Tag Archives: Corona second wave

వ్యాక్సిన్ ఒక డోస్ వేసుకుంటే సరిపోతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి.ఇలాంటి తరుణంలో ఇండియాలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే,జనవరి నెలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే మొదటిదశలో 60 సంవత్సరాలు పైబడిన వారికి, రెండో దశలో 45 సంవత్సరాలు పైబడిన వారికి, మూడో దశ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా ఇలా కొత్త కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తూ భయాందోళనకి గురిచేస్తున్నాయి. ఈ వేరియంట్ల నుంచి రక్షణ పొందాలన్నా కూడా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.కానీ ప్రస్తుతం మనదేశంలో కూడా వ్యాక్సిన్ కొరత ఉంది. ఈ కారణంగానే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న 6 నుంచి 8 వారాల్లో ఇవ్వాల్సిన రెండో డోసును 12 వారాల తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో కోవిడ్ -19 కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన ప్రస్తుత వ్యాక్సిన్ ఈ కొత్త వేరియంట్లు పైన సమర్థవంతంగా పని చేస్తుందా అనే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం వైరస్ మ్యూటేషన్ ఇలాగే కొనసాగితే ప్రస్తుత వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చనని అలాంటి ప్రమాదకర పరిస్థితి రాకముందే సరైన సమయానికి రెండు వ్యాక్సిన్ డోసులు వేయించుకోవడం ముఖ్యమని,కొత్త వేరియంట్ల వ్యాప్తిని ఒక్క వ్యాక్సిన్ డోస్ అడ్డుకోవడం కష్టమని సూచిస్తోంది.కనుక నిర్ణీత గడువులోపు రెండు డోస్ ల వాక్సిన్ పూర్తి చేసుకొని,కొత్త వేరియంట్లను అడ్డుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముప్పు తొలగిపోలేదు… కరోనా రెండవ దశ పై హెచ్చరించిన కేంద్రం..!

గత రెండు నెలలుగా కరోనా రెండో దశ భారతదేశంపై ఎలా ఉందో మనందరికి తెలిసిందే. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఈ మహమ్మారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికి అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేశాయి. ఈ విధంగా కరోనా మహమ్మారిను అదుపు చేయడం కోసం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

అయితే కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా రెండవ దశ ప్రమాదం ఇంకా ముగిసిపోలేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మన దేశంలో ఇప్పటికి ఆరు రాష్ట్రాలలో కరోనా కేసులు రోజుకి తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయని, ఈ మహమ్మారి నుంచి పూర్తిగా మనం కోలుకోలేదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.జూన్ 23-29 మధ్యలో దేశవ్యాప్తంగా 71 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతానికిపైగా ఉంది. అందువల్ల ఈ వేవ్ నుంచి మనకు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కరోనా కేసులు పలు రాష్ట్రాలలో తగ్గుముఖం పట్టాయని ప్రజలు ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించిన వద్దు, నిర్లక్ష్యం కారణంగా మరోసారి వ్యాధి తీవ్రతకు కారణం అవుతాయని, ఈ వ్యాధిని అరికట్టడం కోసం వ్యాక్సిన్ కూడా శరవేగంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు కొంతవరకు పెరిగినప్పటికీ జూన్ 30 నాటికి మన దేశంలో పలు రాష్ట్రాల్లో 53 డెల్టా కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలియజేశారు.

ఈ విధంగా వివిధ రూపాలలో ఉత్పరివర్తనం చెందుతున్న వైరస్ నుంచి ప్రజలను కాపాడటం కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగిస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి యావరేజ్ గా రోజుకు 50 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లను అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఈ క్రమంలోనే ప్రజలందరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ కావాలా.. అయితే ఇలా చేయండి!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే మరోవైపు కరోనా రెండవ దశ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే మనం ఒకచోట నుంచి మరొక చోటుకు ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా కరోనా పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ కూడా మనకు ప్రయాణాలలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే మనం వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ ఏ విధంగా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం…

కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న తరువాత మనం వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను ఆరోగ్య సేతు యాప్, కొవిన్ పొర్టల్ వంటి ఎన్నో యాప్స్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా కోవిన్ యాప్ ద్వారా సర్టిఫికెట్ పొందడం కోసం కొవిన్ పొర్టల్ https://selfregistration.cowin.gov.in/ లింక్ ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ కాగానే మీ రిఫరెన్స్ ఐడీని ఎంటర్ చేయాలి. ఐడి ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ పై క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ పై డౌన్లోడ్ కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మన ఫోన్ లో వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది.

కొందరి ఫోన్లలో కోవిన్ యాప్ అందుబాటులో లేకపోతే కోవిన్ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ప్లే స్టోర్, ఆరోగ్య సేతు వంటి యాప్స్ ను అప్డేట్ చేసుకున్న తర్వాత కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కోవిన్ ట్యాబ్ పై క్లిక్ చేసి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఆప్షన్ పై Click చేయాలి. తరువాత Beneficiary ఐ డి ఎంటర్ చేయగానే గేట్ సర్టిఫికెట్ అనే ఆప్షన్ వస్తుంది.ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మన ఫోన్లో వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది.ఈ విధంగా మనం వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకొని నిరభ్యంతరంగా ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు.

టాలీవుడ్ కి మరో సోనూసూద్ గా మారిన యంగ్ హీరో..!!

కరోనా మహమ్మారి ప్రస్తుతం దేశ ప్రజలని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే కొన్ని లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి.ఈ నేపధ్యంలో బయటికి వెళ్లలేక, ఆదాయం లేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి వారికోసం కొందరు చేయూతను అందిస్తూ కొందరు విరాళాలు ప్రకటించారు. కొందరేమో తమకు వీలైనంతలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కానీ సోనూ లాగా ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసుకుని భారీగా ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు చేయడం అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదు.

దానికి కేవలం డబ్బులతో పాటు ఎంతో సమయం, ఓపిక కూడా కావాలి. సెలబ్రెటీల దగ్గర డబ్బులకు లోటుండదు కానీ.. సమయం, ఓపిక మాత్రం తక్కువే ఉంటుంది. ఈ కల్లోల సమయంలో ఎక్కువ టెన్షన్ తీసుకోవాలని వాళ్లు అనుకోరు. అందుకే సోనూకు వస్తున్న పేరును చూసి అసూయ చెందే వాళ్లు చాలామంది అతడిలా మన వల్ల కాదని ఊరుకుంటున్నారు.ఐతే టాలీవుడ్లో ఓ యంగ్ హీరో మాత్రం తన వంతుగా ఇలాంటి ప్రయత్నమే మొదలుపెట్టి అభాగ్యులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అతనేే.. నిఖిల్ సిద్దార్థ.కరోనా సెకండ్ వేవ్ ధాటికి జనాలు అల్లాడిపోతుండటం చూసి కొన్ని రోజుల కిందట తన టీంతో రంగంలోకి దిగాడు నిఖిల్. ట్విట్టర్లో తనకు కనిపించే, తనను ట్యాగ్ చేస్తూ పెట్టే రిక్వెస్ట్‌లను చూసి వాళ్లకు ఏదో రకంగా సాయం చేయడానికి నిఖిల్ ప్రయత్నిస్తున్నాడు. కొందరికి నేరుగా తన టీం ద్వారా సాయం అందిస్తున్నాడు. ఇంకొందరికి సాయం అందే మార్గం చూపిస్తున్నాడు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు వ్యక్తులతోనూ సమన్వయం చేసుకుంటూ కొవిడ్ బాధితులను ఆదుకోవడానికి నిఖిల్ సిన్సియర్‌గానే ప్రయత్నిస్తున్నాడు.

