Tag Archives: business

Actress Sudha: వ్యాపారంలో 100 కోట్లకు పైగా నష్టపోయి ఒంటరినయ్యాను…. నటి సుధ కామెంట్స్ వైరల్!

Actress Sudha: చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి సుధ ఒకరు.ఈమె పుట్టుకతోనే బాగా సంపన్నుల కుటుంబంలో పుట్టారు. బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన సుధా అనంతరం మూడు తమిళ సినిమాలలో హీరోయిన్ గా నటించారు. ఇలా హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మ పాత్ర అంటేనే అందరికీ టక్కున సుధా గుర్తుకు వస్తారు అలా అమ్మ పాత్రలలో లీనమై నటించిన సుధా ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరమయ్యారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుధా తన జీవితం గురించి పలు విషయాలను తెలియజేశారు.

ప్రస్తుత కాలంలో అమ్మ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదని అందుకే తాను ప్రాధాన్యత లేని సినిమాలలో నటించడం కన్నా దూరంగా ఉండడం మంచిదని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు.ఇక తాను పుట్టుకతోనే మంచి సంపన్నుల కుటుంబంలో పుట్టాను. అయితే చిన్నప్పుడే తల్లి చనిపోవడం అలాగే క్యాన్సర్ తో తండ్రి చనిపోవడంతో బంధువులందరూ మమ్మల్ని దూరం పెట్టారు.

Actress Sudha: సుధను దూరం పెట్టిన భర్త కుమారుడు…

అదేవిధంగా మా ఆస్తులు కూడా కర్పూరంలా కరిగిపోయిందని సుధా వెల్లడించారు. ఇక సినిమాలలో తాను సంపాదించినది మొత్తం వ్యాపారంలో పెట్టాను. ముందుగా ఢిల్లీలో తాను రెస్టారెంట్ పెట్టడంతో రెస్టారెంట్ ద్వారా మంచి లాభాలు వచ్చాయి. ఇలా లాభాలు రావడంతో మరొక హోటల్ పెట్టాము. దీంతో వ్యాపారం మొత్తం దివాలా తీసిందని దాదాపు 100 కోట్లకు పైగా నష్టపోయామని తెలిపారు.ఇలా సినిమాలలో సంపాదించినది మొత్తం వ్యాపారంలో పోగొట్టుకున్నామని సుధ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక కొన్ని కారణాలవల్ల ఈమె భర్త కుమారుడు కూడా ఈమెను దూరం పెట్టి వారు అమెరికాలో నివసిస్తున్నారు.

Success Story: రూ.50 వేలతో చేసిన ప్రయత్నం నేడు 20 కోట్లకు చేరింది…ఈ విజయం వెనుక ఎన్నోనిందలు, అవమానాలు.. దీప్తి సక్సెస్ స్టోరీ!

Success Story: సాధారణంగా చాలా మందికి వ్యాపారం చేయాలని ఎంతో ఆశగా, ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ఎన్నో నష్టాలను చవి చూస్తూ ఉంటారు. ఇలా వ్యాపారం పై ఉన్న మక్కువతో వ్యాపారంలోకి అడుగు పెట్టారు 24 సంవత్సరాల దీప్తి. మరొకరితో కలిసి ఈవెంట్ వ్యాపారాన్ని ప్రారంభించిన దీప్తి మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.

Success Story: రూ.50 వేలతో చేసిన ప్రయత్నం నేడు 20 కోట్లకు చేరింది…ఈ విజయం వెనుక ఎన్నోనిందలు, అవమానాలు.. దీప్తి సక్సెస్ స్టోరీ!

ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కోర్సు పూర్తిచేసి సిఎ చదువుతున్న దీప్తి వ్యాపారంపై మక్కువతో వ్యాపార రంగం వైపు అడుగులు వేసింది. కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఈమె నేడు 20 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది.అయితే ఈ విజయం వెనుక ఎన్నో అవమానాలు, నిందలు కూడా ఉన్నాయని దీప్తి వెల్లడించారు.

