Tag Archives: credit card

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. డబ్బులను టైంకి చెల్లించడం లేదా.. అయితే ఇది మీకోసమే..!

Credit Card: క్రెడిట్ కార్డులు అవసరానికి డబ్బులు లేకపోతే.. ఆ అవసరాన్ని తీర్చడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా.. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ.. మరేదైనా పెద్ద వస్తువుల తీసుకున్నప్పుడు ఈఎంఐ రూపంలో వాటికి డబ్బులు చెల్లించడానికి కూడా ఉపయోగపడుతాయి. అయితే క్రెడిట్ కార్డు అనేది బ్యాంకులు అందరికీ ఇవ్వవు.

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. డబ్బులను టైంకి చెల్లించడం లేదా.. అయితే ఇది మీకోసమే..!

సెలెక్టెడ్ పర్సన్స్ కు మాత్రమే ఇస్తుంది. అతడి ఉద్యోగం ..హోదా చూసి ఇచ్చేస్తాయి బ్యాంకులు. అయితే డెబిట్ కార్డులు మాత్రం అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇస్తుంటాయి. ఇక క్రెడిట్ కార్డులో డబ్బులను వాడుకున్న తర్వాత దాదాపు 45 రోజుల వరకు ఎలాంటి రుసుము వసూలు చేయకుండా.. ఆ డబ్బులను చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. డబ్బులను టైంకి చెల్లించడం లేదా.. అయితే ఇది మీకోసమే..!

క్రెడిట్ కార్డు బిల్లు జనరేట్ అయిన తర్వాత దానిలో సూచించిన డేట్ లోగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంతమందికి ఆ డబ్బులు చెల్లించకపోవడంతో.. వచ్చే నెలలో మొత్తం ఒక్కసారే కట్టేయొచ్చు అనుకుంటారు. కానీ అలా చేస్తే తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే.. క్రెడిట్ కార్డు వాడే వారికి క్రెడిట్ స్టోర్ అనేది చాలా ఉపయోగం పడుతుంది. క్రెడిట్‌ స్కోర్‌ అనేది రుణగ్రహిత క్రెడిట్‌ విలువను సూచిస్తుంది. మనం చెల్లించే వాయిదా డబ్బులను సరిగ్గా చెల్లిస్తుంటే ఆ స్కోర్ అనేది పెరుగుతుంది. ఎక్కువ స్కోర్ ఉంటే.. భవిష్యత్తులో తక్కువ రేట్లతో రుణం పొందే అవకాశం ఉంటుంది.

రుణాలు ఇస్తాయి కానీ.. ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తారు:

క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మాత్రం..బ్యాంకులు రుణాలు ఇస్తాయి కానీ.. తక్కువ మొత్తంలో ఇస్తూ.. ఎక్కువ మొత్తంలో వడ్డీని వసూలు చేస్తారు. కొన్ని బ్యాంకులు అయితే రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోవచ్చు. ఇలా క్రెడిట్‌ స్కోర్‌ను బట్టి ఆయా బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అందుకే క్రెడిట్ కార్డు వాడే వారు తమ కోసం వాడుకుంటూ.. ఇతరులకు హామీగా నిలబడకుండా.. టైంకి చెల్లిస్తే.. ఎటువంటి నష్టం ఉండదు. టైం దాటిపోయిందంటే.. వడ్డీలతో పాటు.. ఆ ఎఫెక్ట్ క్రెడిట్ స్కోర్ పై కూడా పడుతుంది.

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. బిల్లు కట్టకపోతే కలిగే నష్టాలివే..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగాలు చేసేవాళ్లు, వ్యాపారులు, ఉన్నత చదువులు చదివే విద్యార్థులు క్రెడిట్ కార్డులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డును వినియోగించే వాళ్లు సరైన సమయంలో బిల్లు చెల్లిస్తే మంచిది. ఏదైనా కారణాల వల్ల సరైన సమయంలో బిల్లు చెల్లించడం సాధ్యం కాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

క్రెడిట్ కార్డుల వల్ల డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు, ఇన్‌స్టంట్ క్రెడిట్, నో కాస్ట్ ఈఎంఐ, రివార్డ్ పాయింట్లు లాంటి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. క్రెడిట్ కార్డ్ ను ఏ విధంగా వినియోగించుకున్నా బిల్లు సక్రమంగా చెల్లించేలా చూసుకోవాలి. లేకపోతే క్రెడిట్ స్కోర్ పై ఆ ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటే భవిష్యత్తులో రుణాలను పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని సందర్భాల్లో అన్ని అర్హతలు ఉన్నా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందనే కారణంతో బ్యాంకులు రుణాలను మంజూరు చేయవు. బ్యాంకులు ఆలస్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లించే వాళ్ల నుంచి ఆలస్య రుసుమును వసూలు చేస్తుండటంతో క్రెడిట్ కార్డ్ బిల్లు లేట్ గా చెల్లిస్తే నగదు భారం పడే అవకాశం ఉంది. ఆలస్యంగా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే అధిక వడ్డీ భారం కూడా పడుతుంది.

సరిగ్గా బిల్లులు చెల్లించకపోతే సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. బిల్లు చెల్లించకపోవడం వల్ల కార్డు బ్లాక్ అయితే క్రెడిట్ స్కోర్‌ మరింత తగ్గే అవకాశం ఉంటుంది. సరిగ్గా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించని వాళ్లకు రివార్డు పాయింట్లు కూడా తగ్గుతాయి. అందువల్ల క్రెడిట్ కార్డ్ తీసుకుంటే సక్రమంగా బిల్లులు చెల్లిస్తే ఈ సమస్యల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

ఫ్రీగా 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్.. ఎలా పొందాలంటే..?

రోజులు మారుతున్నాయి. ప్రస్తుత కాలంలో మనిషికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అత్యవసర సమయల్లో ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఉంటాం. ప్రతి నెలా ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ రంగంతో పోల్చి చూస్తే ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలలో ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.

అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్నింటి ద్వారా ఉచితంగా ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లో భాగంగా ఈ ఇన్సూరెన్స్ ను పొందవచ్చు. వీటితో పాటు బ్యాంకు ఖాతాలు ఉన్నవాళ్లకు కూడా ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఖాతాగా కలిగి ఉండి క్రెడిట్ లేడా డెబిట్ కార్డ్ ఉండే ఇన్సూరెన్స్ ను పొందవచ్చు.

క్రెడిట్ కార్డు కంపెనీలు రెగ్యులర్ గా క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించే కస్టమర్లకు 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ను అందిస్తాయి. అయితే బ్యాంకును బ్యాంకును బట్టి నియమనిబంధనల్లో మార్పులు ఉంటాయి. బ్యాంక్ డెబిట్ కార్డుల ద్వారా కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే వినియోగించే డెబిట్ కార్డును బట్టి ఇన్సూరెన్స్ లో మార్పులు ఉంటాయని సమాచారం.

అయితే ఈ ఇన్సూరెన్స్ ల గురించి తెలుసుకోవాలంటే బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ కొన్ని రీఛార్జ్ ప్లాన్లపై ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోంది. అయితే రీఛార్జ్ చేసుకున్న సమయంలో మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈపీఎఫ్‌వో సైతం ఖాతాదారులకు ఫ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తుండగా ఈ ఇన్సూరెన్స్ లపై అవగాహన ఉంటే వీటి ద్వారా ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది.

డెబిట్ కార్డ్ సైజులో ఆధార్.. ఎలా పొందాలంటే..!!

ఈరోజుల్లో మనం ఎలాంటి ప్రభుత్వ పథకానికి అర్హత పొందాలన్నా, స్కాలర్ షిప్ పొందాలన్నా, గుర్తింపు కార్డుగా కూడా ఆధార్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డ్ లేని వాళ్లు పడే అవస్థలు అన్నీఇన్నీ కాదు. ఆధార్ కార్డ్ దేశంలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది. అయితే ప్రజలు ఆధార్ ను చిన్న సైజులో అందుబాటులోకి తెస్తే బాగుంటుందని పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. దీంతో కేంద్రం చిన్న సైజులో ఆధార్ కార్డులు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధమైంది.

ఎవరైతే ఎక్కువగా ప్రయాణాలు చేస్తారో, ఆధార్ కార్డుతో ఎక్కువగా ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఈ చిన్నసైజు కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్డును పర్సులో సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. పాలి వినైల్ క్లోరైడ్ తో తయారు చేసిన కార్డు కావడంతో ఈ కార్డు క్వాలిటీతో ఉంటుంది. ఆధార్ వెబ్ సైట్ లోకి వెళ్లడం ద్వారా దరఖాస్తు చేసిన రోజు నుంచి పది రోజుల్లో ఈ కార్డును పొందవచ్చు.

దరఖాస్తు చేసిన రోజు నుంచి పది రోజుల్లో పాలి వినైల్ క్లోరైడ్ తో తయారు చేసిన ఆధార్ కార్డు ఇంటికి చేరుతుంది. కార్డ్ పొందాలంటే మొదట https://uidai.gov.in/ గెట్ ఆధార్ అనే విభాగంలోకి వెళ్లాలి. అందులో order aadhaar pvc card అనే ఆప్షన్ ను ఎంచుకుని ఆధార్ కార్డ్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ లేదా ఎన్ రోల్ మెంట్ ఐడీని ఎంటర్ చేయాలి. ఆ తరువాత సెక్యూరిటీ కోడ్, మొబైల్ నంబర్, వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.

అందులో వివరాలను చెక్ చేసుకొని ఉన్న ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకుని కార్డుకు 50 రూపాయలు పే చేయాలి. అమౌంట్ పే చేసిన తరువాత వచ్చే రిసిప్ట్ లో ఎస్.ఆర్.ఎన్ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ సహాయంతో దరఖాస్తు చేసిన ఆధార్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ విధంగా చిన్న సైజ్ ఆధార్ కార్డ్ ను సులభంగా పొందవచ్చు.

ఈ నెలలో మారిన కొత్త రూల్స్ ఇవే!

ఈ నెల అక్టోబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త అంశాలను, కొత్త రూల్స్ ను అమలులోకి తెచ్చింది. మారిన ఈ రూల్స్ మనలో చాలా మంది మీద ఆ ప్రభావం పడుతుంది. అయితే ఎటువంటి అంశాలను తెచ్చారు, ఎలాంటి రూల్స్ మార్పులు చేసుకున్నాయి అన్న విషయాలను మనం తెలుసుకుందాం.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేసుకున్న వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఐఆర్డిఎఐలో ఇప్పటికే ఉన్న పాలసీదారులకు, లేదా కొత్తగా తీసుకున్న పాలసీదారులకు దాదాపు అన్ని రకాల వ్యాధులకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది.

పండగ సీజన్లో టీవీ కొనుగోలు చేసే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీగా దెబ్బ కొట్టింది. కష్టమ్ డ్యూటీ మినహాయింపు తొలగించి టీవీ ధరలను అమాంతం పెంచడంతోపాటు, ఓపెన్ సేల్స్ పై 5శాతం పన్ను భారం తిరిగి వినియోగదారులపై పడుతుంది.

అక్టోబర్ 1 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులపై కొన్ని రకాల సేవలు అందుబాటులో లేకుండా రద్దు చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ లావాదేవీలు ఆగిపోవచ్చు.

అక్టోబర్ 1 నుంచి ఈ కామర్స్ కంపెనీలకు ఆదాయపు పన్నుశాఖ కొత్త రూల్స్ ని తెచ్చింది. ఈ కంపెనీలు ఇచ్చే ప్రొడక్ట్స్ పై 1% టీసీఎస్ ను వసూల్ చేయాలి.

ఎక్కువగా స్వీట్స్ ఇష్టపడి తినేవారికి ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. వారు తయారు చేసిన ప్రతి స్వీట్ పైన ఎక్సపైర్ డేట్ కచ్చితంగా ఉండి, ఆ స్వీట్ ఎవరు తయారు చేసారో వారి వివరాలు తప్పకుండా నమోదు చేయాలి.

వాహనదారులకు కూడా ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్పుడు మన బండిలో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ వంటి వాటిని మనతో పాటు తీసుకొని వెళ్లే అవసరం లేకుండా.. ఇప్పుడు ఆ వివరాలను ప్రభుత్వ వెబ్ పోర్ట్ లో పెట్టి అధికారులకు చూపిస్తే చాలు.

రూట్ నావిగేషన్ కోసం డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మన పర్సనల్ ఫోన్ కాల్ మాట్లాడుతూ దొరికితే కచ్చితంగా జరిమానా కట్టాల్సిందే.

లాక్ డౌన్ నేపథ్యంలో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ లు ఇచ్చారు. అయితే ఈ బెనెఫిట్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉండదు.

అక్టోబర్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక సంవత్సరానికి 7 లక్షలుపైన డబ్బుని విదేశాలకు పంపితే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. అంతేకాకుండా 5% విద్యార్థులకు టీసీఎస్ పన్నులో రాయితీ లభిస్తుంది.