Tag Archives: health tips

బరువు తగ్గాలనుకుంటున్నారా.. భోజనం తర్వాత ఇది తప్పకుండా తాగాల్సిందే?

మనం నిత్యం ఎన్నో రకాల వంటకాలు రుచి చూస్తూ ఉంటాం.అందులో కొన్ని ఆరోగ్యానికి హాని కలిగించేవి కొన్ని అయితే మరి కొన్ని వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. అందులో మజ్జిగ, లేదా బట్టర్ మిల్క్, లస్సీ ఇలా వివిధ రకాలుగా పేర్లు పిలుస్తూ ఉంటారు. పెరుగును చిలికితే మజ్జిగ వస్తుంది. ఇలా చిలికిన మజ్జిగ సుగంధ ద్రవ్యాల మిశ్రమం అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచి చేకూర్చడంతో పాటుగా మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

అంతే కాకుండా బరువు తగ్గడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి మజ్జిగ ఎంతో ఉపయోగపడుతుంది.
మజ్జిగలో కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. దీన్ని రోజూ మీరు తినే ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయి. మజ్జిగలో కాల్షియంతో పాటు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి.

కొవ్వులు తక్కువగా ఉన్న మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ అని పిలువబడే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అయితే, ఫెమినా ఇన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మజ్జిగ ఎలా తయారు చేసినా దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. ఆహారంతో పాటు మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.ఇది ఎసిడిటీని అదుపు చేసి ఎముకలను బలపరుస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారికి మజ్జిగ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మజ్జిగ ప్రోబయోటిక్ అంటే అందులో ఆరోగ్యకరమైన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు కూడా సహాయపడుతుంది.

రొయ్యలు అంటే ఇష్టం లేదా.. అయితే ఈ ఉపయోగాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు..

రొయ్యలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు తింటారు. దాదాపు అందరూ దీనిని ఇష్టపడే వాళ్లే. కాకపోతే వాళ్లకు సముద్రం, నదులు దగ్గరగా ఉండటంతో అవి అందుబాటులో దొరుకుతాయి. అయితే కొంతమంది వీటిని తినడానికి ఇష్టపడరు.

కానీ వీటి వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు. వాటి గురించి తెలుసుకుందాం.. అయితే ఈ రొయ్యల్లో ఎక్కువగా నాణ్యమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. తరచూ డైట్‌లో రొయ్యలకు చోటిస్తే.. కావాల్సినతం బలం వస్తుంది. అతి తక్కువ ఫ్యాట్‌ ఉండే మాంసాహారం కేవలం రొయ్యలు మాత్రమే. వీటితో రకరకాల కూరలు వండుకోవచ్చు. ఏది వండినా రుచికరంగానే ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మెదడు, నరాల సంబంధిత జబ్బులు కూడా వచ్చే అవకాశం తక్కువ.

రక్త ప్రసరణ సక్రమంగా జరిగేట్లు సహాపపడతాయి. రొయ్యల్ని తినటం వల్ల థైరాయిడ్‌ సమస్యలు తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా దీనిలో క్యాన్సర్ రాకుండా సెలీనియం అనే పదార్థం ఉంటుందట. ఇది శరీరంలో క్యాన్సర్ సెల్ ను పెరగనీయకుండా నియంత్రిస్తుంది. ఇక దంతాలు, ఎముకలకు గట్టి దనాన్ని ఇస్తుంది. చర్మం ఎంతో మృదువుగా తయారవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రక్త హీనత ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే.. ఆ వ్యాధి నుంచి బయటపడొచ్చు. కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా అనేక రకాల వ్యాధులు దరి చేరకుండా.. ఒక వేళ వ్యాధి వచ్చినా.. దీని ద్వారా నియంత్రణ చేసుకోవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తరచూ తుమ్ములతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

సాధారణంగా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు లేదా ఏదైనా దుమ్ము ధూళి కారణంగా తుమ్ములు రావడం సర్వసాధారణం. ఇక ముఖ్యంగా వర్షాకాలం చలికాలంలో ఈ సమస్య చాలా మందిని వెంటాడుతుంది. ఇలా తరచూ తుమ్మల సమస్యతో బాధపడేవారు ఈ చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

మన శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనపడినప్పుడు తుమ్ములు వస్తాయి అదేవిధంగా మన ముక్కులో శ్లేష్మ పొర ఉంటుంది దీనిలో ఉన్నటువంటి కణజాలాలు కణాలు బయట ఏదైనా వాసన వీటిని ఉత్తేజపరిస్తే అప్పుడు తుమ్ములు రావడం అనేది జరుగుతుంది. అయితే తరచూ వచ్చే తుమ్ముల నుంచి బయట పడాలంటే ఈ ఇంటి నివారణ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి.

దీనిలో ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. కనుక తరచు తేనెని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా అధిక తుమ్మల సమస్యతో బాధపడేవారు ఆవిరి పట్టడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఆవిరి పట్టడం వల్ల మన శరీరానికి చలి ప్రభావాన్ని తగ్గించి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి మార్గాన్ని సులభతరం చేస్తుంది.

విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నప్పుడు తుమ్ములు రాకుండా ఉంటాయి. పాలలో చిటికెడు పసుపు కలుపుకొని రోజు తాగాలి ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అలర్జీ సమస్యలు నుంచి విముక్తి కల్పించి తుమ్ములు రాకుండా కాపాడుతుంది.

ఏ వయస్సు వారికి.. ఎలాంటి వ్యాధులు వస్తాయి.. ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

వయస్సు పెరుగుతున్నా కొద్ది ఆరోగ్యం క్షీణించడం అనేది సహజం. ఎవరైనా దాదాపు 40 ఏళ్ల వరకు ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు. 40 నుంచి చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా వచ్చే వ్యాధుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్, గుండెపోటు, డయాబెటీస్ వస్తుంటాయి. ఇవి పురుషులకు వచ్చే వ్యాధులు.

ఇలా వయస్సు మీద పడుతున్నా కొద్ది వస్తుంటాయి. అయితే ఇలా వచ్చినప్పుడే జాగ్రత్త పడే కంటే.. రాకుండా ఉండటానికి ఏం చేయాలో చాలా మంది ఆలోచించరు. దాని కోసం మంచి ఆహారం, వ్యాయామం లాంటివి చేస్తే జబ్బులు వచ్చే సమయం అనేది కాస్త దూరం జరుగుతుంది. దాదాపు ఎక్కువ శాతం 20 ఏళ్ల లోపు వారికి ఎలాంటి వ్యాధులు అనేవి రావు.

ఈ దశను గోల్డెన్ దశ అంటారు. ఇక 20 నుంచి 30 సంవత్సరాల వయస్సులో డ్రగ్స్, ఆల్కహాల్, పొగతాగడం, మానసిక అసమతుల్యతలతో బాధపడుతుంటాం. ఈ అలవాట్లు 50 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఇక 40 నుంచి 50 ఏళ్ల మధ్యలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. 50 సంవత్సరాల పైన పడితే, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ లేదా పేగు కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి.

అయితే ఇవి రాకుండా.. ఎప్పటికప్పుడు ఆసుపత్రుల్లో చెకప్ చేయించుకుంటూ జాగ్రత్తగా ఉంటే.. ఇలాంటి సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ముందుగానే దానికి తగ్గట్లు చికిత్స తీసుకోవచ్చు. అంతే కాకుండా సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు.. ప్రతీ రోజు నడక, వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హెర్బల్ టీలు తాగడం వల్ల ఇన్ని ఉపయోగాలా..? తెలిస్తే మీరు అస్సలు వదలరు..!

హెర్బల్ టీని తాగితే ఆరోగ్యకరంగా ఉంటారు. దీనికి ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ తాగడానికి మాత్రం సంశయిస్తుంటారు. ఇది తాగితే ఎన్ని లాభాలో తెలిస్తే.. ప్రతీ రోజు ఒక కప్పు అయినా తాగుతారు. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఒత్తిడి నుంచి పూర్తిగా బయటపడేస్తుంది. అంతే కాకుండా.. దీనిలో యంటీఆక్సిడెంట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి.

దీని ద్వారా మన శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల బారి నుంచి కాపాడటంలో సహాయపడతాయి. శరీరంలో ఎక్కడైనా వాపు, రక్తం గడ్డకట్టడం.. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టీ రుచిగా ఉండాలి, కానీ.. హెల్దీ గా ఉండాలి అనుకునే వారికి హెర్బల్ టీలు మంచి ఆప్షన్. కాఫీ, ట్రూ టీ లో లాగా హెర్బల్ టీలో కెఫీన్ ఉండదు.

నిద్ర లేమితో బాధపడే వారు దీనిని దర్జాగా తీసుకోవచ్చు. మనసునీ, శరీరాన్నీ ప్రశాంతంగా చేసి హాయిగా నిద్ర పట్టేటట్లు చేస్తాయి. వ్యాయామం లేదా మరేదైనా శారీరకశ్రమ చేసినప్పుడు అలసట అనిపిస్తుంటుంది. ఆ సమయంలో హెర్బల్ టీ తాగడం వల్ల హాయిగా అనిపిస్తుంది. శరీరంలో ఎక్కడైనా పెయిన్ అనిపించినప్పుడు.. ఇది పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది.

అయితే ఇది తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అవేంటంటే.. హెర్బల్ టీలు తీసుకునే సమయంలో కొంచెం కొంచెమే తీసుకోవాలి. అవి కొద్దిగా తీసుకున్నప్పుడు ఎంత ఆరోగ్యమో ఎక్కువగా తీసుకుంటే అంత అనారోగ్యం కూడా. హెర్బల్ టీని రోజుకి ఒకటి రెండు చిన్న కప్పుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. హెర్బల్ టీలో రకాలు చామోమిల్ టీ, పెప్పర్మింట్ టీ, జింజర్ టీ, సినమన్ టీ, మింట్ టీ, డాండిలయన్ టీ లు ఉన్నాయి.

ఉదయం లేవగానే ఇలాంటి పనులు చేయకండి.. అవేంటో తెలుసుకోండి..

ఉదయం లేవగానే చేసే పనులు వివిధ రకాలుగా ఉంటాయి. ఒకొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. కొంతమంది ఉదయం లేవగానే వాళ్లకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి వల్లనే అనారోగ్యానికి పాల్పడుతుంటారు.

వాళ్లు ఏం తప్పులు చేస్తుంటారు.. ఉదయం లేవగానే ఏం చేయాలి.. అనే దాని గురించి తెలుసుకుందాం.. ఉదయం లేవగానే చాలామంది టీ, కాఫీలు తాగుతుంటారు. అలా తాగాడం చాలా ప్రమాదకరం. కడుపులో ఏం తినకుండా కేఫిన్ లాంటివి తీసుకుంటే.. అల్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, ఉదయం లేవగానే ఆ గ్లాస్ వాటర్ తీసుకోవాలి.

అనంతరం టీ లేదా కాఫీ వంటి పానియాలు తీసుకోవాలి. వంట గదిలో పనులు చేసుకునే వారు కూడా ఏం తినకుండా చేస్తుంటారు. అలా చేస్తే శరీరానికి అలసట వస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో ఎలాంటి పనులు చేయకూడదు. ఎవరైనా.. ఉదయం లేచిన తర్వాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ తర్వాత పనులు మొదలు పెట్టాలి.

ఇక ఉదయం లేచిన తర్వాత వెంటనే హడావుడిగా కాకుండా.. నెమ్మదిగా లేచి.. కాసేపు కూర్చోవాలి. తర్వాత కొద్దిసేపు తూర్పువైపు తిరిగి కూర్చోవాలి. అప్పుడు మనస్సుకు ప్రశాంతంగా ఉండి.. రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఇలా పైన చెప్పిన విధంగా చేస్తే.. ఎవరికైనా ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. అనోరోగ్యం దరి చేరకుండా ఉంటుంది.

చలికాలంలో బరువు తగ్గాలంటే.. ఈ పండ్లను తీసుకోండి..!

ఎవరికైనా వయస్సుకు మించి బరువు ఉంటే.. అనేక రోగాలు ముట్టడిస్తాయి. ఏదైనా ఒక్క రోగం వచ్చిందంటే.. ఇక ఒకదాని తర్వాత ఒకటి క్యూ కట్టుకుంటూ వస్తాయి. అందుకే బరువు అనేది మనిషికి చాలా ప్రమాదకరం. అయితే లావు తగ్గాలనుకుంటే ఎవరైనా చెప్పే మొదటి మాట వ్యాయామం. ప్రతీ రోజు కనీసం గంట అయినా వ్యాయామం చేయాలని చెబుతుంటారు.

ఆహార నియమాల్లో కూడా కొన్ని మార్పులను చేస్తుంటారు. ఇవి కాకుండా.. మనం రోజూ తినే డైట్ చార్ట్ లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది.. ప్రస్తుతం చలికాలం. ఈ కాలంలో ఎక్కవగా పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లు ఏంటో.. ఇప్పడు ఇక్కడ చూద్దాం.. సిట్రస్ జాతి పండ్లను ఎక్కువగా తినాలి.. అంటే అందులో విటమిన్ సీ అధికంగా ఉంటుంది.

దీని వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కివీ పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి.. బరవు తగ్గుతారు. విటమిన్ ఏ, ఫైబర్ అధికంగా ఉన్న పండ్లను తింటే.. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. విటమిన్ ఏ అనేది ఎక్కువగా క్యారెట్లలో ఉంటుంది.

దానిని రోజూ కనీసం ఒకటి తినే విధంగా చూసుకోవాలి. మరో విషయం ఏంటంటే.. వేసవిలో విరివిగా దొరికే .. పుచ్చకాయలను ఈ సిజన్లో కూడా తినొచ్చు. ఫైబర్ అధికంగా ఉండటంతో.. బరువు వెంటనే తగ్గుతారట. నీటి శాతం ఎక్కువగా ఉండటంతో తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు యాపిల్స్, దానిమ్మ పండ్లను కూడా తీసుకోవాలని..దీంతో బరువు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

సన్నగా ఉండే వాళ్లు వ్యాయామం, ఎక్సర్‌సైజ్‌లు చేయొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?

చాలామంది బరువు లేదా లావు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే వ్యాయామం చేస్తారని.. సన్నగా ఉన్నవాళ్లకు అవసరం లేదు అని అనకుంటుంటారు. కానీ అది నిజం కాదు. వ్యాయామం అనేది ప్రతీ ఒక్కరికీ అవసరమే. సన్నగా ఉండే వారికి లావుగా ఉండే వారికి వచ్చే సమస్యలు రాకపోవచ్చు కానీ.. మరేదైనా ఇతర సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది.

అందుకే వ్యాయామంతో పాటు.. డైట్ అనేది సన్నగా ఉండే వారికి కూడా అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే.. సన్నగా ఉండేవారు కోచ్‌ ఆధ్వర్యంలో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. వాళ్ల బాడీని సిక్స్ ప్యాక్ గా మార్చుకోవాలంటే.. తప్పనిసరిగా.. కోచ్ సమక్షంలోనే చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక స్కిప్పింగ్ విషయానికి వస్తే.. దీనిని ఎవరైనా చేయొచ్చు.. లావుగా ఉండేవారైనా.. సన్నగా ఉండేవారికైనా మంచిదే.

ఎనిమిది నిమిషాల నడక చేస్తే.. 10 నిమిషాల స్కిప్పింగ్ తో సమానం. స్కిప్పింగ్ తాడు ఎంచుకునే సమయంలో జాగ్రత్తగా ఉండలి. మన ఎత్తు కంటే అది రెండింత్తలు ఉండాలి. ఈ స్కిప్పింగ్ అనేది సన్నగా ఉన్నవాళ్లు చేయొచ్చు. దీనికి ఎలాంటి కోచ్ లు అవసరం లేదు. ఇక నడక విషయానికి వస్తే.. ఎవరైనా చేయొచ్చు.

ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది. తిన్న అన్నం జీర్ణం అవుతుంది. అంతే కాకుండా.. కండరాలకు, నరాలకు కాస్తంగా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లాంటివి దరి చేరకుండా ఉంటాయి. రోజూ అరగంట వాకింగ్‌ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్‌ వచ్చే ముప్పు చాలావరకు తగ్గుతుందట.

ఉదయాన్ని కాఫీ, టీ తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

ఎవరికైనా ఆరోగ్యం మంచిగా ఉంటే.. ఎంత పని అయినా చేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు. ఆరోగ్యం ఉంటే.. కొన్ని కోట్లు ఆస్తి మన దగ్గర ఉన్నట్లే. ఇటీవల కరోనా కారణంగా ఎంతమంది తమ ప్రాణాలను విడిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎంతో మంది ఉన్నతులు కూడా ఉన్నారు.

వాళ్లను ఆ డబ్బులు బతికించలేకపోయాయి. కొంతమంది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ప్రాణాలు మాత్రం తిరిగి రాలేదు. అలా అతలాకుతలం చేసింది మాయదారి కరోనా మహమ్మారి. అందుకే ఆరోగ్యం బాగా చూసుకుంటే.. ఎంతటి దానిని అయినా సాధించవచ్చు అనేది అదొక్కటే ఉదాహరణ. కరోనా కారణంగా కొంతమంది తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనేది వాస్తవమే అయినా.. చిన్న చిన్న తప్పుల కారణంగా.. అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి.

అవేంటంటే.. రోజూ వారి దిన చర్యలో భాగంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ప్రతీ ఒక్కరికీ అలవాటు. ఇక్కడే కొంతమంది తప్పు చేస్తున్నారు. తీసుకునే ఆ ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం కాఫీ, టీ తాగేవారు ఖాళీ కడుపుతో తీసుకోవడంతో.. ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

వాటివలన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని వీలైనంత వరకు ఉదయాన్నే కాఫీకి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ఎసిడిటీ ఎక్కువగా ఫామ్ అవుతుందని.. ఇది పేగులపై ప్రభావం చూపుతుందని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతనే కాఫీ, టీలాంటికి ఒక కప్పుతాగాలని చెబుతున్నారు. లేదంటే పరిగడుపున మంచి నీళ్లు తాగి.. కాస్త సమయం తీసుకొని తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

దగ్గు, జలుబు, గొంతునొప్పి తగ్గాలంటే.. ఈ చిన్న చిట్కాను వాడండి..!

వాతావరణంలో మార్పులు వస్తే.. ఎవరికైనా జలుబు చేయడం అనేది సహజం. కొందరికి ఆ జలుబు రావచ్చు.. లేకపోతే రాకపోవచ్చు. వీటినే సీజనల్ వ్యాధులు అని కూడా మనం పిలుచుకుంటాం. కొంతమందికి ఇలా జలుబుతో పాటు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే ఇవి వచ్చిన వెంటనే తగ్గవు. కొన్ని రోజుల వరకు సమయం తీసుకుంటాయి.

అవి ఉన్నంత సేపు ఎంతో బాధను కలిగిస్తాయి. ఏ పని చేయాలన్నా విసుగు పుడుతుంది. చలికాలంలోనే ఎక్కువగా ఇలాంటి వ్యాధులు వస్తుంటాయి. ప్రస్తుతం శీతాకాలం నడుస్తుంది కనుక ఇవి రావడం సర్వసాధారణం. అయితే వీటిని మందులు నయం చేయలేకపోతే.. ఎన్ని వాడిననా తగ్గడం లేదు అని అనిపిస్తే.. ఇక్కడ ఒక చిన్న చిట్కాను వాడండి.

వెంటనే కాకున్నా.. కొంత సమయం తర్వాత అయినా ఉపశమనం కలుగుతుంది. దానికి ఇంట్లో దాల్చిన చెక్క ఉంటే సరిపోతుంది. దానిని దంచి పొడిగా చేసుకోవాలి. ఇంట్లో పొడిని మాత్రమే వాడండి.. దుకాణంతో దొరికే పొడిని మాత్రం వాడొద్దు. దీంతో పాటు కొంత తేనే, పసుపు కూడా అవసరం ఉంటుంది.

రెండు స్పూన్ల తేనె, చిటికెడు పసుపు, ఒక స్పూన్ దాల్చిన చెక్కను ఒక బౌల్ లో తీసుకొని అందులో వేయాలి. ఇలా వేసి.. ఆ మూడు పదర్థాలు బాగా కలిసే విధంగా తిప్పాలి. తర్వాత ఉదయం, సాయంత్రం ఆ మిశ్రమాన్ని కొంత గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కలుపుకొని తాగాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు.. రోజూ రెండు పూటలు చేస్తే.. మీకు ఉపశమనం కలుగుతుంది.