Tag Archives: fire accident

Actress Sharmeen: మేకప్ రూమ్ లో అగ్ని ప్రమాదం… మంటల్లో చిక్కుకొని ప్రమాదంలో పడ్డ నటి!

Actress Sharmeen: సినిమా మనకు రెండు గంటల పాటు ఎంతో వినోదాన్ని అందిస్తుంది.ఈ రెండు గంటల సినిమా చూసే ప్రతి ఒక్కరు ఎంతో సంబరపడిపోతుంటారు. అయితే ఆ రెండు గంటల సినిమా వెనుక కొన్ని నెలల కష్టం ఉంటుంది. ఒక సినిమాని చేయడం కోసం ఎంతోమంది నెలల పాటు శ్రమించాల్సి ఉంటుంది. ఇలా సినిమా షూటింగ్ సమయంలో ఎంతోమంది ఎన్నోసార్లు ప్రమాదాలలో పడి ప్రాణాలతో బయటపడుతుంటారు.

ఇలా షూటింగ్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటూ కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా బాంగ్లాదేశ్ కు చెందిన ఓ నటి ఇలాంటి ప్రమాదానికి గురయ్యారు. బంగ్లాదేశీ నటి షర్మీన్‌ అకీ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఈమె ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మేకప్ రూమ్ లో భారీ పేలుడు సంభవించింది.

ఇలా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో సెట్ మొత్తం కాలిపోయింది అయితే ఆ మంటల్లో నటి షర్మీన్‌ చిక్కుకోవడంతో ఆమె శరీరం 35% కాలిపోయిందని తన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఇలా మంటల్లో చిక్కుకున్న ఈమెను చిత్ర బృందం రక్షించి తనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం తన శరీరం వైద్యానికి సహకరించలేదని తెలుస్తోంది.

Actress Sharmeen: అగ్నిప్రమాదంలో గాయపడ్డ నటి..


ఈ మంటల్లో చిక్కుకున్న ఈమె కాళ్లు చేతులతో పాటు వెంట్రుకలు ఇతర శరీర భాగాలు కాలిపోయాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక తనకు ప్లాస్మా తక్కువ కావడంతో ప్లాస్మా ఎక్కించామని వైద్యలో వెల్లడించారు. ఇలా ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై విషమ పరిస్థితిలో ఉన్నటువంటి ఈమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Bigg Boss6: కళ్ళ ముందే ఫైర్ యాక్సిడెంట్ లో అమ్మను కోల్పోయాను… ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్న!

Bigg Boss6: బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం రోజురోజుకు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వహించే టాస్కులతో ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతూ వారి జీవితంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ రెండవ వారంలో భాగంగా సిసింద్రీ టాస్క్ పూర్తి కాగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక బేబీ ఉండటం అది వారి జీవితాన్ని ఎలా మార్చిందనే విషయాల గురించి తెలపాలని సూచించారు.

ఈ క్రమంలోనే సుదీప 2015లో తనకు ఒకసారి ప్రెగ్నెన్సీ కన్సివ్ అయిందని థైరాయిడ్ కారణంగా బేబీని వదులుకోవాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యారు.అదేవిధంగా రేవంత్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు నోచుకోలేదు అయితే ప్రస్తుతం తన భార్య సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఎప్పుడు నాన్న అని పిలిపించుకుంటానా అని ఎదురు చూస్తున్నానని తెలిపారు.

ఇక మెరీనా రోహిత్ దంపతులు కూడా తమ బేబీని కోల్పోయిన సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.త్రీ మంత్స్ తర్వాత బేబీ హార్ట్ బీట్ లేదని చెప్పగా వేరే దారి లేక బేబీనీ కోల్పోయామని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక కీర్తి భట్ సైతం బిగ్ బాస్ వచ్చేముందు తన కూతురు లేదని వార్త తెలిసింది అయితే చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయానంటూ ఎమోషనల్ అయ్యారు.

Bigg Boss6: ఒక్కసారిగా ఎమోషనల్ అయినా కంటెస్టెంట్స్..

అందరిని ఎప్పుడు నవ్విస్తూ ఉండేటటువంటి చలాకి చంటి జీవితంలో కూడా విషాద ఘటన ఉంది. తాను చూస్తుండగానే తన తల్లి ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిందని ఒక్కడినే దాదాపు రెండు గంటల పాటు ఏడుస్తూ ఉన్నాను. ఇలా నా తల్లి చనిపోతే నా జీవితంలోకి ఇద్దరు అమ్మలు వచ్చారంటూ ఈయన తన తల్లి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో జరిగిన సంఘటనలను చెప్పడంతో మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.