Success Story: రూ.50 వేలతో చేసిన ప్రయత్నం నేడు 20 కోట్లకు చేరింది…ఈ విజయం వెనుక ఎన్నోనిందలు, అవమానాలు.. దీప్తి సక్సెస్ స్టోరీ!

మరొకరి భాగస్వామ్యంతో ఈవెంట్ వ్యాపారంలోకి అడుగు పెట్టిన దీప్తి డిసెంబర్ 31 2014 లో ఢిల్లీలో జరిగిన అతిపెద్ద ఈవెంట్ బాధ్యతలను తనకు అప్పగించారు. ఇక ఈ ఈవెంట్ కిపెద్ద ఎత్తున ముఖ్య అతిథులు రావాల్సి ఉండగా వాళ్ళు ఎవరూ రాలేదు దీంతో ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు, మరొక భాగస్వామి కూడా చేతులెత్తేయడంతో టికెట్లు అమ్ముడు పోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇలా ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆ ఈవెంట్ నిర్వహించారు.ఆ ఈవెంట్ కోసం చివరికి తన సొంత ఇంటిని అమ్ముకొని రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా రోడ్డుపైకి రావడంతో తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారని దీప్తి వెల్లడించారు. ఇక తన తల్లిదండ్రుల విన్నపం మేరకు వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యారు.

ఎందరికో స్ఫూర్తి దాయకం..

దీప్తికి ఉన్న కలలు, కోరికలు తెలుసుకున్న వికాస్ తనని తిరిగి వ్యాపారం చెయ్యమని ప్రోత్సహించారు.2016లో రూ.50 వేలతో డిజిటల్‌ హోర్డింగ్‌ అనే వ్యాపారాన్ని ప్రారంభించి ఈ వ్యాపారంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతూ నేడు 20 కోట్ల టర్నోవర్ సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

Ram charan-true jet: భారీ నష్టాల్లో రామ్ చరణ్ వ్యాపారాలు… అసలు విషయం బయట పెట్టిన అధికారులు!

Ram charan-true jet: మెగా పవర్ స్టార్ ఇటు సినిమాలతో పాటు అటు వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే అతని స్నేహితుడితో కలిసి ఏయిర్ లైన్స్ బిజినెస్ ప్రారంభించిన సంతగతి తెలిసిందే. ఇటు హీరోగా… నిర్మాతగా కూడా రామ్ చరణ్ సక్సెస్ సాధిస్తున్నాడు. 2015లో చరణ్ తన స్నేహితుడితో కలసి ట్రూజెట్ పేరుతో డొమెస్టిక్ ఎయిర్‌లైన్‌ బిజినెస్‌ స్టార్ట్ చేశాడు. ఈ విమానాలు హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు తమ ట్రూజెట్‌ ద్వారా విమానయాన సేవలు అందిస్తోంది.

Ram charan-true jet: భారీ నష్టాల్లో రామ్ చరణ్ వ్యాపారాలు… అసలు విషయం బయట పెట్టిన అధికారులు!

విమానయానాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు తక్కువ ధరకే సేవలను అందించాలని తన స్నేహితుడు ఉమేష్ తో కలిసి టర్బో మోగా ఎయిర్వేస్ సంస్థను ప్రారంభించారు రామ్ చరణ్. ఈ సంస్థ ట్రూజెట్ పేరుతో సర్వీసులను నడుపుతోంది. జులై 12, 2015న సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ విమానయాన సంస్థ మూతపడుతుందనే వార్తలు వస్తున్నాయి. 

Ram charan-true jet: భారీ నష్టాల్లో రామ్ చరణ్ వ్యాపారాలు… అసలు విషయం బయట పెట్టిన అధికారులు!

ట్రూజెట్ విమాన సంస్థ తీవ్ర నష్టాల్లో నడుస్తుందని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని ఆర్థిక పరిస్థితి దిగజారిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ట్రూజెట్ స్పందించింది. ట్రూజెట్ విమానాలను ఆపేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఇలాంటి వార్తలు నమ్మవద్దని సంస్థ స్పందించింది. ఈ సంస్థలో పని చేసే కొంత మంది అధికారులు రిజైన్ చేసి వెళ్లిపోవడం వల్ల.. వారి స్థానంలో కొత్తవాళ్లను నియమించామని.. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు కూడా వస్తున్నట్లు వెల్లడించింది. 

త్వరలోనే కొత్త సీఈఓ..

ఇన్వెస్టర్లు వచ్చాక ట్రూజెట్ కొత్త సీఈఓను ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు మేనేజింగ్ డైరెక్టర్ గా.. సీఈఓగా ఉమేస్ కొనసాగుతారని సంస్థ చెప్పకొచ్చింది. అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్ కారణాల వల్ల విమానాలను నిలిపివేసినట్లు తెలిపింది. త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తామని.. నవంబర్ 2021 నుంచి ఉద్యోగులకు ఒక్క పైసా చెల్లించడం లేదని వచ్చే వార్తల్లో నిజం లేదని అన్నారు. వారికి కొంత జీతాలు ఇచ్చామని.. తక్కువ సాలరీ ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు ఇచ్చామని ఓ ప్రకటనలో ట్రూజెట్ సంస్థ తెలియజేసింది.

అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా.. భారీగా పెరిగిన అంచనాలు..?

తెలుగులో రాబోతున్న చిత్రాల్లో అఖండ ఒకటి. నందమూరి బాలకృష్ణ , ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో ఫుల్ హ్యాపీగా ఉన్న చిత్ర యూనిట్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఫ్రి రిలీజ్ ఈవెంట్లో ఓ సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.53 కోట్ల బిజినెస్ చేసింది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇంత పెద్ద ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి తెలుగు సినిమాకు అఖండ రికార్టు స్పష్టించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 10.5 కోట్లు, సెడెడ్ లో రూ. 10.6 కోట్లు ఉత్తరాంధ్ర లో రూ. 6 కోట్లు, తూర్పుగోదావరి లో రూ. 4 కోట్లు, పశ్చిమ గోదావరి లో రూ. 3.5 కోట్లు, గుంటూరు లో రూ. 5.4 కోట్లు, కృష్ణా లో రూ. 3.7 కోట్లు, నెల్లూరు లో రూ.1.8 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం రూ. 45.5 CR, కర్ణాటక +భారతదేశంలో రూ. 5 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 2.5 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 53 CR, బ్రేక్ ఈవెన్ లో రూ. 54 కోట్లు వసూలు చేసింది.

రిలీజ్ కు ముందే ఇంత పెద్ద బిజినెస్ చేసిన అఖండ డిసెబంర్ 2 న ప్రపంచవ్యాప్తంగా 1400 థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు ఇంత పెద్ద బిజినెస్ చేసిన అఖండ సినిమా బిజినెస్ కు తగ్గట్లు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా అఖండ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది.

బాబాయ్ కోసం న్యూస్ ఛానల్ కొనుగోలు చేస్తున్న రామ్ చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ దర్శకులు రాజమౌళి, శంకర్ సారథ్యంలో సినిమాలను తీస్తున్నారు. అతడు హీరోగానే కాకుండా.. నిర్మాతగా కూడా ఎంతో విజయవంతం అయినట్లు నిరూపించుకున్నాడు. అతడు సినిమాల ద్వారానే కాదు.. అటు బిజినెస్ లల్లో కూడా పెట్టుబడి పెట్టి సంపాదిస్తున్నారు.

తన భార్య ఉపాసన కూడా బిజినెస్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అతడు అందకముందు ట్రూజెట్ లాంటి సంస్థల్లో పెట్టుబడి పెట్టి లభాలను గడించిన విషయం తెలిసిందే. అయితే అతడు ప్రస్తుతం ఓ న్యూస్ ఛానల్ ను కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫార్మాల్టీస్ మొత్తం పూర్తయ్యాయని కూడా తెలుస్తోంది. ఆ ఛానల్ పెద్ద పాపులారిటీ ఉన్నది కాదు.. ప్రస్తుతం నష్టాల్లో కూడా నడుస్తుంది.

ఆ ఛానల్ ఎంతో మంది చేతులు మారినట్లు సమాచారం. దీంతో ఆ యజమాని రాం చరణ్ కు ఈ ఛానల్ ను అమ్ముతున్నారు. ఇంత నష్టాల్లో ఉన్నా రాంచరణ్ పెట్టుబడితో దానిని లాభాల్లోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.

జనసేన పార్టీ అధినేతకు న్యూస్ ఛానల్ బలం ఎక్కువగా లేదు. ఆ మీడియా బలాన్ని రెట్టింపు చేయడానికి అతడు ఈ ప్లాన్ వేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రామ్ చరణ్ మరో రెండు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లను కూడా కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట.

వాళ్ళు నడపలేక మాకు ఇస్తున్నారు.. ఇది వ్యాపారం.. సర్వీస్ కాదు..!

చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు తాము వ్యతిరేకం కాదని.. అతడు తీసిన సినిమాపై తమకు నమ్మకం ఉంటే.. తాము థియేటరల్లో రిలీజ్ చేస్తామని.. లేదంటే తీసుకోమని నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు అన్నారు. ఇటీవల అతడు ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్న సినిమా నిర్మాతలు మీకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటుంన్నారని విలేకరి ప్రశ్నించగా.. సురేష్ బాబు ఇలా సమాధానం ఇచ్చారు.

వారి యొక్క అసమర్థత వల్లే ఇలా జరుగుతుందని తెలిపాడు. సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనేవి ఉండవు. మంచి సినిమా.. మంచి సినిమా కానివి అనేవి మాత్రమే ఉంటాయన్నారు. ఒకప్పుడు థియోటర్లు అన్నీ ముగ్గురు.. నలుగురు నిర్మాతలో ఆధీనంలోనే ఉన్నాయనేవారు. కానీ అవి తమ కంట్రోల్ లోకి రావడానికి కారణం ఎవరు ఆలోచించరని అన్నారు.

ఒక థియేటర్ యజమాని తన థియేటర్ హక్కులను వదిలిపెట్టి వేరొకరికి ఇవ్వడానికి కారణం అతడు ఆ వ్యాపారం రన్ చేయలేకనే ఇస్తున్నాడని క్లారిటీ ఇచ్చాడు. ఉదాహరణకు నందగోపాల్ యజమాని అయిన దేవీ థియేటర్ ఎవరి చేతిలోకైనా వెళ్లిందా.. లేదు కదా.. అతనికి ఆ థియేటర్ ను ఎలా రన్ చేసుకోవాలో తెలుసు.. గనుక అది అతడి చేతిలోనే ఉందంటూ తెలిపారు. ఇలా తమ వ్యాపారాలను రన్ చేసుకోలేక ఇబ్బంది పడినవారే తమకు బాధ్యతలు అప్పగించారని.. ఇలా ఎక్కువ థియేటర్లు మా వద్ద ఉన్నాయని అన్నారు.

ఒక వారంలో ఒక మంచి సినిమా రిలీజ్ అయిందంటే.. తమకు నమ్మకం ఉంటే తీసుకుంటాం లేదంటే.. లేదు అని అన్నారు. ఎక్కడైనా ఎవరైనా చేసేది బిజినెస్ మాత్రమే అని.. మేము చేసేది కూడా బిజినెస్ అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఓటీటీ పరిస్థితి కూడా అలానే ఉంది. సినిమా ఆడుతుందని నమ్మకం ఉంటేనే తీసుకుంటారు.. కానీ ఉపయోగం లేకుండా తీసుకోని నష్టపోవడానికి ఇష్టపడరు అని అన్నారు. అంతేగానీ తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.

పాత కొబ్బరి చిప్పలతో అందమైన పాత్రలు చేస్తూ.. వ్యాపారం..!

సాధారణంగా మనం ఎన్నో వస్తువులను నిరుపయోగం అని పారేస్తూ ఉంటాము. కానీ సరైన ఆలోచనా విధానంతో చూస్తే ప్రతి వస్తువు మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విధంగా అవసరమనుకున్న వస్తువులను సరైన క్రమంలో ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చని కేరళకు చెందిన మరియా కురియాకోస్‌ అనే మహిళ నిరూపిస్తోంది.

