Tag Archives: Depression

Rajeev Kanakala: మూడు నెలలు బెడ్ పైనే… మాట రాక కన్నీళ్లు కార్చేది… చెల్లెల్ని తలుచుకొని ఎమోషనల్ అయినా రాజీవ్!

Rajeev Kanakala: రాజీవ్ కనకాల పరిచయం అవసరం లేని పేరు.నటుడిగా యాంకర్ సుమ భర్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈయన నటించే సినిమాలలో తన పాత్ర సినిమాని కీలక మలుపు తిప్పే పాత్రలలో నటిస్తూ ఉంటారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రాజీవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తన చెల్లెలు శ్రీలక్ష్మి నీ తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం తనకు అమ్మానాన్న చెల్లి వీరెవరూ లేరని అందరూ మరణించడంతో ఒక్కసారిగా తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు..తన చెల్లెలు శ్రీ లక్ష్మీ ఎన్నో టీవీ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించింది అయితే ఆమె సంతోషంగా ఉంది అనుకున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడ్డారని తెలిపారు.

క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని అంతా బాగుంది తాను దాదాపు కోలుకుందని అందరం భావించాము తన క్షేమం కోసం పూజలు హోమాలు చేశాము. 85% తనకు క్యాన్సర్ నయమైంది.ఇక ఎలాంటి సమస్య లేదు అనుకున్న తరుణంలో మరోసారి తన ఆరోగ్యం క్షీణించింది. అదే సమయంలోనే పచ్చకామెర్లు కూడా వచ్చాయి కీమో ఇప్పించాలి అన్న కూడా కామెర్లు తగ్గాలని చెప్పారు. ఇక అదే సమయంలో లాక్ డౌన్ కూడా ఉండటంతో తప్పనిసరి పరిస్థితులలో తనని ఇంట్లోనే పెట్టుకున్నామని తెలిపారు..

ఇలా తన చివరి రోజులలో కుటుంబం అంతా కూడా ఒకే చోటే ఉండే వాళ్ళమని రాజీవ్ తెలిపారు.ఆ చెల్లెలు మూడు నెలల పాటు బెడ్ పై కదల లేని స్థితిలో ఉంది నోట వెంట మాటరాదు తనకు స్పృహ వచ్చినప్పుడు అందరిని చూస్తూ కన్నీళ్లు మాత్రమే కార్చేది. తాను నిద్రపోతున్నప్పుడు ఆ బాధను భరిస్తూ మూలుగుతూ ఉండేది.ఇలా మూలుగుతున్నప్పుడు మేము తాను ఇంకా బ్రతికే ఉంది అని అనుకునే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా తన చెల్లెలు చివరి రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Rajeev Kanakala: సుమ అమ్మలేని లోటు తీరుస్తుంది…


ఈ విధంగా శ్రీలక్ష్మి ఎంతో బాధను అనుభవించి మరణించిందని రాజీవ్ కనకాల తెలియజేశారు. అయితే తన ఇద్దరు మేనకోడళ్ళు చాలా స్ట్రాంగ్ అని ఈయన తెలిపారు. శ్రీలక్ష్మి మరణించిన తర్వాత సుమ నాకు నలుగురు పిల్లలు అంటూ ఆ ఇద్దరి బాధ్యత కూడా తానే తీసుకొని వారికి అమ్మలేని లోటును తీరుస్తుంది అంటూ ఈ సందర్భంగా రాజీవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Uday Kiran: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు అలాంటి కల వచ్చిందా… అచ్చం అలాగే చనిపోయారా?

Uday Kiran: ఉదయ్ కిరణ్ ఈ పేరు వింటే ఇప్పటికి ఎంతోమంది అభిమానుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.ఇండస్ట్రీలో ఎంతో గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో మంచి జీవితం ఉన్నటువంటి ఈయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఈ విధంగా ఉదయ్ కిరణ్ మరణించడంతో ఈయన మరణం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

ఈయనకు సినిమా అవకాశాలు లేకపోవడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి.అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఉదయ్ కిరణ్ చివరికి ఆత్మహత్య శరణ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.ఈయన మరణం గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నటుడు ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందు సరిగ్గా వారం రోజుల క్రిందట ఒక కల వచ్చిందట అందులో భాగంగా తన భార్య ఇంట్లో లేని సమయంలో ఈయన స్వయంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే కల వచ్చిందట ఇదే విషయాన్ని తన భార్యకు చెప్పగా ఆమె మీరు డిప్రెషన్ లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు ఇలాంటి ఆలోచనలన్నీ పక్కనపెట్టి ముందు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయమని చెప్పారట.

Uday Kiran: ఆత్మహత్య చేసుకున్నట్టు కల…


అయితే ఉదయ్ కిరణ్ మాత్రం అదే ఆలోచనలలో ఉంటూ సరిగ్గా ఈ కల వచ్చిన వారం రోజులకు ఆ కలనీ అమలు పరిచారని తెలుస్తోంది. తన భార్య ఇంట్లో లేని సమయంలో ఈయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారంటూ ప్రస్తుతం ఉదయ్ కిరణ్ కి సంబంధించి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Siva Balaji: వ్యాపారాలలో నష్టాలు…. ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను… నటుడు శివ బాలాజీ కామెంట్స్ వైరల్!

Siva Balaji: నటుడు శివ బాలాజీ పరిచయం అవసరం లేని పేరు. ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి శివ బాలాజీ అనంతరం చందమామ, ఆర్య, అన్నవరం టెన్త్ క్లాస్ డైరీ శంభో శివ శంభో వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.అయితే ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ వ్యాపార రంగంలోనే ఉండేవారు.

అయితే ప్రస్తుతం ఈయన సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శివ బాలాజీ తన కెరియర్లో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేశారు. తాను సినిమాలలోకి రాకముందు ఈము పక్షుల పెంపకం గురించి తెలుసుకున్నాను.ఈ పెంపకం చేపడితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సబ్సిడీ కూడా వస్తుందని తెలియడంతో దాదాపు తాను 500 ల ఈము పక్షులను పెంచానని, వీటి కోసం నెలకు 5 లక్షల వరకు ఖర్చు చేసే వాడిని తెలిపారు.

ఇలా ఈము పక్షుల పెంపకం కోసం భారీగా ఖర్చు చేశాను అయితే ఆ పక్షులకు పెద్దగా మార్కెట్ లేదని ఇదంతా ఫేక్ అని తెలియడంతో చాలా నష్టపోయానని శివబాలాజీ తెలిపారు.దీన్ని తర్వాత సోప్స్ ఆయిల్స్ షాంపుస్ వంటి ఎన్నో రకాల బిజినెస్ లు చేశాను ఇవన్నీ కూడా నష్టం తీసుకొచ్చాయి.ఆ తర్వాత స్నేహమేరా జీవితం అనే సినిమాలో నటించాను. ఈ సినిమా వల్ల సుమారు రెండు కోట్ల నష్టం వచ్చింది.

Siva Balaji: మధుమిత వల్ల మామూలు స్థితికి వచ్చాను…

ఈ విధంగా వ్యాపారాలలోను సినిమాలలోను నష్టాలు రావడంతో ఇంట్లో వారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని అయితే తన వల్ల ఇంతమంది బాధపడుతున్నారన్న ఆలోచన వల్ల తాను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని శివబాలాజీ తెలిపారు అయితే అదే సమయంలోనే మధుమిత వల్ల తాను తిరిగి మామూలు స్థితికి వచ్చానని ఈ సందర్భంగా శివ బాలాజీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Junior NTR: కెరీర్ డౌన్ అవుతున్న సమయంలోలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా..! ఎన్టీఆర్ భావోద్వేగం..!

Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చాలామంది తారక్ అని కూడా పిలుస్తారు. అతను స్టార్‌డమ్‌కి ఎదిగిన తర్వాత.. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అప్పుడు తన కెరీర్ మళ్లీ మొదటికి రావడంతో భయపడ్డానని.. నటుడిగా తాను అయోమయంలో పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తాను ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాత తన ‘బౌన్సింగ్ బోర్డ్’ లాగా ఎస్‌ఎస్ రాజమౌళి నిలబడ్డాడని.. అతడికి కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..

Junior NTR: కెరీర్ డౌన్ అవుతున్న సమయంలోలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా..! ఎన్టీఆర్ భావోద్వేగం..!

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా SS రాజమౌళితో కలిసి తన దర్శకత్వంలో తొలి స్టూడెంట్ నంబర్ 1 (2001)లో పనిచేశాడు. అతను దర్శకత్వంలోనే మరో రెండు సినిమాలు- సింహాద్రి (2003) మరియు యమదొంగ (2007)లో కూడా నటించాడు. వీరిద్దరూ తమ రాబోయే ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ కోసం జతకట్టారు. ఆర్జే సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ప్రారంభ సంవత్సరాలను గుర్తుచేసుకున్నాడు. తాను 17 సంవత్సరాల వయస్సులో కెరీర్ ను ప్రారంభించానని.. 18 సంవత్సరాల వయస్సులో రాజమౌళి తెరకెక్కించిన విజయవంతమైన చిత్రం స్టూడెంట్ నంబర్ 1లో నటించానని చెప్పాడు.

Junior NTR: ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా..! ఎన్టీఆర్ భావోద్వేగం..!

తర్వాత తన కెరీర్ సింహాద్రి చిత్రం వరకు దూసుకుపోయిందని అన్నాడు. దీని తర్వాతనే వర్కవుట్ కాని సినిమాలు ఎదురయ్యాయని.. తాను నిరాశకు గురయ్యానని.. డిప్రెషన్ లోకి కూడా వెళ్లాను అని చెప్పాడు. నటుడిగా నాకు నేనే కన్ఫ్యూజ్ అయ్యా అని ఎన్టీఆర్ తెలిపాడు. ఆ సమయంలో “నేను ఏమి చేయాలో నాకు తెలియదు.. ఎందుకంటే అప్పుడే తన కెరీర్ ప్రారంభం కాలేదు.. కొత్తగా ఏం చేయాలన్నా భయపడే వాడిని అంటూ చెప్పాడు.

ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న విడుదల..

ఇటువంటి టైంలోనే మళ్లీ రాజమౌళి.. బౌన్స్ బోర్డ్‌గా ఉన్నాడన్నారు. రాజమౌళి సాయంతో నటుడిగా నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకోవడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి నా కెరీర్ కూడా మారింది. నా విజయాల పట్ల నాకు సంతృప్తి లేదు. కానీ ఈరోజు నేను ఒక నటుడిగా సంతృప్తితో ఉన్నా అని ఎన్టీఆర్ తెలిపారు. రాజమౌళి సహాయంతోనే తాను ఆత్మపరిశీలన చేసుకున్నానని.. అప్పటి నుంచే తన కెరీర్ మారిపోయిందన్నారు. నేను నా కంఫర్ట్ జోన్‌ను వదిలి నటుడిగా కొత్త ప్రదేశాలను అన్వేషించడం ప్రారంభించానన్నారు. ఇక ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను అంటూ భావోద్వేగపూరితంగా మాట్లాడారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న RRR సినిమా హిందీ, తమిళం, మలయాళం , కన్నడ భాషల్లో విడుదల కానుంది.

తిరుపతి పై వరుణుడి ప్రతాపం.. జల సందిగ్ధంలో తిరుపతి వాసులు..!