నిఖిల్ చొరవతో చాలామందికి అందాల్సిన సాయం అందుతోంది.బ్లాక్ ఫంగస్ ఎటాక్ అయి ప్రమాదకర స్థితికి చేరుకున్న ఓ బాధితుడికి విరాళాలు అందేలా చేయడంతో పాటు ఆరోగ్యాంధ్ర ద్వారా అతడికి వైద్య సాయం సమకూరేలా చేయడంలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడు. ఇలా మరింత మందికి సాయపడ్డాడు. సోనూ లాగా పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టి వందలు, వేల మందిని ఆదుకోవడం అందరి వల్లా కాదు కానీ.. మన వల్ల ఏమవుతుంది అనుకోకుండా కుదిరినంత మేర ఇలా సాయం చేయడానికి ప్రయత్నించడం గొప్ప విషయమే అని చెప్పాలి..!!

ఎన్95 మాస్కులు ఉతకొచ్చా? నిపుణులు ఏం అంటున్నారంటే?

దేశవ్యాప్తంగా కరోనా వ్యాధి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల నుంచి బయటకు రావడానికి మాస్క్ ఒకటే శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఎన్95 మాస్కులు ఎంతో సమర్థవంతంగా అడ్డుకుంటాయి.ఈ మాస్కులు ధరించడం వల్ల 95 శాతం వైరస్ నుంచి మనకు రక్షణ కలిగి ఉంటుంది. అయితే ఈ మాస్కులు ధరలు కూడా అధికంగా ఉండడంతో కొందరు ఈ మాస్క్ లను ఉతికి మరియు ఉపయోగిస్తుంటారు.

ఈ విధంగా ఎన్95 మాస్కులు ఒకసారి ఉపయోగించిన తర్వాత తిరిగి వాటిని వాడకూడదు. కొందరు సబ్బులు, షాంపూలు లేదా ఇతర మెడికల్ డిటర్జెంట్ లను ఉపయోగించి ఉతికి తిరిగి ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా ఉతకడం వల్ల మాస్క్ వైరస్ ను అడ్డుకొనే సామర్థ్యం తగ్గిపోతుంది. తద్వారా ఈ మాస్క్ వేసుకునప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు.

నిజానికి ఎన్95 మాస్కులు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. అలాంటిది కొందరు వీటిని ఉతికి ఉపయోగించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం, రక్షణ ఉండదు. ఎన్95 మాస్కులు లేని వారు మూడు పొరలు కలిగి ఉన్న సాధారణ సర్జికల్ మాస్క్ వాడినప్పటికీ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. గుడ్డ మాస్క్ కన్నా, సర్జికల్ మాస్క్ వైరస్ నుంచి మరింత ఎక్కువ రక్షణ కల్పిస్తుంది.

సర్జికల్ మాస్కు కూడా కేవలం ఒక రోజు మాత్రమే ఉపయోగించాలి. మరుసటి రోజుకు అదే మాస్క్ ఉపయోగించిన ఎలాంటి ఫలితం ఉండదు. సర్జికల్ మాస్క్ ను కూడా ఉతికి ఉపయోగించకూడదు. క్లాత్ మాస్క్ ను తరచూ ఉతికి ఉపయోగించుకోవచ్చనీ నిపుణులు తెలియజేస్తున్నారు.

కరోనాకు న్యూమరాలజీ లింక్.. స్పెల్లింగ్ మారిస్తే వైరస్ మాయామట!

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో రోజురోజుకు కేసులు అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం అధికారులు భద్రతా చర్యలు తీసుకోవడం, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, అదేవిధంగా కరోనా కట్టడి కోసం ఎన్నో ఔషధాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ వైరస్ మాత్రం అదుపు కాలేదు. మరికొందరు పాత పద్ధతి కి వెళ్లి కరోనా కట్టడి కోసం ఆయుర్వేద మందులను ఉపయోగిస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం జిల్లాలోని ఓ వ్యక్తి కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే కేవలం న్యూమరాలజీ ద్వారా మాత్రమే ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు అని చెప్పడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనాకు వ్యాక్సిన్ తో పనిలేకుండా, కేవలం స్పెల్లింగ్ మారిస్తే చాలు కరోనా వైరస్ ఈ ప్రపంచం వదిలిపోతుందని తెలిపారు. ప్రస్తుతం కరోనా స్పెల్లింగ్ CORONA కు బదులు CORONAA అని, కోవిడ్-19 స్పెల్లింగ్‌ను COVID-19కు బదులు COVVIYD-19గా మార్చాలని ఎస్వీ ఆనందరావు అనే వ్యక్తి అనంతపురంలో జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్లో స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఆయన తెలిపారు.

తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫ్లెక్సీ అనంతపురం లో ప్రత్యక్షం కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపై కరోనా స్పెల్లింగ్ పైన చెప్పిన విధంగా మార్చి రాస్తే కరోనా ఈ ప్రపంచం వదిలి పారిపోతుందని తెలియజేశారు. ఈయనకు సంబంధించిన ఫ్లెక్సీని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సినీ నటుడు నందు కూడా ఫోటోని షేర్ చేస్తూ మీరు నిజంగా జాతిరత్నం సార్ అంటూ కామెంట్ చేశారు.

ఈ పోస్టు చూసిన నెటిజన్లు ఇలాంటివారు ఉండబట్టే వైరస్ వ్యాప్తి ఈ విధంగా ఉందంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కరోనా కట్టడి చేయాలంటే స్పెల్లింగులు కాదు మార్చాల్సింది, మనుషులు మారాలి అందరూ భౌతిక దూరం పాటిస్తూ వాక్సిన్ తీసుకున్నప్పుడే ఈ వైరస్ ఈ ప్రపంచం నుంచి దూరమవుతుందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ లక్షణాలు ఇవే..!

దేశవ్యాప్తంగా గత సంవత్సర కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపించడంతో ప్రజలు ఎంతో భయాందోళన చెందారు. అయితే మొదటి దశలో కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ రెండవ దశలో మాత్రం మరణాల సంఖ్య అధికంగా పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. అయితే మొదటి దశలో కరోనా లక్షణాలు సాధారణంగా జలుబు, దగ్గు, రుచి తెలియకపోవటం, వాసన గుర్తించకపోవడం, నీరసం, అలసట వంటి లక్షణాలు ఉండేవి.

కరోనా రెండవ దశ తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కొందరిలో ఈ లక్షణాలు అధికంగా ఉన్నాయి. మరి కొందరిలో ఈ లక్షణాలు కనిపించక పోయినప్పటికీ కరోనా బారిన పడుతున్నారు.అయితే రెండవ దశలో కరోనా లక్షణాలు మొదటి దశ లక్షణాలతో పాటు మరికొన్ని కొత్త లక్షణాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ కొత్త లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం…

కరోనా రెండవ దశలోని లక్షణాలలో మొదటగా శ్వాస తీసుకోవడం ఎంతో ఇబ్బందికరంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.చాలా మంది కరోనా బారిన పడిన వారిలో ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపించాయని నిపుణులు గుర్తించారు. అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. దీని కారణంగా వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలకు  తలెత్తుతున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.

అదే విధంగా కొంతమందిలో వినబడక పోవడం వంటి లక్షణాలు కూడా తలెత్తుతున్నాయి. కరోనా వైరస్ సోకిన కేవలం వారం లోపలే కొందరిలో ఈ విధమైనటువంటి సమస్య తలెత్తుతుంది. ఈ వైరస్ బారిన పడిన వారిలో రోగ నిరోధక శక్తి కోల్పోవటం వల్ల నీరసం అవుతున్నారు. అదేవిధంగా కళ్ళు ఎర్రగా ఉండటం, నోరు ఆరిపోవడం, డయేరియా, తలనొప్పి, చర్మ సమస్యలు వంటి లక్షణాలు కూడా రెండవ దశలో కనిపిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.

‘నాకు నచ్చినట్లు ఉంటా. నచ్చిందే చేస్తా’.. శ్రుతిహాసన్ బోల్డ్ కామెంట్స్..!!

టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. ఈ అమ్మడు సినిమాల పరంగానే కాదు వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా బోల్డ్ గా వ్యవహరిస్తోంది.. అంతేకాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. సెట్ లో ఎవరైనా తన వైపు వల్గారిటీతో చూస్తే.. వెంటనే అతని దగ్గరకి వెళ్లి పరువు తీసేవరకూ నిద్ర పోదు. ఈ మధ్య శ్రుతి హాసన్ సినిమా సెట్స్ లో ఇలాంటివి సర్వసాధారణం అయిపోతున్నాయట.

అయితే కరోనా సెకెండ్ వేవ్ లతో షూటింగ్స్ కి బ్రేక్ వచ్చింది కాబట్టి..ఖాళీగా కూర్చోకుండా మొన్న ఫోటోషూట్ లు చేసింది.ఆ ఫోటోషూట్లు ఏమో జనాలని భయపెట్టేలా దరిద్రంగా ఉండటంతో నెటిజన్లు ఆమె పై విరుచుకుపడుతున్నారు. దానికితోడు శ్రుతి హాసన్ వికృతి స్టిల్స్ పై మీడియాలో కూడా బ్యాడ్ గా వార్తలు వచ్చాయి. నెటిజన్లు బ్యాడ్ కామెంట్స్, మీడియా విమర్శలు అన్నిటినీ తీరిగ్గా చూసుకున్న శ్రుతిహాసన్ మొత్తానికి తనదైన శైలిలో స్పందిస్తూ రెచ్చిపోయింది.

శ్రుతి హాసన్ మాటల్లోనే.. ‘మనం వేసుకునే డ్రెస్, కాలాన్ని బట్టి అదేవిధంగా ఫ్యాషన్ బట్టి మారుతుంటాయి. నేను ఎప్పుడు ఫ్యాషన్ కి చాల ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక ఇప్పుడు చాలా విచిత్రంగా అనిపించే ఫ్యాషనే.. కొన్ని సంవత్సరాల తరువాత చాల రెగ్యులర్ గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనకు నచ్చింది చెయ్యాలి, నాకు నచ్చినట్లు ఉంటా. నాకు నచ్చిందే చేస్తా. మీరు కూడా మీకు ఎలా సంతోషం కలుగుతుందో అలా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చింది.

ఏది ఏమైనా శృతి హాసన్ అంటేనే మల్టీ టాలెంటెడ్. ఇక హీరోయిన్ గా కూడా శృతి ఈ మధ్య ఉన్నట్టుండి గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేస్తూ పోవడానికి కారణం సరైన ఛాన్స్ లు అమ్మడికి రావడం లేదట. అయితే విచిత్రంగా వయసు పెరిగేకొద్దీ ఎక్స్ పోజింగ్ కూడా పెంచుకుంటూ పోవడమే ఈ సీనియర్ బ్యూటీ పై బ్యాడ్ కామెంట్స్ కి కారణమవుతుంది. ప్రస్తుతం, శృతి హాసన్ ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో నటిస్తోంది…!!

‘కోవిడ్ మీల్స్ ఫర్ ఇండియా’ ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి..

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంతో దారుణంగా మారింది. ఎంతో మంది సామాన్య ప్రజలు ఈ వైరస్ బారి నుండి తమల్ని తాము రక్షించుకోలేకపోతున్నారు. ఇక సరైన వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ లు లేక ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితి చాలా భయాందోళన గా మారింది.

ఇక పలు దేశాలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక సెలబ్రెటీలు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇక తాజాగా కరోనా బాధితులకు మరో సదుపాయం కల్పించారు. వారికి కావాల్సిన ఫుడ్ అందించడానికి కోవిడ్ మీల్స్ ఫర్ ఇండియా అనే వెబ్ సైట్ తో ఫుడ్ అందించడానికి ముందుకు వచ్చారు. అది కూడా ఇంటి నుండే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.

ఇక ఆ వెబ్ సైట్ ను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ముందుగా covidmealsforindia.com అనే లింకును ఓపెన్ చేసి ఆ తర్వాత స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సిటీ ఆప్షనల్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫైండ్ ఫుడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక అందులో మనకు దగ్గరలో ఉన్న కోవిడ్ ఫుడ్ సెలక్ట్ ను వాట్స్ అప్ తో కనెక్ట్ చేయాలి. ఇక హోమ్ చెఫ్ కోసం సర్వీస్ ప్రొవైడర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటిపి డిజిట్స్ ని ఎంటర్ చేయాలి. ఇక తర్వాత బిజినెస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కోవిడ్ డైట్ ఫుడ్ కోసం అవును అయితే అవును లేదా కాదు అయితే కాదు అని ఎంటర్ చేయాలి. ఇక ఫుడ్ డెలివరీ లో మీ రిజిస్ట్రేషన్ ఓకే అవుతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

2025 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్న ఐటీ కంపెనీలు!

కరోనా వైరస్ మన దేశంలో వ్యాపించడంతో అన్ని రంగాలకు చెందిన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించడంతో సిటీలలో ఉండే చాలా మంది ఉద్యోగులు వారి స్వస్థలాలకు చేరుకున్నారు.వీరిలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ కి చేరుకోవడంతో ఇది ఏపీకి ఎంతో అనుకూలమైన సమయం అని నిపుణులు భావిస్తున్నారు.

ప్రముఖ ఐటీ కంపెనీలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కంపెనీలు డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కల్పించింది. అయితే దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవుతుందని తెలియడంతో వంద శాతం ఉద్యోగులను కంపెనీలకు రమ్మని చెప్పడానికి అన్ని కంపెనీలు సాహసించడం లేదు. అందుకోసమే అన్ని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు 2021 మార్చి 31 వరకు వర్క్ ఫ్రొం హోమ్ వేసులబాటు కల్పించాలని నిర్ణయించారు.

ఇప్పటికే దాదాపు 98 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ కంపెనీలలో పనిచేసే 9 లక్షల మంది ఉద్యోగులలో దాదాపు8.75 లక్షల మంది ఇంటి నుంచి తమ విధులను నిర్వహిస్తున్నారు. అయితే
టీసీఎస్‌ మరో అడుగు ముందుకేసి ఈ వర్క్ ఫ్రమ్ హోం ను 2025 వరకు అమలు చేయాలని నిర్ణయించింది. అయితే కరోనా ప్రభావం తగ్గినా కూడా కేవలం 25 మంది ఉద్యోగులతో ఆఫీసుకు వచ్చి విధులు నిర్వర్తించాలని సూచించింది.

పెద్ద పెద్ద నగరాలలో ప్రముఖ కంపెనీలు వారి ఆఫీసులను అద్దె భవనాలు తీసుకొని నిర్వర్తిస్తున్నారు. అయితే వర్క్ ఫ్రం హోం నిర్వహించడంతో వారికి ఈ భారం తగ్గుతుండటంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కే మొగ్గు చూపుతున్నాయి.ఇతర రాష్ట్రాలలో పని చేస్తున్న ఐటి ఉద్యోగులు ఎక్కువ శాతం మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారు కావడంతో, రాష్ట్రంలోని చిన్న పల్లెలు కూడా ఐటీ, ఇతర సేవా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయని, వర్క్ ఫ్రం హోం ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అనుకూలమని చెప్పవచ్చు.