రైలులో అగ్నిప్రమాదం.. దట్టంగా వ్యాపించిన పొగలు..!

దూర ప్రాంతాలకు వెల్లే ప్రయాణికులకు.. బడ్జెట్ ధరలో ప్రయాణ సౌక్యాన్ని కల్పించే శాఖ రైల్వే. రైల్వే ప్రయాణం అంటే ఎంతో మంది ఇష్టపడతారు. దీని ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు అనే భావన కూడా ఉంటుంది. 99 శాతం ప్రమాదాలు అనేవి రైల్వే ప్రయాణంలో చోటు చేసుకోవు.. కానీ కొన్నిసందర్బాల్లో అనుకోని ఘటనల వల్ల ప్రమాదలు సంభవిస్తాయి.

తాజాగా జరిగిన ఘటనలో ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభంవించింది. రైలులోని ఏసీ బోగీలో ఈ మంటలు వ్యాపించాయి. ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజ్ ఎక్స్‌ప్రెస్ అనే రైలు న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వరకు వెళ్తుంది. డిల్లీ నుంచి యూపీలోని ఝాన్సీ వెళుతున్నఈ రైలు లో శనివారం ఉద‌యం ఏసీ బోగీ నుంచి పొగ వ‌స్తున్న‌ట్లు గుర్తించారు.

దీంతో ప్రయాణికులు హడలిపోయారు. భయాందోళనలకు గురయ్యారు. ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు వ్యాపించటంతో రైలును హ‌ర్యానాలోని అసోతి స్టేష‌న్ వ‌ద్ద నిలిపివేశారు. బ్రేక్ జామ్ కావ‌డం వ‌ల్ల అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు ఓ రైల్వే అధికారి చెప్పారు. వెంటనే స్పందించి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.

ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటూ చెప్పారు. స్వల్ప స్థాయిలోనే మంటలు వచ్చాయని.. మంటల కంటే ఎక్కువగా పొగ కమ్ముకుందని సీపీఆర్వో దీప‌క్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రతీ ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చనేది అనుమానిస్తున్నారు.

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో రోగులు..!

సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఎంతో మంది రోగులు ఉంటారు. రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉండటంతో అక్కడికి ఎంతో మంది పేదలు వారి వైద్యానికి సంబంధించి ట్రీట్ మెంట్ కోసం వస్తుంటారు. ఈ రోజు ఉదయం అక్కడ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ లేబర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే అక్కడి ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో భారీ ప్రమాదం తప్పింది. భయంతో అక్కడి రోగులు బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధీ ఆసుపత్రిలో ఎప్పటిలాగే ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ రోజు ఉదయం అక్కడే ఉన్న లేబర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‎ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్‌ ప్యానెల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

ఆ మంటలను అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది గమనించి.. వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే వాళ్లు వచ్చే లోపే కొంతమంది రోగులు మంటల్లో చిక్కుకున్నారు. ఇలా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన రోగులు భయంతో బయటకు పరుగులు తీశారు.

మొదట మంటలు వస్తున్న క్రమంలో అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యం కావడంతో.. ఆసుపత్రి సిబ్బందే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వాళ్లే అక్కడ ఉన్న చాలామంది రోగులను కాపాడారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

దురదృష్టం అంటే ఇదే.. బూడిద పాలైన 20 లక్షలు క్యాష్….!

మన జీవితంలో అదృష్టం, దురదృష్టం ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి తలుపు తడతాయో ఎవరికీ తెలియదు.ఇలా అదృష్టం మన ఇంటి తలుపు తట్టినప్పుడు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు.అదే దురదృష్టం వెంటాడుతుంటే ఎంతో పెద్ద కోటీశ్వరులు కూడా రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఒకటి చోటు చేసుకుంది. కుమారుడి చదువు కోసం ఉన్న భూమిని కాస్త అమ్మి డబ్బులు తెచ్చి ఇంట్లో పెడితే ఆ డబ్బు కాస్త అగ్నికి ఆహుతి అయిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ , పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే…చింతలపూడి మండలం గురుభట్లగ్రామం గ్రామంలోని శివాలయం వీధిలో నివసిస్తుండే కృష్ణవేణి అనే మహిళ తనకు ఉన్న పొలం అమ్మి తన కొడుకు ఉన్నత చదువుల కోసం డబ్బును సమకూర్చుకుంది. ఈ క్రమంలోనే 20 లక్షల నగదును బ్యాగులో పెట్టి డబ్బులు బీరువాలో భద్రపరిచింది. అసలు డబ్బు కాలి పోవడానికి ఏ మాత్రం అవకాశం లేనిచోట దాచిపెట్టిన ఆ డబ్బు పై ప్రకృతి కన్నెర్ర చేసింది.