కురియాకోస్‌ అనే మహిళ వాడి పడేసిన పాత కొబ్బరిచిప్పలు సేకరించి వాటిని అందమైన వంటింటి పాత్రలుగా అద్భుతంగా రూపుదిద్దుతోంది. ఈ విధమైనటువంటి అందమైన పాత్రలు చేయడానికి ఆమె
థెంగా అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. పాత కొబ్బరి చిప్పలను సేకరించి వాటిని యంత్రాల సహాయంతో నునుపు చేసి వాటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ విధంగా పాత కొబ్బరి చిప్పలకు అలంకరించడానికి ఆమె పలువురు కళాకారులను ఉద్యోగంలో నియమించుకుంది. ఈ క్రమంలోనే కళాకారుల సహకారంతో ఈమె తన వ్యాపారాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడుపుతోంది. సాధారణంగా మనం మన వంటింట్లో చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లులను ఉపయోగించడం చూస్తుంటాము. అయితే ఇది పూర్తిగా రసాయనాలతో తయారైన వస్తువులు.

ఈ విధమైనటువంటి ప్లాస్టిక్ వస్తువుల స్థానంలోకి ఈ యువతి కొబ్బరి చిప్పలతో తయారుచేసిన పాత్రలను పరిచయం చేసింది.వీటిని ఎంతో సహజసిద్ధంగా తయారు చేయటం వల్ల వీటిలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకున్న ఎలాంటి హానికరం ఉండదు. ప్రస్తుతం ఈ యువతి కేరళలోని 5 జిల్లాలలో 12 మంది కళాకారులను నియమించుకొని తన వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. ఈ విధంగా అందంగా తయారు చేసిన ఆ పాత్రలను సెట్ల రూపంలో విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందడమే కాకుండా పలువురికి ఉపాధిని కూడా కల్పించింది.

మరో బిజినెస్ ప్లాన్ లో అడుగుపెట్టనున్న సమంత?

టాలీవుడ్ బ్యూటీ అక్కినేని కోడలు సమంత. ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న సమంత హీరోయిన్ గానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా కూడా బాగా పేరు సంపాదించుకుంది. ఇక వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా ఎన్నో సినిమాలలో అవకాశం అందుకొని మంచి సక్సెస్ లను అందుకుంది.

వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనేంటో నిరూపించుకుంది. ఎన్నో వాణిజ్యపరమైన ప్రకటనలలో చేసింది. అంతేకాకుండా తన భర్త నాగచైతన్యతో కూడా పలు ప్రకటనలలో చేసింది. ఇక ఫ్యాషన్ విషయంలోఎప్పుడు ట్రెండీగా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలతో యువతను బాగా పిచ్చెక్కిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో కూడా గార్డెనింగ్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ సోషల్ సర్వీస్ లో కూడా ముందుంటుంది.

ఇవన్నీ ఇలా ఉంటే బిజినెస్ పరంగా కూడా సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే పలు బిజినెస్ లతో బాగా దూసుకుపోతుంది. ఇక తన సొంత డిజైనింగ్ కంపెనీ సాకీ లో కూడా బాగా బిజీగా మారింది. పైగా వాటి డిజైన్స్ దుస్తులను ప్రమోట్ చేసేందుకు తానే స్వయంగా ఫోటో షూట్లు చేయించుకుంటుంది. ఇక ఏకమ్ లర్నింగ్ అనే స్కూల్ ను కూడా నడుపుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో వ్యాపారంలోకి అడుగు పెడుతుంది సమంత. అది కూడా జ్యువెలరీ బిజినెస్ పై ఆలోచనలు చేస్తుందట. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో తెలపనున్నారు. మొత్తానికి అటు ఇండస్ట్రీలో ఇటు బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న సమంత అక్కినేని కోడలు గా నాగార్జునకు మంచి గుర్తింపు అందిస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్ బిజినెస్ రంగంలో అడుగులు పెట్టగా అందులో తమన్నా కూడా జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది. ఇక సమంత ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.

నెలకు లక్ష రూపాయలు సంపాదించే బిజినెస్ ఐడియా.. ఏం చేయాలంటే..?

దేశంలో యువత, నిరుద్యోగులు ఉద్యోగంతో పోలిస్తే బిజినెస్ చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. యువత, నిరుద్యోగుల ఆలోచనలకు అనుగుణంగానే కొన్ని వ్యాపారాలు కళ్లు చెదిరే లాభాలను అందిస్తున్నాయి. అయితే కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టే వ్యాపారాల్లో కూడా కొన్నిసార్లు లాభాలు కొన్నిసార్లు నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

అందువల్ల ఇప్పటికే మంచి లాభాలను ఇస్తున్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే సులభంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. బనానా చిప్స్ బిజినెస్ ద్వారా నెలకు సులభంగా లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంటుంది. సాధారణంగా కొన్ని చిప్స్ ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. అయితే బనానా చిప్స్ మాత్రం ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంలో సహాయపడతాయి.

పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల్లో బనానా చిప్స్ ను విక్రయిస్తూ ఉంటారు. పెద్దపెద్ద కంపెనీలు చిప్స్ ను విక్రయిస్తున్నా బనానా చిప్స్ ను మాత్రం విక్రయించడం లేదు. అందువల్ల ఈ చిప్స్ బిజినెస్ చేస్తే తక్కువ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 120 కేజీల అరటిపండ్లతో 50 కేజీల చిప్స్ తయారు చేయవచ్చు. బనానా చిప్స్ మెషీన్లు, అరటికాయలు, నూనె చిప్స్ తయారీ కోసం అవసరమవుతాయి.

50 కేజీల చిప్స్ ను 10,000 రూపాయలకు విక్రయిస్తే 7,000 రూపాయలు లాభం వస్తుంది. నెలలో 25 రోజులు పని చేసినా సులభంగా లక్ష రూపాయల కంటే ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు. అయితే బనానా చిప్స్ ను సరైన విధంగా మార్కెటింగ్ చేసుకుంటే మాత్రమే కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

బ్రహ్మానందం రెండో కొడుకు ఏం చేస్తున్నాడో మీకు తెలుసా..?

దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ తన కామెడీ ద్వారా కోట్ల సంఖ్యలో అభిమానులను బ్రహ్మానందం సొంతం చేసుకున్నారు. కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం హీరో తరువాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. కమెడియన్ గా దాదాపు 1,100 సినిమాల్లో నటించిన బ్రహ్మానందంకు గత కొంతకాలం నుంచి అవకాశాలు తగ్గాయి.

కమెడియన్ బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు కాగా పెద్ద కొడుకు గౌతమ్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించి సక్సెస్ కాలేదు. అయితే చాలామంది ప్రేక్షకులు బ్రహ్మానందంకు ఒక్క కొడుకే ఉన్నాడని అనుకుంటున్నారు. బ్రహ్మానందం చిన్న కొడుకు విదేశాల్లో ఉండటంతో చాలామంది అలాగే భావించారు. ప్రస్తుతం నెట్టింట బ్రహ్మానందం తన చిన్న కొడుకుతో దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్రహ్మానందం రెండో కొడుకు పేరు సిద్దార్థ్.

అయితే సిద్దార్థ్ మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదని.. కొన్ని రోజుల క్రితం ఇండియాకు వచ్చిన ఇతను బిజినెస్ పై దృష్టి పెట్టాడని తెలుస్తోంది. తెలుగులో చాలామంది కమెడియన్ల కొడుకులు హీరోగా ప్రయత్నాలు చేసినా ఎవరూ సక్సెస్ కాలేదు. బ్రహ్మానందం చిన్న కొడుకును కూడా హీరో చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే బ్రహ్మానందం అభిమానులు అతని ఇద్దరు కొడుకులు సినిమాల్లోనే ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించే సామర్థ్యం ఉన్న బ్రహ్మానందానికి ప్రస్తుతం అవకాశాలు తగ్గినా నటించబోయే ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం ఆయన మళ్లీ వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మానందం చిన్న కొడుకులో హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని సిద్దార్థ్ సినిమాల్లో ట్రై చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతాడని బ్రహ్మానందం అభిమానులు భావిస్తున్నారు.