చచ్చిన జీవాలను, రోగాలతో చనిపోయినా జీవాలను తమకు అంటగడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే మాంసం అమ్మకాల విషయంలో పోటీ పెరిగిందని.. మటన్ తక్కువ ధరకు అమ్మడంలో తిరకాసు ఉందని తెలుపుతున్నారు.

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. వారి ఖాతాల్లో రూ. 5 వేలు సాయం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. విద్య, వైద్య రంగాలతో పాటు పేదలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకున్న వారికి 5 వేల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

గత పది నెలల్లో జగన్ సర్కార్ ఏకంగా 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా కింద సాయం చేసింది. ఇందుకోసం ఏకంగా 134 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స పొందితే జగన్ సర్కార్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోందని వెల్లడించారు.

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా స్కీమ్ కుటుంబ పెద్దలు కోలుకునే సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సీఎం జగన్ ముందుచూపుకు ఈ నిర్ణయం మచ్చుతునక అని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 836 జబ్బులకు వైయస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ ద్వారా సహాయం అందుతోంది. రోగి చికిత్స చేయించుకునే సమయంలోనే ఆస్పత్రి సిబ్బంది రోగికి సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నారు.

ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రోగి ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉన్నారనే వివరాలను బట్టి రోజుకు 225 రూపాయల చొప్పున గరిష్టంగా నెలకు 5 వేల రూపాయలు ఇస్తారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరికైనా బ్యాంకు ఖాతా లేకపోతే వాళ్లు కుటుంబ సభ్యుల ఖాతాను ఇవ్వవచ్చు.

ఏపీ ప్రజలకు శుభవార్త.. రేషన్ డోర్ డెలివరీ ఎప్పటినుంచంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2021 సంవత్సరం జనవరి నుంచి రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. గతంలోనే ఈ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొనిరావాలని జగన్ సర్కార్ ప్రయత్నించినా వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం అమలు వాయిదా వడుతూ వస్తోంది. పౌరసరఫరాల శాఖ డోర్ డెలివరీ కోసం వాహనాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది.

జగన్ సర్కార్ డోర్ డెలివరీ వాహనాలకు సంబంధించి టెండర్లను ఇప్పటికే ఖరారు చేసింది. ఈ టెండర్లకు సంబంధించిన కాంట్రాక్ట్ టాటా మోటార్స్ సంస్థకు దక్కింది. మరోవైపు లబ్ధిదారులకు ఇచ్చే సంచులు, వాహనాలలో అమర్చే కాటాలకు సంబంధించి కూడా టెండర్లు ఖరారయ్యాయని సమాచారం. ప్రభుత్వం 520 కోట్ల రూపాయలు డోర్ డెలివరీ చేసే వాహనాల కొనుగోలు కోసం ఖర్చు చేయనుండగా టాటా మోటార్స్ సంస్థ ఒక్కో వాహనాన్ని 5.72 లక్షల రూపాయలకు టెండర్ దక్కించుకుందని తెలుస్తోంది.

సంక్షేమ కార్పొరేషన్ల నుంచి జగన్ సర్కార్ ఈ నిధులను ఖర్చు చేయనుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో గ్రామ, వార్డ్ వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. అయితే ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో జగన్ సర్కార్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా రేషన్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

డోర్ డెలివరీ వాహనాల ద్వారా ప్రజలకు నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు ఇంటి దగ్గరే అందే విధంగా జగన్ సర్కార్ చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం తీసుకున్న రేషన్ డోర్ డెలివరీ నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోందని చెబుతున్నారు.