ఇలా బీరువాలో దాచిపెట్టిన సొమ్ము పై ఏకంగా పిడుగు పడటం చేత అందులో ఉన్నటువంటి 20 లక్షలు కళ్ళముందే అగ్నికి ఆహుతి అయిపోయాయి. ఇదంతా చూస్తున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇలా కుమారుడు ఉన్నత చదువుల కోసం ఉన్న పొలంకాస్త అమ్మి వచ్చిన డబ్బులు ఇలా బూడిద కావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ ఘటన జరగగానే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇలా ఉన్న సొమ్ము మొత్తం బూడిదలో కాలిపోవడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఇలాంటి కష్ట సమయాల్లో వారిని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

నటుడు చలపతిరావు భార్య ఇంట్లోనే ఎలా మరణించారో తెలుసా?

దశాబ్దాల కాలం నుంచి ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకాదరణ సంపాదించుకున్న వారిలో చలపతిరావు ఒకరు. విలక్షణ నటుడిగా, తండ్రిగా, తాత పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. కెరీర్ మొదట్లో విలన్ పాత్రలో నటించిన చలపతిరావు ఆ తరువాత తండ్రి, తాతల పాత్రలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. నాగార్జున హీరోగా నటించినటువంటి “నిన్నే పెళ్ళాడుతా”చిత్రంలో నాగార్జునకి తండ్రి పాత్రలో నటించారు. ఆ పాత్రే చలపతిరావు కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పవచ్చు.

ఇక చలపతిరావు వ్యక్తిగత విషయానికి వస్తే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చలపతిరావుకి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు కాగా, కొడుకు రవిబాబు. నటుడిగా, దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎంతగానో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య ముగ్గురు పిల్లలకు జన్మనివ్వగానే మరణించారు. అయితే తను అగ్నిప్రమాదంలో మరణించిందని ఓ సందర్భంలో చలపతిరావు తెలియజేశారు.

అప్పట్లో మద్రాసులో రెండు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి.ఒక రోజు రాత్రి రెండుగంటల సమయంలో నీళ్ళు వస్తే తాను పడతానని చలపతిరావు అనగా మీరు పడుకోండి నేను పడతానని చెప్పి తన భార్య వెళ్లిందని, వెళ్ళిన కొద్దిసేపటికి “నిన్నే.. నిన్నే” అనే మాటలు వినిపించాయి. ఏంటా అని వెళ్లి చూసేసరికి వంట గదిలో తన భార్య చీర అంటుకుని మంటలలో కాలిపోతోంది.

వెంటనే మంటలను ఆర్పి తనని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్ళాను అప్పటికే వెనక భాగం మొత్తం పూర్తిగా కాలిపోయింది. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తను చివరి రోజు ఆ పిల్లల వేదన భరించలేవు మరో పెళ్లి చేసుకో అంటూ ఆమె మరణించిందని చలపతిరావు చెప్పారు. అయితే ఆ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని తన భార్య చెప్పలేకపోయింది. అయితే తన భార్య మరణించిన తర్వాత ఎంతో మంది మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినప్పటికీ చలపతిరావు పెళ్లి చేసుకోకుండా పిల్లలను పెంచి పోషించారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు జీవితంలో బాగా సెటిల్ అయ్యారని తెలియజేశారు.

దారుణం: ప్రమాదంలో పది మంది చిన్నారులు బలి!

మహారాష్ట్ర జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో అభం శుభం తెలియని నవజాత శిశువులు పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్ర భండార జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలోనిఐసీయూ ఈ విభాగంలో దాదాపు నెల నుంచి మూడు నెలల వయసున్న 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఐసీయూ ఈ విభాగంలో ఉన్నఫలంగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఐసీయూ విభాగంలో పనిచేసే వైద్య సిబ్బంది ఏడుగురు చిన్నారులను రక్షించగలగారు. మిగిలిన పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. అయితే ఈ ప్రమాదం ఏ కారణం వల్ల చోటు చేసుకుందో తెలియాల్సి ఉంది.ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం భవిష్యత్తులో ఎంతో విలువైన చిన్నారులను కోల్పోయామని,గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని నరేంద్రమోడీ ఆకాంక్షించారు.

మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపేతో మాట్లాడి విషయంపై ఆరా తీశారు వెంటనే ప్రమాద ఘటనకు కారణాలు తెలియజేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తెలియజేశారు. ఈ ఘటనపై మృతుల బంధువులు స్పందిస్తూ కేవలం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏమీ తెలియని తమ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు.అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తొందరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు.