Tag Archives: cold

దగ్గు, జలుబు సమస్యతో బాధపడుతున్నారా.. జాగ్రత్త ఇది ఆ వ్యాధి కావొచ్చు..?

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ఆరోగ్యం బాగుంటే ఎప్పుడైనా ఏ పని అయినా చేసుకోవచ్చు. ప్రస్తుత వేసవి కాలం, శీతాకాలం అంటూ సంబంధం లేకుండా ఎన్నోరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా శీతాకాలంలో సీజనల్ వ్యాధులు మరి తొందరగా వ్యాపిస్తున్నాయి. దగ్గు, జలుబు, వాంతులు, జ్వరం వంటివి శీతాకాలంలో ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్యలు. చాలామంది ఇది వాటిని చాలా తేలికగా తీసుకుంటూ మందులు వాడుతూ ఉంటారు. కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో ఇప్పుడు మనం మనం తెలుసుకుందాం.

సాధారణంగా జలుబు ,దగ్గు తొందరగా నయం కావు. ప్రతిరోజు మందులు వాడిన తగ్గని దగ్గు,జలుబు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వాటిని నయం చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే భయపడాల్సిన వస్తుంది. జలుబు,దగ్గు విపరీతంగా ఉండి ఎన్ని రోజులకి తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించటం శ్రేయస్కరం.

జలుబు ఎన్ని రోజులకి తగ్గకపోతే అది న్యూమోనియా గా మారే ప్రమాదం ఉంది. అలాగే దగ్గు మరి ఎక్కువగా ఉంది చాలా రోజుల వరకు తగ్గకపోతే చాలా ప్రమాదం. 4 లేదా5 వారాలు విడువకుండా దగ్గు ఉంటే అది “టి-బి”గా మారే అవకాశం ఎక్కువగా ఉంది. దగ్గు ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులలో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు డాక్టర్ ను సంప్రదించి వారి సలహాలు తీసుకోవటం చాలా ముఖ్యం.

ప్రస్తుత కాలంలో వాహనాలు పెరిగి చెట్ల పెంపకం తగ్గిపోయింది. అందువల్ల వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆ గాలి మనం పీల్చు కోవడం ద్వారా ఎన్నో రకాల శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అవ్వటం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అందువలన వీలైనంత వరకు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉండకపోవడమే మంచిది.

ఈ లక్షణాలు ఉంటే మీకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువ..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా కరోనా ఎవరికైతే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుందో అలాంటి వారిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి తగినంత రోగనిరోధకశక్తి లేకపోతే నిరసించి పోతాము. అదేవిధంగా తరచూ అంటు వ్యాధులకు గురి కావలసి వస్తుంది. ఈ క్రమంలోనే వ్యాధితో పోరాడే శక్తి మన శరీరంలో లేనప్పుడు ఎన్నో రకాల జబ్బులతో పాటు కరోనా వైరస్ కూడా మనల్ని వెంటాడుతుంది. అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని తెలిపే లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

అధిక ఒత్తిడి: మన శరీరములో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉందని గుర్తించడానికి కనుగొనే మొదటి లక్షణం అధిక ఒత్తిడి. చాలా రోజుల నుంచి మీరు అధిక ఒత్తిడికి గురవుతున్న ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కచ్చితంగా మీ శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అంచనా వేయాలి.

తరచూ జబ్బులు బారిన పడటం: మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేకపోతే వ్యాధికారక బ్యాక్టీరియాలను, వైరస్లను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి ఉండదు. ఈ క్రమంలోనే బ్యాక్టీరియా వైరస్ల పై దాడి చేయడానికి సరైన మోతాదులో యాంటీబాడీలను ఉత్పత్తి చేయలేదు కనుక ప్రతి చిన్న విషయానికి మనం జబ్బుల బారిన పడాల్సి వస్తుంది.ఈ విధంగా తరచూ జబ్బుల బారిన పడుతూ ఉంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అంచనా వేసుకోవాలి.

అలసట: ఎంతో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్న, రాత్రి సమయంలో తనివితీరా నిద్ర పోయినా, పగలంతా ఎలాంటి కష్టతరమైన పనులు చేయకున్నా కూడా తరచూ అలసటగా ఫీలవుతుంటారు. ఈ విధంగా అలసటగా ఫీల్ అయితే మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం.

గాయం లేటుగా మానవడం:కొందరికి ఏదైనా చిన్న గాయాలు తగిలిన గాయం అనేది చాలా ఆలస్యంగా నయమవుతుంది. మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేకపోతే కొత్త చర్మ కణాలు ఉత్పత్తి చేయలేదు. ఈ విధమైనటువంటి లక్షణాలు తప్పకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం.

రాత్రిపూట పెరుగు తింటే ఏం జరుగుతుంది?

సాధారణంగా మన శరీరానికి పెరుగు, పాలు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసు పాలు,ఆహారంతో పాటు పెరుగు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం సక్రమంగా అందుతుందని భావిస్తాము. ఈ విధంగా పెరుగును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కానీ కొన్ని సార్లు మన పెద్దవారు రాత్రిపూట పెరుగు తినకూడదని హెచ్చరిస్తుంటారు. రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తుతాయని పెద్దలు చెబుతుంటారు.నిజంగానే రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు బారిన పడే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా పెరుగు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే రాత్రిపూట పెరుగు తినడం వల్ల కొందరిలో కొన్ని సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెరుగు తీసుకోవడం వల్ల కలిగే అనర్ధాలు:

  • సాధారణంగా పెరుగు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు ఫ్రిజ్లో పెడుతుంటారు. అయితే ఈ విధంగా ఫ్రిడ్జ్ లో ఉన్న పెరుగు తినడం వల్ల జలుబు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి పెరుగును బయటనుంచే తినాలి.
  • దగ్గు, జలుబు లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే రాత్రిపూట ఎటువంటి పరిస్థితులలో కూడా పెరుగును తినకూడదు.

*జలుబు, దగ్గు చేసినప్పుడు పెరుగు తినటం వల్ల కఫం ఏర్పడుతుందని, దీనివల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది తలెత్తుతాయని చెబుతున్నారు.

  • ఒకవేళ తప్పనిసరిగా పెరుగుతో తినాలనిపిస్తే పెరుగు బదులు పల్చటి మజ్జిగ తాగడం ఎంతో ఉత్తమం. అదే విధంగా రాత్రి వేళల్లో పెరుగు తినాలనిపిస్తే అందులోకి కొద్దిగా చక్కెర, నల్లటి మిరియాల పొడి కలుపుకొని తినడం వల్ల పెరుగును తొందరగా జీర్ణం చేస్తుంది

కరోనా జలుబులాంటిదే… మళ్లీమళ్లీ సోకుతుందంటున్న శాస్త్రవేత్తలు..!

ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు జలుబులా కరోనా వైరస్ కూడా వచ్చీపోయే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వైరాలజిస్టు వెండీ బార్క్‌లే కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యాప్తి చెందిన కరోనా వైరస్ కు మళ్లీమళ్లీ సోకే లక్షణం ఉందని తెలిపారు.

వాతావరణంలోని మార్పుల వల్ల ప్రతి సంవత్సరం దగ్గు, జలుబు ఏ విధంగా వస్తాయో కరోనా కూడా అదే విధంగా వస్తుందని తెలిపారు. వెండీ బార్క్‌లే బ్రిటన్ లో 3.65 లక్షల మంది ప్రజలకు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించి ఈ విషయాలను వెల్లడిస్తున్నామని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో కొన్ని నెలల పాటే యాంటీ బాడీలు ఉంటాయని గుర్తించామని… యాంటీబాడీలు లేకపోతే మళ్లీ వైరస్ సోకుతుందని చెప్పారు.

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో 26 శాతం మేర యాంటీబాడీలు తగ్గిపోతాయని గుర్తించామని.. వృద్ధుల్లో త్వరగా యాంటీబాడీలు తగ్గిపోతున్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించని వారిలో 64 శాతం యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాలు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి.

మరోవైపు భారత్ లో గతంలో నమోదైన కేసులతో పోలిస్తే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య సగానికి తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రజలు భావిస్తున్న తరుణంలో కరోనా మళ్లీమళ్లీ సోకుతుందంటే ప్రజలకు మరిన్ని సమస్యలు తప్పవు.

జలుబును కలిగించే కరోనా సోకిన వారికి శుభవార్త?

గడిచిన ఏడు నెలలుగా ప్రపంచ దేశాల ప్రజల మధ్య కరోనా వైరస్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ మహా నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు విస్తరిస్తోంది. అయితే కరోనా వైరస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి. కొందరిలో జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు కరోనా లక్షణాలుగా కనిపిస్తే మరి కొందరిలో మాత్రం ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి.

తాజాగా కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ లలో అనేక రకాలు ఉంటాయని వాటిలో కొన్ని మాత్రమే జలుబు, న్యూమోనియాను కలిగిస్తాయని చెబుతున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలించి చూస్తే జలుబు కరోనా లక్షణంగా కనిపించిన వారిలో కరోనా తీవ్రత తక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జలుబు కరోనా లక్షణంగా కనిపించని వారిలో మాత్రం తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలపై అధ్యయనం చేసి ఈ ఫలితాలను వెల్లడించినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తమ పరిశోధనల్లో జలుబుతో కూడిన కరోనా వచ్చిన వాళ్లు ఆస్పత్రుల్లో చేరిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీళ్లకు మరణాల ముప్పు తక్కువగా ఉందని పేర్కొన్నారు.

జలుబుతో కూడిన కరోనా సోకిన వాళ్లకు వెంటిలేటర్ల అవసరం కూడా పెద్దగా లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు కొందరు కరోనా వైరస్ సోకినా త్వరగా కోలుకోవడానికి, కొందరు ఎన్ని రోజులు చికిత్స పొందినా త్వరగా కోలుకోలేకపోవడానికి ఇవే కారణాలని వెల్లడించారు జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఇన్వెస్టిగేషన్‌ అనే పత్రికలో శాస్త్రవేత్తల పరిశోధనలకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురితమయాయి.