Tag Archives: F3 movie

Varun Tej -Lavanya Tripathi: ఒకే చోట చేరి సందడి చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి.. వైరల్ అవుతున్న ఫోటో?

Varun Tej -Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా గని, ఎఫ్ 3 సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో గని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కాగా ఎఫ్3 సినిమాతో ఈయన ప్రేక్షకులను సందడి చేశారు.ఈ సినిమా మంచి విజయం కావడంతో తన తండ్రి నాగబాబు నిర్మాణంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా గురించి అప్డేట్ విడుదల చేయాల్సి ఉంది.

ఇకపోతే హీరో వరుణ్ తేజ్ గురించి గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈయన నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి.ఈయన లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉండటం వల్లే తన సోదరీ నిహారిక వివాహానికి ఏ ఇతర హీరోయిన్లు హాజరు కాకపోయినా లావణ్య త్రిపాటి మాత్రమే హాజరయిందంటూ వార్తలు షికార్లు చేశాయి.

ఈ విధంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ గురించి పెద్ద ఎత్తున ఈ వార్తలు రావడంతో ఇందులో నిజం లేదని లావణ్య త్రిపాఠి ఈ వార్తలను కొట్టి పారేశారు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ఒకచోట చేరి మరోసారి పెద్ద ఎత్తున సందడి చేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు.అయితే తన ఫ్రెండ్ పుట్టినరోజు కావడంతో వీరిద్దరూ కూడా ఆ పుట్టిన రోజు వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేసినట్టు తెలుస్తుంది.

Varun Tej -Lavanya Tripathi: పుట్టినరోజు వేడుకలలో సందడి చేసిన వరుణ్…లావణ్య..

ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు ఒకే చోట చేరి కనిపించడంతో మరోసారి వీరి ప్రేమ గురించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి వీరిద్దరూ ఎక్కడ కలిసిన వీరి ప్రేమ గురించి వార్తలు రావడంతో చాలామంది వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని బయటకు చెప్పడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి మధ్య ఏ విధమైనటువంటి రిలేషన్ ఉందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.

Paruchuri Gopalakrishna : F3 సినిమాని విక్టరీ వెంకటేష్ ఎలా ఒప్పుకున్నారో అర్థం కాలేదంటూ షాకింగ్ కామెంట్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ.!!

Paruchuri Gopalakrishna : ఫెయిల్యూర్స్ లేని డైరెక్టర్స్ అంటే రాజమౌళి తర్వాత టక్కున గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావిపూడి. అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకున్న అతికొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. చక్కటి కథకు సృజనాత్మకతను అద్ధితే విజయవంతమైన చిత్రాలను రూపొందించవచ్చని ఆయన నిరూపించారు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే.పవన్ కల్యాణ్ నటించిన “తమ్ముడు” చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు. 2005 లో విడుదలైన గౌతమ్ ఎస్.ఎస్.సి. చిత్రానికి సహాయకుడిగా పనిచేశాడు.

ఆ తర్వాత శౌర్యం, శంఖం, దరువు, సుడిగాడు చిత్రాలకు సంభాషణ రచయితగా.. కందిరీగ, ఆగడు, పండగ చేసుకో చిత్రాలకు కథా రచయితగా పనిచేశారు. ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సారథ్యంలో “పటాస్” చిత్రం ద్వారా మొదటిసారిగా అనిల్ రావిపూడి దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సాయి ధరంతేజ్ హీరోగా “సుప్రీం” రవితేజతో “రాజా ది గ్రేట్” ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వెంకటేష్, వరుణ్ తేజ్ తమన్నా మెహ్రిన్ హీరో హీరోయిన్లుగా F2 చిత్రాన్ని రూపొందించారు. అలా ఆ సినిమా విజయవంతం అయింది. ఆ విజయం దర్శక నిర్మాతలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది దానితో తిరిగి F2 కి సీక్వెల్ తీయాలనుకున్నారు.

ఆ క్రమంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు F3 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమా మే 27,2022న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే F3 సినిమా గురించి సీనియర్ సంభాషణల రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఎఫ్ త్రీ చిత్రంలో మురళీశర్మ కొడుకుగా వెంకీని చూపించడం బాగోలేదని.. వరుణ్ తేజ్, సునీల్ కొడుకులమంటూ రావడం లాంటి సీన్స్ అర్థం లేకుండా ఉన్నాయని, ఒకప్పుడు తాము శ్రీకృష్ణ లీలలు అనే చిత్రంలో చేసిన తప్పులే F3 లో దర్శకుడు చేసినట్లు అనిపిస్తుందని, అసలు వెంకి ఈ సినిమాలో ఆ పాత్రను ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావడం లేదని పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Actress Mahreen: నటి మెహరీన్ పెళ్లి క్యాన్సిల్ అవడానికి ఆ డైరెక్టర్ కారణమా.. అతని వల్లే పెళ్లి ఆగిపోయిందా?

Actress Mahreen: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నాని సరసన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా ద్వారా పరిచయమై మొదటి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

తాజాగా ఎఫ్ త్రీ సినిమాతో మంచి హిట్ కొట్టిన మెహరీన్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా తెలుగుతో పాటు పలు భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ గతంలో ఓ పొలిటీషియన్ కుమారుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈమె నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.అయితే పెళ్లికి కొంత సమయం ఉందన్న నేపథ్యంలో తన నిశ్చితార్ధాన్ని బ్రేక్ చేసుకుని పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.

ఈ విధంగా ఈమె పెళ్లి క్యాన్సిల్ కావడంతో ఇలా ఉన్నఫలంగా పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుని కూడా కొంతకాలం అవుతున్నప్పటికీ తాజాగా ఈమె పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెహరీన్ పెళ్లి క్యాన్సిల్ కావడానికి ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కారణమని తెలుస్తోంది.

Actress Mahreen: డైరెక్టర్ తో సన్నిహితంగా ఉండటమే కారణమా…

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెహరీన్ ఏ విధమైనటువంటి అవకాశాలు లేక కెరియర్లో ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తనకు తన సినిమాలలో నటించే అవకాశం కల్పించారని, ఇలా ఆ సమయంలో మెహరీన్ ఆ డైరెక్టర్ మధ్య ఎంతో సఖ్యత ఏర్పడిందనీ, ఈ కారణం వల్లే మెహరీన్ పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈమె పెళ్లి క్యాన్సిల్ కావడం గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Venkatesh: ఎఫ్ 3 కోసం మూడింతలు రెమ్యునరేషన్ తీసుకున్న వెంకటేష్.. కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్?

Venkatesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఎన్నో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించి ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు.ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన వెంకటేష్ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Venkatesh: ఎఫ్ 3 కోసం మూడింతలు రెమ్యునరేషన్ తీసుకున్న వెంకటేష్.. కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్?

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 సినిమా ఈ నెల 27వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం వెంకటేష్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Venkatesh: ఎఫ్ 3 కోసం మూడింతలు రెమ్యునరేషన్ తీసుకున్న వెంకటేష్.. కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్?

ఎఫ్ 3 సినిమా కోసం వెంకటేష్ మూడింతల అధిక పారితోషికం తీసుకున్నారని, వెంకటేష్ సినీ కెరియర్ లోనే ఇదే ఎక్కువ పారితోషికం అని తెలుస్తుంది. ఎఫ్ 2 సినిమా కోసం ఈయన 7 కోట్ల పారితోషికం తీసుకోగా, ఎఫ్ 3 సినిమా కోసం మూడింతలు అధికంగా పారితోషికం అంటే 21 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

మూడింతల వినోదం..

ఈ విధంగా వెంకటేష్ తన సినీ కెరీర్ లో 21 కోట్లు పారితోషికం తీసుకున్న మొట్టమొదటి సినిమా ఇదేనని, ఇంతవరకు వెంకటేష్ ఏ సినిమాకి ఇంత పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా సూపర్ హిట్ అని అర్థమవుతుంది. మరి ఈ సినిమా ద్వారా వెంకటేశ్వర ప్రేక్షకులను ఎలా సందడి చేస్తారు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

ఎఫ్3 విడుదల తేదీ ఖరారు..స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ..!

కరోనా కారణంగా ఇంటికే పరితమైన చాలామంది అఖండ సినిమాతో దాదాపు థియేటర్లకు వస్తున్నారనే చెప్పాలి. తర్వాత పుష్ప సినిమాతో ఉన్న ఆ చిన్న పాటి భయం కూడా జనాల్లో పోయిందనే చెప్పాలి. ఇక క్రిస్మస్ కు ముందు డిసెంబర్ 24న విడుదల కాబోయే మరో ప్యాన్ ఇండియా మూవీ శ్యామ్ సింగరాయ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా పూర్తి చేసేశారు.

తర్వాత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానుంది. సంక్రాంతి బరిలో కూడా చాలా సినిమాలు రానున్నాయి. అందులో పవన్ కళ్యాన్ సినిమా భీమ్లా నాయక్ విడదుల అవుతుంది అనుకున్నారు. కానీ తెలిసిన సమాచారం ప్రకారం ఆ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఎఫ్2. దీనికి సీక్వెల్ గా వస్తున్న మరో సినిమా ఎఫ్3.

దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పనులు అత్యత వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా తమన్నా, మెహరీన్ లు నటించారు. వీరితో పాటు అంజలి, ప్రసాద్‌గా రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అలీ, తులసి, సత్య, ప్రదీప్, ప్రగతి, వై. విజయ, అన్నపూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రచ్చ రవి కూడా ఉన్నారు. ఇది పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ఎఫ్3 శాటిలైట్ హక్కులను జీ తెలుగు , జీ సినిమాలకు విక్రయించారు. స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు ఈ సనిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా విడుదల తేదీకి సంబంధించి పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాను ఏప్రిల్ 29, 2022లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.