తిరుమల తిరుపతి పై వరుణుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత మూడు రోజుల నుంచి కుండపోతగా వర్షం కురవడంతో తిరుపతి జల సందిగ్ధంలో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఈ తిరుపతిని నువ్వే కాపాడాలి శ్రీనివాస అంటూ స్వామివారిని వేడుకుంటున్నారు. ఇక తిరుమల గిరులపై అధిక వర్షపాతం నమోదు కావడం చేత తిరుపతి నగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

కనుచూపుమేరా వరద నీరు పొంగిపొర్లడంతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు.ఈ క్రమంలోనే వరద ఉధృతికి ఎన్నో వాహనాలు కొట్టుకుపోగా మనుషులు పశువులు కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు వదులుతున్నారు. ఇక అధిక మొత్తంలో నీరు ఇళ్లలోకి చేరడం వల్ల ఇంటిలోని సామాన్లు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.

ఎత్తయిన చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి తిరుపతి మొత్తం చీకటిలో ఉండిపోయింది. ఈ విధమైనటువంటి దుర్భర పరిస్థితి నుంచి తిరుపతి నువ్వే కాపాడాలి స్వామి అంటూ ప్రజలు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఇలా తిరుపతిని వరద ముంచెత్తడంతో ప్రజలు కొంతమేర భయాందోళనకు గురవుతున్నారు.

ఎప్పుడో 1996 సంవత్సరంలో ఈ విధమైనటువంటి వార్తలు వచ్చాయని ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి వరద రాలేదని అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు. ఇక తిరుమల కొండలలో వరద నీరు జలపాతాలను పోలి ఉన్నప్పటికీ అధిక వర్షపాతం నమోదు కారణంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి.దీంతో భక్తులు ఎవరూ కూడా తిరుమలకు రాకూడదని ఆలయ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఆ బాధ నుంచి బయట పడటం కోసమే సమంత ఇలా చేస్తోందా…ఆ పోస్ట్స్ అర్థం అదేనా..!

అక్కినేని సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈమె తెలుగింటి కోడలుగా అడుగుపెట్టి మరింత గుర్తింపు సంపాదించుకున్నారు. అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే గత కొంత కాలం నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయనీ, త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.

అయితే వీరిద్దరి గురించి వస్తున్న వార్తలపై ఇటు అక్కినేని కుటుంబం కానీ లేదా సమంత గాని స్పందించకపోవడంతో అభిమానులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. సమంత ఈ మధ్యనే శాకుంతలం సినిమాను పూర్తి చేసుకుని ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ లో ఉన్నారు. అదేవిధంగా నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. కానీ వీరిద్దరూ విడాకులు విషయంపై ఏమాత్రం స్పందించలేదు.

ప్రస్తుతం ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ లో ఉన్న సమంత నిత్యం సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే ఎక్కువగా సమంత తన పెట్ డాగ్స్ తో ఎంతో సరదాగా గడుపుతోంది. ఈ క్రమంలోనే డాగ్స్ తో ఆమెసరదా సన్నివేశాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన బాధను ఒంటరితనాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సమంత ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేశారు. అందులో సమంత డాగ్ పర్సన్ అనే కొటేషన్ ఉన్న టీ షర్ట్ ధరించారు. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. ఒక వేళ మీరు గమనించకపోతే.. అనే క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆలోచనలో పడేసింది. అసలు ఈ ఫోటోలో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటి అంటూ నెటిజన్లు పెద్దఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యతో బాధపడుతున్నారా… గోధుమ పిండి రోటీలు అస్సలు తినకూడదు!

సాధారణంగా చాలా మంది వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. శరీర బరువు తగ్గాలనుకొనే వారు వివిధ రకాల డైట్ ఫాలో అవుతూ… మంచి జీవనశైలిలో ఉండటానికి ఒక ప్రణాళికాబద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలని భావిస్తారు. ఈ క్రమంలోనే చాలామంది రాత్రి పూట భోజనానికి బదులుగా గోధుమ పిండితో తయారు చేసిన రోటిలను తింటూ ఉంటారు. అయితే ఈ విధమైనటువంటి డైట్ ఫాలో అయ్యేవారు గ్లూటెన్ సెన్సిటివిటీతో బాధపడుతుంటే అలాంటి వారు వారి ఆహార విషయంలో గోధుమ పిండితో చేసిన రోటీలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గ్లూటెన్ సెన్సిటివిటీతో బాధపడేవారు వారు తీసుకునే ఆహారంలో గ్లూటెన్ ఉందో లేదో తెలుసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్లూటెన్ ఉన్న పదార్థాలను తీసుకోవడం వల్ల డయేరియా, కడుపులో నొప్పి, మైగ్రేషన్ అలసట, డిప్రెషన్ వంటి లక్షణాలు ఉంటాయి. కనుక మనం తినే పదార్థాల్లో గ్లూటెన్ ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

మన శరీరంలో గ్లూటెన్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే సందేహం చాలామందికి కలుగుతుంది.ఈ క్రమంలోనే మనం ముందుగా గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకొని మన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోవాలి.ఒకవేళ గ్లూటెన్ ఉన్న పదార్థాలను తీసుకున్నప్పుడు మనకు కడుపులో నొప్పి డయేరియా లేదా డిప్రెషన్ వంటి లక్షణాలు కలిగినప్పుడు మనం ఆ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

ఈ విధంగా మీ శరీరంలో గ్లూటెన్ ఉందో లేదో ఈజీగా కనుక్కోవచ్చు. ఒకవేళ మీరు గ్లూటెన్ తో బాధపడుతుంటే గోధుమ పిండితో చేసిన రొట్టెలకు దూరంగా ఉండటం ఎంతో ఉత్తమం. ఈ క్రమంలోనే గోధుమ పిండికి బదులుగా రాగి, జొన్న వంటి పిండితో తయారు చేసుకున్న రొట్టెలను తీసుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

పీడకలలు వస్తున్నాయా.. అవి దేనికి సంకేతమో తెలుసా..?

మనలో చాలామందిని నిద్రపోయిన సమయంలో వచ్చే పీడకలలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కొందరు ఆ పీడకలలను తలచుకుని భయాందోళనకు గురవుతూ ఉంటారు. నిద్ర లేచిన తరువాత సైతం ఆ పీడకలలు చాలామందిని వెంటాడుతూ ఉంటాయి. కొందరు వేటి గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటారో అవే పీడకలల రూపంలో వస్తూ ఉంటాయి. కొందరికి ఆ పీడకలల వల్ల ప్రశాంతత కూడా ఉండదు.

తమకు వచ్చిన పీడకలలను అవతలి వ్యక్తులను చెబితే ఏమనుకుంటారో చాలామంది అలా చెప్పడానికి సైతం ఇష్టపడరు. ఈ పీడకలల వల్ల కొందరిలో ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తున్నాయి. వీళ్లు ఎక్కువగా ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన లాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. ఒక సంస్థ 351 మంది పెద్దలపై పీడకలల గురించి పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

వీళ్లలో 2 నుంచి 8 శాతంమంది పీడకలలు తమను నిద్ర లేని రాత్రులు గడిపేలా చేశాయని చెప్పగా మరి కొందరికి ఏదో చెడుశక్తి వెంటాడుతుందన్న భావన కలిగిస్తుందని వెల్లడించారు. పీడకలల వల్ల కొందరు ఆర్‌ఈఎం స్లీప్ బిహేవియర్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధి బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ కలలు రావడానికి సరైన కారణాలు తెలియవని.. పీడకలల వల్ల చాలామంది డిప్రెషన్ బారిన పడుతున్నారని తెలిపారు.

పీడకలలు తరచూ వస్తుంటే వైద్యులను సంప్రదించి సకాలంలో వైద్య చికిత్స చేయించుకోవడం మంచిదని తెలుపుతున్నారు. మీకు కూడా తరచూ పీడకలలు వస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిది.