Tag Archives: good news

ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం జగన్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. దసరా పండుగ సమయంలో ఉద్యోగులకు తీపికబురు అందించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో లాక్ డౌన్ అమలు వల్ల ఏపీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. కొన్ని రోజుల క్రితమే లాక్ డౌన్ సమయంలో కోత విధించిన జీతాలను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.

ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నిన్న సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకోగా అడిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు వచ్చే నెలలో ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి జగన్ కరోనా సోకిన ఉద్యోగులకు నెల రోజుల పాటు స్పెషల్ లీవ్ ఇవ్వాలని.. ఉద్యోగులకు రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలం ఇవ్వాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ఈ నిర్ణయాల పట్ల జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం అందుతోంది. పీఆర్సీ, సీపీఎస్ అమలు విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం. సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మహిళా ఉద్యోగులకు 5 రోజుల సెలవులు ఇవ్వాలని, నాలుగో తరగతి ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని.. ఉద్యోగులకు సౌకర్యాలు, రాయితీలు పెంచాలని కోరామని తెలిపారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సీఎం ఎన్జీవో సంఘం అధ్యక్షుడి వినతులకు అనుకూలంగా స్పందించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైలు ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో ఇంటి ముంగిటకు సామాన్లు..!

భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది . ప్రయాణికుల రవాణా కష్టాలకు చెక్ పెట్టే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రయాణికుల సౌకర్యార్థం బ్యాగ్ ఆన్ వీల్ సేవలను రైల్వే శాఖ ప్రారంభించనుంది. భారతీయ రైల్వే ప్రారంభించబోయే ఈ సరికొత్త సర్వీసుల ద్వారా ప్రయాణికులకు వారి సామాన్లు ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కు, రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి రవాణా చేయబడతాయి.

దేశంలో ప్రముఖ రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖ మొదట ఈ సర్వీసులను ప్రారంభించనుంది. అనంతరం ఇతర ప్రాంతాల్లో సైతం ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖ మొదట ఢిల్లీ. గురుగావ్, ఘజియాబాద్ ప్రాంతాలలో ఈ రైలు సర్వీసులను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఢిల్లీ డివిజన్ యాప్ సహాయంతో ఈ సర్వీసులను ప్రారంభంచనుంది. భవిష్యత్తులో దేశమంతటా ఈ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఢిల్లీలోని వివిధ రైల్వే స్టేషన్ల ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. రైల్వే అధికారులు బ్యాగ్ ఆన్ వీల్స్ సర్వీసుల గురించి మాట్లాడుతూ ఈ సర్వీసుల కోసం నామమాత్రపు ఛార్జీలనే వసూలు చేయనున్నట్టు వెల్లడించారు. నార్త్ సెంటర్ రైల్వే మేనేజర్ రాజీవ్ చౌదరి మాట్లాడుతూ ఇలాంటి సర్వీసులను ప్రారంభించడం ఇదే తొలిసారి అని చెప్పారు.

మరోవైపు కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే రైళ్లు తిరుగుతున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రైల్వే శాఖ పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతుండగా భవిష్యత్తులో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతుండటం గమనార్హం.

ఏపీ పదో తరగతి విద్యార్థులకు జగన్ సర్కార్ తీపికబురు..!

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి. వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడగా విద్యారంగంపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది.

అయితే ఎన్ని రోజులైనా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాని నేపథ్యంలో జగన్ సర్కార్ విద్యాసంవత్సరం ప్రారంభం కోసం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించి ఈ ఏడాదికి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను కల్పించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2008లో రాష్ట్రంలోను పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు.

ప్రతి సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల ఆధారంగా ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు జరిగేవి. అయితే కరోనా వైరస్ విజృంభణ వల్ల ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడంతో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా పదో తరగతి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

ప్రభుత్వం విద్యా సంవత్సరం వృథా కాకూడదనే ఉద్దేశంతో రెండో తేదీ నుంచి పాఠశాలల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు. 1, 3, 5, 7 తరగతుల విద్యార్ధులకు ఒకరోజు 2,4,6.8 తరగతులకు మరో రోజు క్లాసులు జరుగుతాయని మంత్రి వెల్లడించారు.

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. సబ్సిడీ నగదు విడుదల..!

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. భారీ వర్షాల వల్ల పంట దెబ్బ తినడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం ప్రభుత్వం 10.76 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2020 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల మధ్యలో కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఆ సమయంలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదలైంది. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ నగదును ఇవ్వనుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నష్టపోయిన రైతుల వివరాలను, వారికి అందించాల్సిన పరిహారం వివరాలకు సంబంధించిన నివేదికను తయారు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో 7,757 హెక్టార్లల్లో పంట నష్టానికి సబ్సిడీ విడుదలైంది.

ప్రభుత్వం విడుదల చేసిన నగదును 17,872 మంది నష్టపోయిన రైతులకు అధికారులు ఇవ్వనున్నారు. మరోవైపు జగన్ సర్కార్ ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా నగదును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రైతుల ఖాతాలలో 4,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుందని తెలుస్తోంది. ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఈ నగదును రైతులకు ఇస్తోంది.

జగన్ సర్కార్ ప్రతి సంత్సరం రైతు భరోసా పథకం ద్వారా 13,500 రూపాయల నగదు ఇవ్వనుండగా ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు, రాష్ట్రం వాటా 7,500 రూపాయలుగా ఉంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాలు ఉన్నా పథకాలను అమలు చేస్తూ ఉండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త… 2,173 వాలంటీర్ల ఉద్యోగాలు..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిన జగన్ సర్కార్ తాజాగా రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

జగన్ సర్కార్ రాష్ట్రంలోని నెల్లూరు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాలలో 2,173 ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ప్రాతిపదికన ఎంపిక చేసే గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలకు ప్రభుత్వం నెలకు 5,000 రూపాయల వేతనం చెల్లిస్తుంది. https://gswsvolunteer.apcfss.in/ వెబ్ సైట్ లో ఉద్యోగానికి సంబంధించిన పూరి వివరాలు పొందుపరిచారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా జగన్ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలపై అవగాహనతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 211, అనంతపురం జిల్లాలో 981, చిత్తూరు జిల్లాలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నెల్లూరు జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 23 చివరి తేదీ కాగా చిత్తూరు జిల్లా అభ్యర్థులకు 25వ తేదీ, అనంతపురం జిల్లా అభ్యర్థులకు 31వ తేదీ చివరి తేదీగా ఉంది. స్థానిక గ్రామ పంచాయితీ పరిధిలో నివశించే వాళ్లను మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ట్రూ కాలర్ యాప్ వాడేవాళ్లకు శుభవార్త..?

స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ మంది వినియోగదారులు వినియోగించే అప్లికేషన్లలో ట్రూ కాలర్ కూడా ఒకటి. ఈ యాప్ ద్వారా యాప్ వినియోగదారులకు అవతలి వైపు నుంచి కాల్ చేసే వాళ్ల వివరాలు సులభంగా తెలుస్తుంది. మనలో చాలామంది ప్రతిరోజూ స్పామ్ కాల్స్ వల్ల ఇబ్బందులు పడుతుంటారనే సంగతి తెలిసిందే. మార్కెటింగ్ కంపెనీల నుంచి రోజుకు పదుల సంఖ్యలో కంపెనీల నుంచి కాల్స్ వస్తుంటాయి.

అయితే ఈ కాల్స్ లో కొన్ని ముఖ్యమైన కాల్స్ ఉండగా చాలా కాల్స్ అనవసరమైనవే ఉంటాయి. కొన్ని నంబర్లను మనం బ్లాక్ చేసినా వేరే నంబర్ల నుంచి కాల్స్ వస్తూ ఉండటంతో ఇబ్బందులు పడుతూ ఉంటాం. తాజాగా ట్రూ కాలర్ యాప్ అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇక నుంచి అవతలి వ్యక్తులు మనకు కాల్ ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే సాకర్యాన్ని ట్రూ కాలర్ యాప్ అందిస్తోంది.

ఉదాహరణకు బ్యాంకుల చెల్లింపులకు సంబంధించిన కాల్స్ వస్తే ఫోన్ స్క్రీన్ పైన కాలర్ ఐడీతో పాటు రీజన్ కూడా కనిపిస్తుంది. ఈ రీజన్ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పాలి. రోజురోజుకు స్పామ్ కాల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ట్రూ కాలర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వినియోగదారుల సమయం కూడా ఆదా కానుంది. సెట్టింగ్స్ లో మార్పులు చేసుకుని ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలో వద్దో యూజర్ డిసైడ్ చేసుకోవచ్చు.

ట్రూకాలర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనిరాగా యాపిల్ ఫోన్ల యూజర్లకు త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ట్రూ కాలర్ అడుగులు వేస్తుండటం గమనార్హం.

ఏపీ విద్యార్థినులకు శుభవార్త.. ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థినులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహాయంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థినులకు ఉచితంగా శిక్షణతో [పాటు ఉద్యోగం కల్పిస్తామని ప్రకటన చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డెరైక్టర్ అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. శిక్షణ అనంతరం విద్యార్థినులకు శ్రీసిటీ లోని ఆల్‌స్టామ్ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేసిన 2019 విద్యార్థినులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికయిన విద్యార్థినులకు ఫ్రీ ట్రైనింగ్ తో పాటు ఫ్రీగా హాస్టల్ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

http://engineering.apssdc.in/siemenplacements/ విద్యార్థినులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని.. ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులు మాత్రమే అర్హులని తెలిపారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. జిల్లాల నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తు చేసుకున్న విద్యార్థినుల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హతలు ఉన్నవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.

ఎంపికైన విద్యార్థినులు శ్రీ సిటీలో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత వారికి ఆల్‌స్టామ్ సంస్థ, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ సర్టిఫికెట్లను అందజేస్తాయి. శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినులకు సంవత్సరానికి 3 లక్షల రూపాయల వేతనంతో ఆల్‌స్టామ్‌ సంస్థ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.

తక్కువ జీతం వచ్చే వాళ్లకు శుభవార్త.. ఫ్రీగా విద్య, వైద్యం, పెళ్లికి డబ్బులు..!

మనలో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే మెజారిటీ ఉద్యోగుల వేతనం 25,000 రూపాయల కంటే తక్కువగానే ఉంటుంది. తక్కువ మొత్తం వేతనం రూపంలో లభిస్తూ ఉండటం వల్ల విద్య, వైద్యం, పెళ్లి లాంటి వాటి కోసం ఖర్చు చేయాల్సి వస్తే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గాయి.

మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటే మాత్రమే ఎక్కువ మొత్తంలో వేతనాలు చెల్లించటానికి కంపెనీలు సిద్ధపడే అవకాశం ఉంటుంది. అయితే తక్కువ మొత్తం వేతనం లభిస్తోందని ఏ మాత్రం బాధ పడాల్సిన అవసరం లేదు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ మొత్తంలో వేతనం పొందుతున్న వారి కోసం ప్రత్యేక స్కీమ్స్ ను అందుబాటులోకి తెచ్చి ఆ స్కీమ్స్ ద్వారా వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ఫ్రీగానే కొన్ని రకాల సౌకర్యాలు పొందే అవకాశం కల్పిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇఅలాంటి స్కీమ్స్ అందుబాటులో లేవు కాని హరియాణ ప్రభుత్వం మాత్రం నెలకు కేవలం 25 రూపాయలు చెల్లించి విద్య, వైద్యం, పెళ్లి కోసం ప్రభుత్వం నుంచి సాయం పొందవచ్చు. నెలకు మొత్తం 75 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఉద్యోగి 25 రూపాయలు చెల్లిస్తే మిగిలిన 50 రూపాయలు ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి నెల చెల్లించిన యువతులు పెళ్లి చేసుకుంటే వారికి ప్రభుత్వం 51,000 రూపాయలు అందిస్తుంది.

మహిళలు చెల్లిస్తే వాళ్ల ఆడపిల్లలకు ప్రభుత్వం నుంచి 51,000 రూపాయల ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వం పెళ్లికి మూడు రోజుల మందు ఈ నగదు లబ్ధిదారులకు అందేలా చేస్తుంది. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే స్కూల్ డ్రెస్, బుక్స్ కోసం ప్రతి సంవత్సరం 4,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. పని చేసే సమయంలో వైకల్యం సంభవిస్తే లక్షన్నర రూపాయలు, మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కుటుంబానికి అందుతుంది.

జగన్ సర్కార్ శుభవార్త.. ఉచితంగా నిత్యావసర సరుకులు!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమపై వర్షాల ప్రభావం అంతగా లేకపోయినా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు వర్షాలు, వరదల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో వర్షాలు, వరదల ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ వరదల వల్ల వందల సంఖ్యలో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

తాజాగా జగన్ సర్కార్ వర్షాలు, వరదల వల్ల నిరాశ్రయులైన వాళ్లకు శుభవార్త చెప్పింది. వరద బాధితులకు ఉచితంగా ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం నుంచి జీవో విడుదలైంది. రాష్ట్రంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో అధికారులు బాధితుల వివరాలను సేకరించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. బాధితులకు సరుకులు అందే విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల రేషన్ బియ్యం, లీటర్ పామాయిల్, కిలో కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కిలో ఆలుగడ్డలు ఇవ్వనుంది. వేగంగా నిత్యావసర సరుకుల పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జగన్ సర్కార్ ఆదేశించింది. మరోవైపు పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు నగదు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జగన్ సర్కార్ ప్రజా సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రయోజనం చేకూర్చుతూ ఉండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. వారి ఖాతాల్లో రూ. 5 వేలు సాయం..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. విద్య, వైద్య రంగాలతో పాటు పేదలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయాల అమలు దిశగా అడుగులు వేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకున్న వారికి 5 వేల రూపాయలు ఖాతాల్లో జమ చేస్తున్నారు.

గత పది నెలల్లో జగన్ సర్కార్ ఏకంగా 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా కింద సాయం చేసింది. ఇందుకోసం ఏకంగా 134 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా చికిత్స పొందితే జగన్ సర్కార్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోందని వెల్లడించారు.

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా స్కీమ్ కుటుంబ పెద్దలు కోలుకునే సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సీఎం జగన్ ముందుచూపుకు ఈ నిర్ణయం మచ్చుతునక అని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 836 జబ్బులకు వైయస్సార్ ఆరోగ్య ఆసరా స్కీమ్ ద్వారా సహాయం అందుతోంది. రోగి చికిత్స చేయించుకునే సమయంలోనే ఆస్పత్రి సిబ్బంది రోగికి సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నారు.

ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి రోగి ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉన్నారనే వివరాలను బట్టి రోజుకు 225 రూపాయల చొప్పున గరిష్టంగా నెలకు 5 వేల రూపాయలు ఇస్తారు. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్లు ఈ పథకాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరికైనా బ్యాంకు ఖాతా లేకపోతే వాళ్లు కుటుంబ సభ్యుల ఖాతాను ఇవ్వవచ్చు.