Tag Archives: elections

Balakrishna: సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్న బాలయ్య.. అదే ప్రధాన కారణమా?

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి బాలయ్య అద్భుతమైనటువంటి హిట్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమా షూటింగుకు బాలకృష్ణ బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది ఏకంగా రెండు నెలలపాటు సినిమా షూటింగ్లకు ఈయన దూరం కాబోతున్నారు.

వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి బాలయ్య ఉన్నఫలంగా షూటింగుకు బ్రేక్ ఇవ్వడానికి కారణం లేకపోలేదు. మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో ఈయన ఎన్నికలలో బిజీ కానున్నారు ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ వచ్చే ఎన్నికలలో కూడా అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు.

ఎన్నికలలో బిజీబిజీ…

ఇలా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈయన సినిమా షూటింగులు అన్నింటికీ కూడా కాస్త బ్రేక్ ఇచ్చేసి రాజకీయాలలో బిజీ కానున్నారు ఎన్నికలలో భాగంగా పెద్ద ఎత్తున హిందూపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఏపీ అంతటా కూడా బాలకృష్ణ పర్యటించబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించే పనులలో బాలయ్య బిజీ కాబోతున్నారని తెలుస్తుంది.

AP Politics: ఎన్నికలు ఎప్పుడు జరిగిన 160 స్థానాలు తెదేపావే: అచ్చం నాయుడు

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎంత రసవత్తరంగా మారుతూ ఉంటాయి. నిత్యం అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. తాజాగా విశాఖలో బుధవారం నిర్వహించిన జోన్‌-1 (ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల పరిధి) సమీక్షసమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత అచ్చం నాయుడు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అచ్చం నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ను ఎంతోమంది ముఖ్యమంత్రిలు పరిపాలించారు. అయితే మొదటిసారి ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని తెలియజేశారు.ఇలాంటి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నిజంగా మనం చేసుకున్న దౌర్భాగ్యం.

సొంత పార్టీ నాయకులే ఆయనని నమ్మడం లేదు అలాంటిది ఈయన నువ్వే మా నమ్మకం జగన్ అని ప్రజల ముందుకు వెళుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.జగన్ అంటే నమ్మకం కాదు ఆయన రాష్ట్రానికి పట్టిన ఓ దరిద్రం అంటూ అచ్చం నాయుడు ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు చేశారు.ఇక ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలియచేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలను కోరారు.

AP Politics: ఎమ్మెల్సీ ఫలితాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి…

ఇక జగన్ పని అయిపోయిందని వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వం ఘోర పరాజయం పాలవడం ఖాయం అని తెలిపారు. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఏకంగా 160 సీట్లను గెలుపొంది అధికారాన్ని అందుకుంటుందని ఈయన ధీమా వ్యక్తం చేశారు. ఇక 30 సంవత్సరాలు తానే సీఎంగా ఉంటానని గొప్పలు చెప్పిన జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేలను బ్రతిమాలుకుంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయని అచ్చం నాయుడు వెల్లడించారు.

CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ..! ఏమన్నారంటే..!

CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగబోతున్నాయా.. ఇటీవల సోషల్ మీడియాలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని విపరీతంగా ప్రచారం కొనసాగుతోంది. వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.

CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ..! ఏమన్నారంటే..!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరగుబోవని.. సోషల్ మీడియాలో తలాతోక లేని ప్రచారం జరగుతుందని స్పష్టం చేశారు. 103 స్థానాలతో తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ పై మాట్లాడుతూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ..! ఏమన్నారంటే..!

కేంద్ర బడ్జెట్ పై తీవ్రంగా మండిపడ్డారు. మసిపూసి మారేడు కాయ చేసిన చందంగా బడ్జెట్ ఉందని ఆయన విమర్శించారు. బడ్జెట్ వల్ల దేశం తిరోగమనం చెందుతుందని ఆయన అన్నారు. బడ్జెట్ లో రైతులకు, పేదలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు, మైనారిటీలకు ఎలాంట ప్రయోజనం లేదని ఆయన అన్నారు. ప్రధాన మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం అన్ని అబద్ధాలు, మాయ మాటలు చెబుతుందన్నారు. 

గుజరాత్ మోడల్ ను అడ్డు పెట్టుకుని..

నరేంద్రమోదీ దేశానికి ప్రధాని కాదని.. కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధాని అని ఎద్దేవా చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వేషధారణతో ప్రధాని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని.. వీటివల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం జరగదని అన్నారు. కరోనా వల్ల కుంటుబడిన హెల్త్ సెక్టార్ కు నిధులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ మోడల్ ను అడ్డు పెట్టుకుని మోదీ ప్రధాని అయ్యారని విమర్శించారు. దేశంలో రాజ్యాంగాన్ని మర్చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైన సమయంలో అవసమైన బాధ్యత నిర్వహిస్తామని కేసీఆర్ అన్నారు. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించి బంగాళా ఖాతంలో కలపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందరూ ఛీ కొట్టినా నేను బీజేపీలో చేరాను.. మాధవీలత షాకింగ్ పోస్ట్..!

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో చాలామంది నాయకులు గతంలో ఉన్న పార్టీల నుంచి మెరుగైన భవిష్యత్తు కోసం మరో పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో సరైన ప్రాధాన్యత లేని నేతలు, పదవుల కోసం ఆశ పడుతున్న నేతలు జంపింగులు చేస్తున్నారు. ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే వెంటనే కండువా మార్చేస్తున్నారు.

ఇలా పార్టీలు మారుస్తున్న నేతల గురించి నటి, బీజీపీ యువ మహిళానేత మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరిన సమయంలో విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు బీజేపీలో చేరడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రాన కాషాయం మనిషి అయిపోరని మాధవీలత అన్నారు. కండువా కప్పుకుంటే దేశభక్తి, జాతీయతాభావం తన్నుకురాదని పేర్కొన్నారు.

భక్తి అనేది బ్లడ్ లో, నరనరాల్లో ఉండాలని, రక్తంలో ఉండాలని అప్పుడే కాషాయాన్ని సరిగ్గా మోయగలరని అన్నారు. అవసరానికి, పదవుల కోసం అయితే కొన్నాళ్లే ఉంటారని.. పదవులు తీసుకున్నంత మాత్రాన గొర్రె సింహం కాదని పేర్కొన్నారు. అందరూ ఛీ కొట్టినా తాను బీజేపీలో చేరానని.. నన్ను ఛీ అన్నవాళ్లు సిగ్గు లేకుండా ఇప్పుడు కాషాయ కండువా కప్పుకుంటున్నారని పేర్కొన్నారు.

వాళ్లు పార్టీలో చేరినా చేరినా తాను ఛీ ఛీ అనడం లేదని తనకు తనకు సంస్కారం ఉందని మాధవీలత పేర్కొన్నారు. నాది ఒకటి కండువా, ఒకటే మాట మీరు ఊసరవెళ్లులు, నక్కలు అని మాధవీలత అన్నారు. 88 శాతం మంది ప్రజలు కూడా అదే విధంగా ఉన్నారని యథా రాజా తథా ప్రజా అంటూ పోస్ట్ పెట్టారు.