Tag Archives: Dulquer Salmaan

Rana: బాలీవుడ్ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పిన రానా… అసలు ఏం జరిగిందంటే?

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు.అయితే తాజాగా నటుడు రానా బాలీవుడ్ హీరోయిన్ కు క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రానా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అలాగే నటుడు దుల్కర్ సల్మాన్ కు క్షమాపణలు చెబుతూ ఈయన ట్వీట్ చేశారు.

తాజాగా రానా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని అలాగే రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో ఈయన బాలీవుడ్ నటికీ పరోక్షంగా క్షమాపణలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ తాను యాక్టింగ్ స్కూల్లో చదివే సమయంలో దుల్కర్ తన జూనియర్ అని తెలియజేశారు.తను చాలా మృదుస్వభావి. ఓపిక చాలా ఎక్కువ. ఓ సారి నేను హిందీ సినిమా షూటింగ్‌కు వెళ్లాను. ఆ చిత్ర నిర్మాతలు నాకు చాలా సన్నిహితులు. సెట్ లో దుల్కర్ ఒకవైపు నిల్చుని ఉండగా ఆ సినిమాలో నటిస్తున్నటువంటి ఒక స్టార్ హీరోయిన్ తన భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.

Rana: సోనమ్ పై భారీ ట్రోల్స్..


ఆమె ప్రవర్తన అక్కడ ఎవరికీ నచ్చలేదు ఆ సమయంలో దుల్కర్ చాలా ఓపికగా ఉన్నారని రానా తెలిపారు. అయితే ఆ హీరోయిన్ గురించి తాను తర్వాత నిర్మాతలతో మాట్లాడానని ఈయన తెలియజేశారు. అయితే పరోక్షంగా రానా మాట్లాడినటువంటి సంఘటన
‘ది జోయా ఫ్యాక్టర్‌’ అనే సినిమా సెట్‌లో జరిగిందని నెటిజన్లు నిర్దారణకు వచ్చారు. దీంతో సోనమ్‌కపూర్‌ను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ఇలా రానా చేసిన ఈ వ్యాఖ్యలకు హీరోయిన్ పై ట్రోల్స్ రావడంతో ఈయన దుల్కర్ సల్మాన్ తో పాటు హీరోయిన్ సోనం కపూర్ కి కూడా క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

Nani: అసలైన పాన్ ఇండియా స్టార్ దుల్కర్ మాత్రమే… సంచలన వ్యాఖ్యలు చేసిన నాని!

Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నాని దసరా సినిమా ద్వారా సెన్సేషనల్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా తర్వాత నాని పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈయన దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాని దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు.ఇక పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ… నాకు పాన్ ఇండియా అనే పదం నచ్చదని తెలిపారు.

నాకు తెలిసి అసలైన పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ అంటూ ఈయన తెలిపారు. ఆయన కోసం అన్ని భాషల దర్శకులు కూడా కథలను సిద్ధం చేస్తున్నారని తెలిపారు.ఇలా నాని దుల్కర్ సల్మాన్ అసలైన పాన్ ఇండియా స్టార్ హీరో అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ పై టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరోల అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Nani:

దుల్కర్ సల్మాన్ అసలైన పాన్ ఇండియా స్టార్ అయితే మరి ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి వారు ఎవరు అంటూ టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరోల అభిమానులు తీవ్రస్థాయిలో నాని వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాణా కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హాయ్ నాన్న అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Sitaramam: సీతారామం వంటి హిట్ సినిమాని మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా?

Sitaramam: హను రాఘవపూడి దర్శకత్వంలో నటుడు దుల్కర్ సల్మాన్, నటి మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే నాని విజయ్ దేవరకొండ వంటి హీరోల సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం ఈమె తన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె నటించిన సీతారామం సినిమాలో ముందుగా నటి మృణాల్ కి అవకాశం రాలేదట వేరే హీరోయిన్ ఈ సినిమా అవకాశాన్ని రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం ఈమెకు వచ్చిందని తెలుస్తుంది.

ఈ సినిమా అవకాశం ముందుగా ఏ హీరోయిన్ కి వచ్చింది ఎందుకు రిజెక్ట్ చేశారు అనే విషయానికి వస్తే సీతారామం సినిమాలో నటించే అవకాశం ముందుగా నటి పూజా హెగ్డేకి వచ్చిందట. ఈ సినిమాలో నటించే అవకాశం ఈమెకు రావడంతో ఆ సమయంలో పూజ రాధే శ్యామ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఒకవేళ కాల్ షీట్స్ అడ్జస్ట్ అయినప్పటికీ తాను ఈ సినిమాలో నటించననీ తెలిపారు.

Sitaramam: రిజెక్ట్ చేసిన పూజ హెగ్డే…


ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా సంప్రదాయకంగా ఉంటుంది. చీర కట్టుకున్న లుక్ లో కనిపించాల్సి ఉంటుంది. దీంతో పూజ హెగ్డే చీర కట్టుకొని సినిమాలలోనటిస్తే తనని ఎవరు చూస్తారు అంటూ ఈమె ఈ సినిమాని రిజెక్ట్ చేశారట. ఇలా ఈ సినిమా రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం నటి మృణాల్ ఠాకూర్ అందుకున్నారు. ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయి అయితే ప్రస్తుతం పూజ హెగ్డే పెద్దగా సినిమా అవకాశాలు లేక అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Samantha: ఆ విషయంలో స్టార్ హీరోలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచిన సమంత..?

Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్ , కన్నడ భాషలలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన ఆకట్టుకున్న సమంత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. అంతేకాకుండా మరొకవైపు బాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు అందుకుంటుంది.

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా సమంత మరొక అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. IMDB వారు అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాని ప్రకటించగా సమంత మొదటి స్థానంలో నిలిచింది. ఇండియన్ మూవీ డేటాబేస్ వారు ప్రకటించిన ఈ జాబితాలో మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా సమంత మొదటి స్ధానంలో నిలవడం విశేషం.

ఇదే జాబితా గతంలో రిలీజ్ చేయగా తొమ్మిదో స్థానంలో నిలిచిన సమంత.. ఇప్పుడు తొలి స్థానం కైవసం చేసుకుంది. IMDB ప్రకటించిన జాబితాలో అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టి సమంత అగ్ర స్థానంలో మొదటిగా నిలవటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమాలు, వెబ్ సిరీసులకు వచ్చిన ప్రేక్షక ఆదరణను బట్టి ఈ ఇండియన్ మూవీ డేటాబేస్ (IMDB) రేటింగ్స్ ఇస్తారు.

Samantha: మొదటి స్థానంలో సమంత

ఆడియన్స్ రెస్పాన్స్ ని బట్టి పాపులర్ స్టార్ ఎవరని నిర్ణయిస్తారు. అయితే ఈ లిస్టులో సమంతకు అగ్ర స్థానం రావడం ఆమె క్రేజ్ కి నిదర్శనంగా మారింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో వెబ్ సిరీస్ లలో నటించి ఆకట్టుకుంది. దీంతో ఇటీవల విడుదలైన ఇండియన్ మూవీ డేటాబేస్ లో సమంత మొదటి స్థానం దక్కించుకుంది.

Dulquer Salmaan: మరో ఛాన్స్ కొట్టేసిన దుల్కర్ సల్మాన్… బడా బ్యానర్లో అవకాశం?

Dulquer Salmaan:మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈయన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినా అనంతరం ఈయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

గత ఏడాది ఆగస్టు నెలలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడమే కాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటులకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా పెరిగిపోయారు. ఈ క్రమంలోనే తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దుల్కర్
తెలుగులో మరొక అవకాశాన్ని అందుకున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలు పూర్తి అయ్యాయని త్వరలోనే అధికారక ప్రకటన రానుందని సమాచారం.

దుల్కర్ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా ధనుష్ హీరోగా సార్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి తన తదుపరి ప్రాజెక్టు గురించి దుల్కర్ సల్మాన్ ను కలిసి కథ వినిపించగా కథ నచ్చడంతో దుల్కర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

Dulquer Salmaan: సితార బ్యానర్ లో దుల్కర్…


ఇలా దుల్కర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాని బడా బ్యానర్ నిర్మించబోతుందని సమాచారం.ఇక ఈ కాంబినేషన్లో రాబోతున్న సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారట. త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటన తెలియజేయబోతున్నారు.ప్రస్తుతం మలయాళంలో సొంత నిర్మాణంలో దుల్కర్ ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల అనంతరం తిరిగి వెంకీ అట్లూరి సినిమాలో బిజీ కానున్నట్లు తెలుస్తుంది.

Sitaramam Movie: సీతారామం డిలీట్ సీన్స్ చూశారా.. ఎంత అద్భుతంగా ఉందో వైరల్ అవుతున్న డైలాగ్ వీడియో!

Sitaramam Movie: హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించినటువంటి చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదలయ్యి ఊహించని విధంగా కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం భాషలలో కూడా మంచి విజయం సొంతం చేసుకోవడంతో ఈ సినిమాని హిందీలో డబ్ చేసి విడుదల చేశారు.

 

ఇలా సెప్టెంబర్ రెండవ తేదీ హిందీలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది.అందమైన ప్రేమ కథ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఇకపోతే ఈ సినిమాలో సుమంత్, భూమిక, తరుణ్ భాస్కర్, రష్మిక వంటి సెలబ్రిటీలు సందడి చేశారు.

ఇక ఈ సినిమాలో రష్మిక పాకిస్తాన్ అమ్మాయి పాత్రలో కనిపించారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాలో డిలీట్ చేసిన ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఇంత అద్భుతమైన సన్నివేశాన్ని ఎందుకు డిలీట్ చేశారు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సీన్ లో ఏముంది అనే విషయానికి వస్తే…

 

Sitaramam Movie: ఇండియా పరువును మీ దేశానికి పంపలేను…

రష్మిక సీతామహాలక్ష్మి కోసం వెతుకుతూ ఒక కాలేజ్ కి వెళుతుంది. ఇలా ఆమె టాక్సీలో వెళ్లగా టాక్సీ లోనే తన పర్స్ పాస్ పోర్ట్ మొత్తం మర్చిపోయి వెళ్తుంది. లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి తనకు ఈ విషయం గుర్తు రావడంతో హడావుడిగా బయటకు వస్తుంది.అయితే అప్పటికి ఇంకా టాక్సీ డ్రైవర్ అక్కడే ఉండడంతో ఇంకా ఇక్కడే ఉన్నావా నీలాంటి వాళ్ళు ఇంకా ఇండియాలో ఉన్నారన్నమాట అని రష్మిక మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న టాక్స్ డ్రైవర్ ఇండియాలో అందరూ నాలాంటి వాళ్లే ఉన్నారు.మీ పర్స్ నేను తీసుకెళ్లి ఇండియా పరువును మీతో పాటు మీ దేశానికి పంపించలేను మేడం అంటూ తనకు ఇస్తారు. ఇలా ఎంతో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నటువంటి ఈ సన్నివేశం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

 

Dulquer Salmaan: నేను ముసలోడిని అవుతున్న నువ్వు మాత్రం అలాగే ఉన్నావ్.. భార్యపై నటుడు కామెంట్స్ వైరల్!

Dulquer Salmaan: మలయాళ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమయ్యారు.మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ తాజాగా సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ అనంతరం మరో తెలుగు సినిమా అవకాశాన్ని కూడా అందుకున్నట్టు తెలుస్తుంది.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన తాజాగా తన భార్య పుట్టిన రోజు సందర్భంగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. 12 సంవత్సరాల క్రితం దుల్కర్ సల్మాన్ అమల్ సూఫియా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

ఇకపోతే తాజాగా తన భార్య పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా దుల్కర్ సల్మాన్ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నా స్వీటెస్ట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు మేమిద్దరం ఒక్కటై 12 సంవత్సరాలవుతుంది.నేను మాత్రం ముసలోడినీ అవుతున్నా.. నువ్వు ఇప్పటికి అలాగే ఉన్నావు అంటూ తన భార్య అందంపై ప్రశంసలు కురిపించారు.

Dulquer Salmaan: ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం…

నేను నీ నుంచి చాలా దూరంగా ఉన్నప్పటికీ నీవు కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించినందుకు కృతజ్ఞతలు. ఇక ఈ పుట్టిన రోజు నీకు బెస్ట్ పుట్టినరోజు అవుతుందని ఆశిస్తున్నాను. ఐ లవ్ యు ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అంటూ ఈయన తన భార్యపై ప్రేమను వ్యక్తపరుస్తూ తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Sitaramam Movie: సీతారామం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Sitaramam Movie: హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్, నటి మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది.

ఇలా ఈ సినిమా మొదటి షో నుంచి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా భారీ కలెక్షన్లను రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమాలో గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, రష్మిక,సుమంత్ వంటి వారు కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు.

ఇకపోతే ఈ సినిమాలో మొదటగా పూజా హెగ్డే నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఈ సినిమాలో సీత పాత్రలో కాకుండా రష్మిక నటించిన అఫ్రీన్ పాత్ర కోసం ముందుగా పూజ హెగ్డేని సంప్రదించారట. ఇందులో రష్మిక పాత్ర ఎంతో కీలకంగా మారింది. ఇండియన్స్ ను ద్వేషించే పాకిస్తానీ అమ్మాయి పాత్రలో రష్మిక సందడి చేశారు.

Sitaramam Movie: కరోనా కారణం వల్ల తప్పుకున్న పూజ…

ఈ సినిమాలో రష్మిక పాత్రలో ముందుగా పూజ హెగ్డే ని సంప్రదించడం అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కరోనా రావడం వల్ల పెండింగ్ లో ఉన్న సినిమాల కారణంగా తన కాల్ షీట్స్ లేకపోవడంతో చివరికి ఆ పాత్రలో పూజా హెగ్డేకి బదులు రష్మికను తీసుకున్నారు. ఇలా మొత్తానికి పూజ హెగ్డే సీతారామం వంటి ఒక మంచి సినిమాను మిస్ అయిందని చెప్పాలి.

Dulquer Salmaan: సీఎం జగన్ బయోపిక్ చేయాలని ఉంది.. నటుడు దుల్కర్ కామెంట్స్ వైరల్?

Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు. ఇలా మహానటి సినిమా తర్వాత ఈయన నటించిన తదుపరి చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూలలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయనకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈయన తండ్రి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చిత్రంలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైయస్ జగన్ బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు దుల్కర్ సమాధానం చెబుతూ.. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా నటిస్తానని అయితే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు నటించాలి అనే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని దాన్నిబట్టి మనం నిర్ణయించుకోవాలని తెలిపారు.స్క్రిప్ట్ ఎంతవరకు జనాలను ఆకట్టుకుంటుందనే విషయాలను కనుక గ్రహించగలిగితే తప్పకుండా ఇలాంటి సినిమాలలో నటించవచ్చు అంటూ ఈయన తెలిపారు.

Dulquer Salmaan: ఏపీ రాజకీయాల గురించి అవగాహన లేదు…

ఇకపోతే తనకు ఏపీ పాలిటిక్స్ గురించి పెద్దగా అవగాహన లేదని, కాబట్టి ఎవరి సైడ్ తీసుకోకుండా ఆలోచిస్తానని ఈయన పేర్కొన్నారు. ఇకపోతే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రం ద్వారా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే ఈయనకు సైతం ఈ విధమైనటువంటి ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం జగన్ బయోపిక్ చిత్రం గురించి దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

Prabhas: మాకు థియేటర్లు గుడితో సమానం… ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్?

Prabhas: డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా అశ్వినీ దత్ స్వప్న సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్ రావడం మరింత ప్లస్ అయిందని చెప్పాలి.ఇక వేదికపై ప్రభాస్ మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ ఇదివరకే చూసాను ఎంతో అద్భుతంగా ఉంది ఈ ట్రైలర్ ఎవరు కట్ చేశారో తెలియదు కానీ చాలా బాగుంది అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక మహానటి సినిమాలో దుల్కర్ నటన చూసి ఫిదా అయ్యానని తాను కూడా ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరు అంటూ ప్రభాస్ హీరో పై ప్రశంసలు కురిపించారు. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి అశ్విని దత్ గురించి ప్రభాస్ చెబుతూ వారిపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాల్సి ఉంటుంది అలాంటి వాటిలో సీతారామం ఒకటి అని చెప్పారు.

Prabhas: ఆ గుడిని మీరే మాకు ఇచ్చారు…

ఈ సినిమాని కాశ్మీర్ రష్యా వంటి ప్రదేశాలలో చిత్రీకరించారు. ఎంతో అద్భుతమైన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లోనే చూడాలని ప్రభాస్ అభిమానులకు పిలుపునిచ్చారు. ఇకపోతే మా సినిమా ఇండస్ట్రీకి థియేటర్ గుడి లాంటిది. ఆ గుడిని మీరు మాకిచ్చారు. మన ఇంట్లో పూజగది ఉంది కదా అని గుడికి వెళ్లడం మానేయం అలాగే ప్రతి ఒక్కరు కూడా గుడి లాంటి థియేటర్ కి వచ్చి సినిమాని చూడాలని ఈయన అభిమానులను కోరారు. ఇలా ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.